»   » ఫ్లాఫ్ ల్లోంచి బయిటపడేస్తాయా? :దాసరి గారి టైటిల్,ఆచారి పాత్రలో బ్రహ్మీ, అమెరికా లింక్

ఫ్లాఫ్ ల్లోంచి బయిటపడేస్తాయా? :దాసరి గారి టైటిల్,ఆచారి పాత్రలో బ్రహ్మీ, అమెరికా లింక్

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్: శ్రీను వైట్ల పుణ్యమా అని సెకండ్ ఇన్నింగ్స్ విజయవంతంగా పూర్తి చేసాడు బ్రహ్మానందం. అయితే సెకండ్ ఇన్నింగ్స్ చివరలో వరస ఫ్లాఫ్ లు, అదీ సినిమా హిట్ అయినా తన క్యారక్టర్ ఫ్లాఫ్ అవటం, బ్రహ్మీ రిపీట్ యాంటిక్స్ పై విమర్శలు వచ్చాయి, ఆఫర్స్ తగ్గిపోయాయి. అయితే మొన్న సంక్రాంతికి వచ్చిన ఖైదీ నంబర్ 150 సూపర్ హిట్ అవటంతో ... అందులో మెగాస్టార్ పక్కన.. కనపడటంతో కాస్త ఊపిరి పీల్చుకున్నాడు.

అయితే.. త్వరలో ఈ రిటైర్ అయిపోయిన స్దితిలో ఉన్న ఈ స్టార్ కమెడియన్ కి మళ్లీ తన సత్తా చూపే అవకాశం వచ్చిందని తెలుస్తోంది. బ్రహ్మీ ప్రధాన పాత్రలో 'ఆచారి అమెరికా యాత్ర' అనే సినిమా తెరకెక్కబోతోంది. 'ఆచారి అమెరికా యాత్ర' పేరుతో దాసరి గారు అప్పట్లో ఓ కామెడీ నవల రాసారు. ఆ నవలనే తీస్తున్నారో లేదో తెలియదు కానీ, టైటిల్ అదే పెడుతున్నారు. ఇంతకీ ఈ చిత్రంలో హీరో ఎవరనుకుంటున్నారు మంచు విష్ణు.

'Achari America Yatra': Brahmanandam doing Achari character

గత కొంతకాలంగా మంచు విష్ణుకి రీసెంట్‌గా ఏ సినిమా కలిసి రావడం లేదు. రాంగోపాల్‌వర్మతో చేసిన సినిమాలు పెద్ద దెబ్బ కొట్టాయి. గురువు గారు దాసరితో చేసిన ఎర్రబస్సు అతని మార్కెట్‌ని పడేసాయి. ఇక రీసెంట్ గా రిలీజైన లక్కున్నోడు చిత్రానికి మినిమం ఓపినింగ్స్ కూడా రాలేదు. ఇలాంటి సిట్యువేషన్ లో బ్రహ్మానందం ని అడ్డం పెట్టి ఒడ్డున పడేందుకు ప్రయత్నిస్తున్నాడు విష్ణు.

గతంలో తనకి హిట్టిచ్చిన కామెడీ జోనర్‌నే నమ్ముకుని, తనకు కలిసొచ్చిన నాగేశ్వరరెడ్డితోనే ముందుకు వెళ్ళాలని విష్ణు డిసైడ్‌ అయ్యాడు. తన తదుపరి చిత్రంలో పూర్తి స్థాయి కామెడీ పాత్ర చేస్తున్నాడు. 'ఆచారి అమెరికా యాత్ర' టైటిల్ తో జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో విష్ణు ఒక కామెడీ చిత్రానికి శ్రీకారం చుడుతున్నాడు.

ఇంతకు ముందు కూడా బ్రహ్మి, మంచు విష్ణు కాంబినేషన్ లో వచ్చిన ఢీ, దేనికైనా రెడీ చిత్రాలు సూపర్ హిట్ అవటంతో...మళ్లీ అదే కాంబోని నమ్ముకున్నాడు. ఇండస్ట్రీలో చెప్పుకునేదాని ప్రకారం అదుర్స్‌లో బ్రహ్మానందం చేసిన ఆచారి పాత్రకి ఎక్స్‌టెన్షన్‌లా ఇందులోని క్యారెక్టర్‌ వుంటుందని, ఢీ కంటే ఇందులో విష్ణు, బ్రహ్మీ మధ్య కామెడీ పేలుతుందని చెప్పుకుంటున్నారు. వాస్తవానికి అటు విష్ణుకే కాకుండా ఇటు బ్రహ్మానందానికి కూడా కీలక చిత్రమిది.

English summary
Brahmanandam will be playing a full-length comedy character called Achari,Vishnu Manchu will be playing the lead role. The movie will be directed by G Nageswara Reddy.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu