»   » నిజమే:అక్కినేని అఖిల్ ఎంట్రీ దర్శకుడు ఖరారు

నిజమే:అక్కినేని అఖిల్ ఎంట్రీ దర్శకుడు ఖరారు

Posted By:
Subscribe to Filmibeat Telugu
Akhil Akkineni
హైదరాబాద్:నాగార్జున రెండవ కుమారుడు అక్కినేని అఖిల్ ఎంట్రీ ఏ దర్శకుడుతో ఉంటుంది...ఎప్పుడు లాంచ్ చేస్తారు అనే విషయం గత కొంత కాలంగా మీడియాలోనూ,సిని పరిశ్రమలోనూ,అభిమానులలోనూ బాగా నలుగుతోంది. అయితే ఎంట్రీ దర్శకుడు దాదాపు ఖరారు అయినట్లే అని విశ్వసనీయ సమాచారం. దర్శకుడు దేవకట్టా తో అ అఖిల్ ఎంట్రీ జరగనుంది. ఈ మేరకు స్క్ర్రిప్టు వర్క్ గత నాలుగైదు నెలలుగా ఈ జరుగుతోందని వినికిడి.

ఇక ఈ చిత్రం యాక్షన్ లవ్ స్టోరీ అని, వచ్చే సంవత్సరం ఈ విషయమై అఫీషియల్ లాంచింగ్ ఉంటుందని తెలుస్తోంది. ఈ విషయం బయిటకు పొక్కకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎందుకంటే దేవకట్టా మార్కెట్ లో క్రేజ్ లో లేని దర్శకుడు. అంతేకాదు ఆయనకు చెప్పుకోతగ్గ హిట్టూ లేదు. దాంతో ఆయనతో అఖిల్ ఎంట్రీ ఎంతవరకూ అనేది అందరినీ ఆలోచనలో పడేస్తుంది. అయితే దేవకట్టా చెప్పిన లైన్ బాగుందని, ఆటో నగర్ సూర్య కూడా చూసిన నాగార్జున వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని చెప్తున్నారు. కానీ ఆటోనగర్ సూర్య రిజల్ట్ ని బట్టే ...నెక్ట్స్ ఏంటనే ఫైనల్ నిర్ణయం ఉంటుందనేది మాత్రం నిజం.

గతంలో అఖిల్ మాట్లాడుతూ... "నేను ఇప్పటిదాకా ఎటువంటి సినిమాను అంగీకరించలేదు. నా మొదటి సినిమాకు సిద్ధపడుతున్నాను" అని తెలిపాడు. ఇప్పటికే రాజమౌళి కుమారుడు కార్తీక్... అఖిల్ తో ఓ షార్ట్ ఫిల్మ్ రూపొందించారు. మాటీవీ షార్ట్ ఫిలింస్ కంటెస్ట్ లో ఆ షార్ట్ ఫిలిం ప్రదర్శిస్తారని చెప్పుకుంటున్నారు. నాగచైతన్య ఎంట్రీ విషయంలో నాగార్జున అంచనాలు తారుమారయ్యాయి. చైతన్య తొలి చిత్రం'జోష్' అపజయాన్ని మూటగట్టుకుంది. ఈనేపథ్యంలో అఖిల్ విషయంలో అలా జరుగకూడదని నాగార్జున భావిస్తున్నారు.

English summary

 Deva Katta is going to direct Akhil’s debut film and it’s likely to go on floors sometime next year. The script has also been finalized and Nagarjuna himself will produce this film under Annapurna Studios banner.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu