అఖిల్ ఏజెంట్ కోసం తమిళ్ బ్యూటీ.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!
టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ కావాలని కసితో కష్టపడుతున్న అక్కినేని అఖిల్ 5వ సినిమాతో సాలీడ్ హిట్టు కొట్టేలా ఉన్నాడని అనిపిస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా సాలీడ్ లుక్కుతో షాక్ ఇచ్చాడు. సురేంధర్ రెడ్డి దర్శకత్వంలో చేస్తున్న ఏజెంట్ సినిమా స్పై యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఇక సినిమాలో స్టార్ క్యాస్ట్ కూడా గట్టిగానే ఉంటుందని కథనాలు వెలువడుతున్నాయి.
ముఖ్యంగా హీరోయిన్ విషయంలో అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. వార్తలు ఎన్ని వస్తున్నా కూడా చిత్ర యూనిట్ ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇక ఇటీవల ఒక తమిళ బ్యూటీని ఫైనల్ చేసినట్లు టాక్ వస్తోంది. ఆమె మరెవరో కాదు. నాడోడిగల్ 2 ఫేమ్ అతుల్య రవి. ఆమె అయితే అఖిల్ కు కరెక్ట్ గా సెట్టవుతుందని అనుకుంటున్నారట.

దర్శకుడు సురేందర్ రెడ్డి తన ప్రతి సినిమాలో కూడా హీరోయిన్ పాత్రను ఎదో ఒక విధంగా హైలెట్ చేస్తుంటాడు. కేవలం గ్లామర్ పరంగానే కాకుండా హీరోయిన్ పాత్ర కూడా కథలో కీలకం కావాలని ఆలోచిస్తుంటాడు. ఇక ఫైనల్ గా ఇటీవల అతుల్య రవి గురించి తెలుసుకొని చర్చలు జరిపినట్లు సమాచారం. అయితే ఇంకా అఫీషియల్ గా ఫిక్స్ చేయలేదని తెలుస్తోంది. మరో ఇద్దరు హీరోయిన్స్ ను కూడా చర్చల్లోకి తెచ్చినట్లు సమాచారం. మరి ఫైనల్ గా అఖిల్ తో ఛాన్స్ కొట్టే లక్కీ గర్ల్ ఎవరవుతారో చూడాలి. ఇక అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రానుంది.


Click it and Unblock the Notifications











