హరిహర వీరమల్లు కోసం మరో భారీ సెట్.. అలా ప్లాన్ చేసిన క్రిష్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక పక్క ఏపీలో రాజకీయాలు చూసుకుంటూనే మరో పక్క సినిమాల్లో నటిస్తున్నాడు. ఇప్పటికే ఆయన నటించిన వకీల్ సాబ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పటికే ఆయన మరో నాలుగు సినిమాలకు ఓకే చెప్పాడు.. అందులో రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉండగా మరో రెండు సినిమాలు స్క్రిప్ట్ పూర్తి చేసుకుని షూటింగ్ కి రెడీగా ఉన్నాయి.

నాలుగు సినిమాల్లో జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్ల సినిమా షూటింగ్ దశలో ఉంది, అలాగే నాగ వంశీ నిర్మాణంలో అయ్యప్పనుమ్ కోశియం రీమేక్ కూడా షూటింగ్ దశలో ఉంది ఈ సినిమాకి సాగర్ కే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రెండు సినిమాలు కాకుండా హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఒక సినిమా, సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో మరో సినిమా కూడా పవన్ కళ్యాణ్ ఓకే చేశారు. అయితే క్రిష్ జగర్లముడి దర్శకత్వంలో పవర్‌ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా మళ్ళీ వార్తల్లోకి వచ్చింది.

 Agra fort set to be erected for Pawan Kalyan’s Harihara veeramallu

మొగల్స్ మరియు కుతుబ్ షాహిస్ శకం నేపథ్యంలో 17 వ శతాబ్దంలోనే ఈ సినిమా కధ సెట్ చేశారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా యూనిట్ నుంచి అందుతున్న తాజా అప్డేట్ ఏమిటంటే, ఈ సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి హైదరాబాద్‌లో ఒక భారీ ఆగ్రా కోటను నిర్మించాలని చిత్ర నిర్మాతలు యోచిస్తున్నారు.

ఈ సెట్ నిర్మించే బాధ్యత ఒక ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్‌కు ఇవ్వబోతున్నారని, ఆ వెంటనే ఈ సెట్ నిర్మాణం పని మొదలవుతుందని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా యూనిట్ ఒక చార్మినార్ సెట్ మరియు మరికొన్ని చారిత్రక సెట్లను నిర్మించినట్లు వార్తలు వచ్చాయి. ఇక ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X