»   »  దోశ సాక్షిగా...: అతడితో హీరోయిన్ అంజలి లవ్ ఎఫైర్ నిజమే?

దోశ సాక్షిగా...: అతడితో హీరోయిన్ అంజలి లవ్ ఎఫైర్ నిజమే?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు హీరోయిన్ అంజలి తెలుగులో కంటే తమిళంలోనే ఎక్కువ సినిమాలు చేసింది. అలా ఆమెకు అక్కడ చాలా పరిచయాలే ఉన్నాయి. కాగా కొంతకాలంగా అంజలి లవ్ ఎఫైర్ తమిళ మీడియాలో హాట్ టాపిక్ అవుతూనే ఉంది.

తనతో పాటు 'జర్నీ' చిత్రంలో నటించిన తమిళ హీరో జై తో ఆమె ప్రేమాయణం కొనసాగిస్తున్నట్లు కొంతకాలంగా రూమర్స్ చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. అయితే పలు సందర్భాల్లో వీరు ఈ వార్తలను ఖండించారు కూడా....

అయితే తాజాగా వీరి లవ్ రిలేషన్ షిప్ నిజమే అనేది సాక్ష్యాలతో సహా రుజువైందంటూ తాజాగా మరోసారి తమిళ మీడియాలో ప్రచారం మొదలైంది.

 దోశ తేల్చిన నిజం

దోశ తేల్చిన నిజం

తమిళ నటుడు జై అంజలి కోసం దోసె వేసి.. ఆమెతో కలిసి దిగిన ఫొటోను షేర్‌ చేశారు. దీనికి అంజలి స్పందిస్తూ.. ‘రుచికరమైన దోసె జై.. ప్రియమైన వ్యక్తులు మన కోసం వండితే ఎంత బావుంటుందో' అని ట్వీట్‌ చేశారు.

దోశ వేసినంత మాత్రాన ప్రేమేనా?

దోశ వేసినంత మాత్రాన ప్రేమేనా?

దోశ వేసినంత మాత్రాన ప్రేమేనా? అనే సందేహం రావొచ్చు. అయితే ఈ దోశ వెనక చాలా స్టోరీ ఉంది. జ్యోతిక నటించిన ‘మగలిర్‌ ముట్టుమ్‌' అనే చిత్రం టీజర్‌ ఇటీవల విడుదలైంది. అందులో ఇంట్లో అందరి కోసం లెక్కకు మించిన దోసెలు వేసే అమ్మ, శ్రీమతి కోసం ఎవరైనా ఒక్క దోసె వేశారా? అనే పాయింట్‌ను ఎత్తి చూపారు. దీంతో హీరో సూర్య తన భార్య జ్యోతిక కోసం ఇంట్లో దోసె వేసి ‘దోసె ఛాలెంజ్‌' అంటూ పలువురు సినీ ప్రముఖులను ట్యాగ్‌ చేశారు.

 అంజలి కోసం

అంజలి కోసం

అమ్మ, శ్రీమతి కోసం దోశలు వేయడమే ఈ చాలెంజ్... కానీ హీరో జై కూడా దీన్ని చాలెంజ్ గా తీసుకుని... అంజలి కోసం దోసె వేసారు. అంజలి కూడా తన ప్రియమైన వ్యక్తిగా జై గురించి ట్వీట్ చేసింది. వీరి మధ్య ప్రేమ ఉందని అనడానికి ఇంతకంటే సాక్ష్యం అవసరం లేదని అంటున్నారు.

అఫీషియల్‌గా ఖరారు కాలేదు

తమిళ మీడియాలో వినిపిస్తున్న రూమర్సే తప్ప... తాము ప్రేమలో ఉన్నట్లు అటు జై కానీ, ఇటు అంజలి కానీ అఫీషియల్ గా వెల్లడించలేదు.

English summary
Last year, Jai and Anjali had confirmed their relationship through media interactions and also during the birthday celebrations of the actress. The latest update is that Jai has accepted ‘Magalir Mattum Dosa Challenge’ and made a tasty dosa for his ladylove Anjali.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu