For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అఖిల్ కోసం భారీ రిస్క్ చేస్తున్న నిర్మాతలు.. బడ్జెట్ లెక్కలు లీక్.. రెమ్యునరేషన్ ఎంత?

  |

  టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ లేక కొట్టుమిట్టాడుతున్న హీరోల్లో అఖిల్ ఒకడు. అక్కినేని వారసుడిగా ఎంత మంచి క్రేజ్ ఉన్నా కూడా మనోడి లక్కు మారట్లేదు. కథల విషయంలో ఎంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నా కూడా వర్కౌట్ కావడం లేదు. ఇక నాగచైతన్య మాదిరిగానే ఒక సక్సెస్ వచ్చాక మాస్ సినిమాలు చేయాలని అనుకున్నాడో ఏమో తెలియదు గాని ఇంతవరకు కాన్ఫిడెన్స్ పెంచే విజయం రాలేదు. ఇక అఖిల్ మార్కెట్ పెద్దగా పెరగకపోయినా నెక్స్ట్ సినిమాకు మాత్రం నిర్మాతలు భారీ స్థాయిలో ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది.

  రెమ్యునరేషన్ తగ్గించక తప్పలేదు

  రెమ్యునరేషన్ తగ్గించక తప్పలేదు

  అఖిల్ మొదటి సినిమా అఖిల్ కోసం నిర్మాతగా నితిన్ భారీగానే ఖర్చు పెట్టాడు. కానీ సినిమా కొట్టిన దెబ్బకు డిస్ట్రిబ్యూటర్స్ కోలుకోలేకపోయారు. అందుకే ఆ తరువాత హలో, మిస్టర్ మజ్ను సినిమాల బడ్జెట్స్ చాలా వరకు తగ్గాయి. ఇక మొదటి సినిమాకు 7కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకున్న అఖిల్ ఆ తరువాత తగ్గించాల్సి వచ్చింది. ఇక నెక్స్ట్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే.

  సురేందర్ రెడ్డితో మొదటిసారి..

  సురేందర్ రెడ్డితో మొదటిసారి..

  బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రాబోతున్న కొత్త సినిమా గీత ఆర్ట్స్ ప్రొడక్షన్ సపోర్ట్ తోనే రాబోతోంది. వాళ్ళు కూడా తక్కువ పారితోషికమే ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఆ తరువాత సురేందర్ రెడ్డితో అఖిల్ ఒక మాస్ సినిమాను చేయనున్న విషయం తెలిసిందే. AK ఎంటర్టైన్మెంట్స్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఆ సినిమాకు భరిగానే ఖర్చు చేయనున్నారట.

  100కోట్ల బడ్జెట్ తో చేయాలని అనుకుంటే..

  100కోట్ల బడ్జెట్ తో చేయాలని అనుకుంటే..

  సైరా వంటి పాన్ ఇండియా సినిమా తరువాత దర్శకుడు సురేందర్ రెడ్డి 100కోట్ల బడ్జెట్ తో హై లెవెల్లో సినిమా తీయాలని అనుకున్నాడు. కానీ స్టార్ హీరోలంతా బిజీగా ఉండడంతో వీలైనంత వరకు అఖిల్ తోనే మళ్ళీ తన బాక్సాఫీస్ స్టామినాను చూపించాలని అనుకుంటున్నాడు. అయితే సురేందర్ రెడ్డి మొదట కథ రాసుకున్నప్పుడు అనుకున్న దాని ప్రకారం 60కోట్లకు పైగా బడ్జెట్ అవసరమయ్యే అవకాశం ఉంటుందని పేపర్ పై ఒక ప్లాన్ రెడీ చేసుకున్నాడట.

  అడ్వాన్స్ మాత్రమే తీసుకున్న అఖిల్

  అడ్వాన్స్ మాత్రమే తీసుకున్న అఖిల్

  అయితే ఈ సినిమా బడ్జెట్ ఎక్కువ కావడం వలన అఖిల్ కూడా రెమ్యునరేషన్ విషయంలో నిర్మాతలను ఇబ్బంది పెట్టాలని అనుకోవడం లేదట. కేవలం అడ్వాన్స్ మాత్రమే తీసుకొని సినిమా బిజినెస్ డీలింగ్స్ మొదలైన తరువాత మాట్లాడుకుందామని చెప్పాడట. దీంతో నిర్మాతలు సంతోషంతో అఖిల్ సినిమా విషయంలో వీలైనంత వరకు తగ్గకూడదని డిసైడ్ అయినట్లు టాక్.

  Bigg Boss Telugu 4 : జోకర్ గా Jabardasth Avinash వైల్డ్ కార్డ్ ఎంట్రీ..!!
  రామ్ చరణ్ సలహాతోనే ఈ ప్రాజెక్ట్..

  రామ్ చరణ్ సలహాతోనే ఈ ప్రాజెక్ట్..

  ఇక సురేందర్ రెడ్డి కిక్ , రేసు గుర్రం, ధృవ వంటి హిట్స్ అనంతరం అంచనాలకు తగ్గట్టుగా సక్సెస్ అందుకోవడం లేదు. మరి అఖిల్ తో ఎంతవరకు సక్సెస్ అందుకుంటాడో చూడాలి. రామ్ చరణ్ సలహా మేరకు అఖిల్ తో ప్రాజెక్టును సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక అఖిల్ సినిమా తరువాత సురేందర్ రెడ్డి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో మరో సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఆ సినిమా వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుంది.

  English summary
  Surender Reddy, the director of Mass Entertainment films that has received box office hits like Kick, Racehorse and Dhruva, has given me an update on his next film. It has been rumored for some time now that the Saira director is preparing a powerful script for Akkineni's young hero Akhil's 5th film. But finally came the official announcement on the combination.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X