»   » ఐశ్వరరాయ్ మెగాస్టార్ కోసమా.. చరణ్ కోసమా? ఉయ్యాలవాడలో మరో సెన్సేషనల్ న్యూస్!

ఐశ్వరరాయ్ మెగాస్టార్ కోసమా.. చరణ్ కోసమా? ఉయ్యాలవాడలో మరో సెన్సేషనల్ న్యూస్!

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  సాధారణంగా పెళ్లయిన హీరోయిన్లకు వెండితెర మీద నూకలు చెల్లినట్టే. ఇక ఆ హీరోయిన్‌కు పిల్లలు పుడితే ఇంకా చెప్పనక్కర్లేదు. అయితే ఈ రెండు విషయాలను అధిగమించిన తారల్లో మాజీ ప్రపంచసుందరి ఐశ్వర్యరాయ్ ముందు ఉంటుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇటీవల బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహర్ రూపొందించిన యే దిల్ హై ముష్కిల్ చిత్రంలో ఐశ్వర్య అందాల ఆరబోత, గ్లామర్ యువతను పిచ్చెక్కించింది. అయితే తాజాగా ఐశ్వర్య పేరు టాలీవుడ్‌లో ప్రముఖంగా వినిపిస్తున్నది. అదేమిటంటే.. ఉయ్యాలవాడలో ఆమె పేరు ఖారారైనట్టు వార్తలు వెలువడుతున్నాయి.

  విద్యాబాలన్ కాదు.. ఐశ్వర్య పేరు ఖారారు...

  విద్యాబాలన్ కాదు.. ఐశ్వర్య పేరు ఖారారు...

  ఖైదీ నంబర్ 150తో మెగాస్టార్ రీ ఎంట్రీ అదిరింది. ఆ చిత్రం తర్వాత తన 151వ చిత్రంగా ఉయ్యాలవాడ నరసింహరెడ్డి అనే సినిమాపై ప్రస్తుతం మెగాస్టార్ దృష్టిపెట్టారు. ఈ చారిత్రాత్మక చిత్రంలో హీరోయిన్‌గా నటింపజేసేందుకు పలువురు పేర్లను పరిశీలిస్తున్నారు. అందులో ఐశ్వర్యరాయ్ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. తొలుత విద్యాబాలన్ పేరును అనుకొన్నా.. చివరికి ఐష్ పేరునే ఖారారు చేసినట్టు వార్తలు వెలువడుతున్నాయి. త్వరలోనే అధికారికంగా ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉందనే వార్త ఫిలింనగర్‌లో ప్రచారం జరుగుతున్నది.

  యోధుడి సరసన

  యోధుడి సరసన

  మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ చిత్రంలోనూ ఐశ్వర్యారాయ్‌ నటించే అవకాశాలున్నాయనే మరో వార్త మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది. ఓ పక్క సుకుమార్‌ దర్శకత్వంలో నటిస్తూనే రాంచరణ్ మణిరత్నం చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమా పేరును ‘యోధ'గా ఖరారు చేశారనే వార్త కూడా వైరల్ అవుతున్నది. ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్ర కోసం ఐశ్వర్యారాయ్‌ని ఎంచుకొన్నట్టు తెలుస్తున్నది.

  అరుదైన ఘనత సాధించనున్న..

  అరుదైన ఘనత సాధించనున్న..

  ఈ వార్తలు నిజమైతే ఒకేసారి తండ్రి చిరంజీవి, కుమారుడు చరణ్‌ సినిమాల్లో నటించిన అందాలతార ఐష్ ఓ రికార్డును తన ఖాతాలో వేసుకొనే అవకాశం ఉంది. ఒకవేళ అదే నిజమైతే మెగా అభిమానులకు పండుగంటే పండుగే. ఈ వార్తలో ఎంత నిజముందో లేదో తెలియదు గానీ.. సోషల్ మీడియాలో మెగా అభిమానులు విశేషంగా స్పందిస్తున్నారు.

  ఉయ్యాలవాడలో అమితాబ్..

  ఉయ్యాలవాడలో అమితాబ్..

  ఇదిలా ఉండగా, ఉయ్యాలవాడకు సంబంధించి మరో సెన్సేషనల్ వార్త ప్రచారంలో ఉన్నది. బిగ్ బీ అమితాబ్‌ బచ్చన్‌ కూడా చిరు 151వ చిత్రంలో నటించనున్నట్టు తెలుస్తున్నది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి గురువుగా బిగ్‌ బీ నటించనున్నారనేది వార్త సారాంశం. చిత్ర కథలో భాగంగా సెకండాఫ్‌లో వచ్చే బిగ్ బీ పాత్ర చాలా కీలకమని, అందుకే అమితాబ్‌ని ఎంచుకొన్నారని ప్రచారం సాగుతున్నది.

  నేషనల్ మార్కెట్‌పైన మెగాస్టార్ దృష్టి

  నేషనల్ మార్కెట్‌పైన మెగాస్టార్ దృష్టి

  ఉయ్యాల వాడ.'ని తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల చేయాలన్నది కొణిదెల ప్రొడక్షన్ తాజా వ్యూహాం. బాలీవుడ్‌ మార్కెట్‌ని ఆకర్షించాలంటే అక్కడి స్టార్లు ఈ సినిమాలో మెరవాల్సిందే. అందుకే ఐశ్వర్యారాయ్‌, అమితాబ్‌ లాంటి పేర్లను ఈ సినిమాకు జోడిస్తే దేశవ్యాప్తంగా కలెక్షన్లను కొల్లగొట్టవచ్చనేది నిర్మాత చరణ్ ఉద్దేశమని తెలుస్తున్నది. ఒకవేళ బిగ్ బీ, ఐష్ నటిస్తే ‘ఉయ్యాలవాడ..' మార్కెట్‌కు బాలీవుడ్‌లో డోర్లు ఓపెన్ అయినట్టే అనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తమవుతున్నది.

  English summary
  Even after Marriage and Pregnency Aishwarya Rai become hot figure in Bollywood. Now this miss world's news painting tollywood red. Reports suggest that Aish is going to act with Father Chirajeevi, Son Ram Charan too.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more