twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అఙ్ఞాతవాసి దెబ్బతో గిలగిల.. తగ్గిన పవన్, త్రివిక్రమ్.. డబ్బులు వాపస్..

    By Rajababu
    |

    దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను పక్కన పడితే అఙ్ఞాతవాసి చిత్రం పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌కు కోలుకోలేని దెబ్బ కొట్టింది. రాజకీయాల్లోకి పూర్తి స్థాయి వెళ్లే ముందు పవన్ సెన్సేషనల్ హిట్ కొట్టాలనుకొన్న ఫ్యాన్స్ ఆశలపై త్రివిక్రమ్ నీళ్లు జల్లడంతో పవన్ క్రేజ్ అడ్డంగా పడిపోయింది. ఇప్పటివరకు ఉన్న పరువే కాదు.. పైసలు కూడా పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతున్నదనే మాట మీడియాలో బలంగా వినిపిస్తున్నది.

    బాహుబలిని కొట్టి

    బాహుబలిని కొట్టి

    అఙ్ఞాతవాసి చిత్రం రిలీజ్ తర్వాత తొలి రోజే బాహుబలి2 రికార్డులను అధిగమించింది. సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో రెండో రోజు సినిమా కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. టాలీవుడ్‌లో ఫ్లాపైన సినిమాల్లో అఙ్ఞాతవాసిదే రికార్డు అనే చెప్పుకొంటున్నారు.

     షాకిచ్చిన కలెక్షన్లు

    షాకిచ్చిన కలెక్షన్లు

    తొలిరోజు నికరంగా రూ.27 (ప్రపంచవ్యాప్తంగా రూ.60 కోట్లకుపైగా) కోట్లు వసూలు చేసిన అఙ్ఞాతవాసి చిత్రం రికార్డు సృష్టించింది. అయితే సినిమాపై ప్రేక్షకుడు పెదవి విరవడంతో రెండో రోజు వసూళ్లు షాకిచ్చాయి.

    Recommended Video

    'అజ్ఞాతవాసి' ప్లస్ & మైనస్లు ఇవే !
     డిస్టిబ్యూటర్ల పరిస్థితి దారుణమట

    డిస్టిబ్యూటర్ల పరిస్థితి దారుణమట

    ఇక తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. గుంటూరు ప్రాంతంలో ఈ చిత్రం సుమారు రూ.4 కోట్ల వరకు వసూలు చేసిందట. ప్రతికూల టాక్ రావడంతో ఈ చిత్రం కేవలం రూ.28 లక్షలు వసూలు చేయడం డిస్టిబ్యూటర్లను ఆందోళనలో పడేసింది.

     త్రివిక్రమ్ డబ్బులు వెనక్కి

    త్రివిక్రమ్ డబ్బులు వెనక్కి

    ఇక ఈ సినిమాకు ముందు అఙ్ఞాతవాసిని కాపీరైట్ వివాదం వెంటాడింది. దాంతో బాలీవుడ్‌లోని ఓ సంస్థకు భారీ మొత్తంలో ముట్టజెప్పాల్సిన అవసరం వచ్చింది. దాంతో దర్శకుడు త్రివిక్రమ్ తనవంతు బాధ్యతగా రూ.10 కోట్లు తిరిగి ఇవ్వడానికి సిద్దపడినట్టు మీడియాలో ఓ వార్త ప్రచారం జరుగుతున్నది.

     డిస్టిబ్యూటర్లకు అండగా పవన్

    డిస్టిబ్యూటర్లకు అండగా పవన్

    ఇక అఙ్ఞాతవాసి చిత్రంతో దారుణంగా నష్టపోయిన డిస్టిబ్యూటర్లకు పవన్ కల్యాణ్ అండగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తున్నది. నష్టాల్లో ఉన్న డిస్టిబ్యూటర్లను ఆదుకోవడానికి రూ.15 కోట్లు ఇచ్చేందుకు పవర్ స్టార్ సిద్ధంగా ఉన్నారనేది తాజాగా వెలుగులోకి వచ్చింది.

     ఏపీలో స్పెషల్ షో రద్దు

    ఏపీలో స్పెషల్ షో రద్దు

    రిలీజ్‌కు ముందు అఙ్ఞాతవాసి చిత్రానికి వచ్చిన క్రేజ్ సొమ్ము చేసుకొందామని ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. తొలి రోజు బాగానే ఉన్నా... ప్రేక్షకులు లేని కారణంగా రెండో రోజు థియేటర్లు వెలవెలబోయాయి. దాంతో ఏపీలో స్పెషల్ షో రద్దు చేసినట్టు సమాచారం.

    English summary
    The distributors have made plans for a massive release of Agnyaathavaasi movie across North America. They have already booked 576 screens in the USA and are still finding more to add theaters to it which is a very big release for any Indian movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X