»   » దిల్ రాజు వల్లే హ్యాండిచ్చాడా.? ఇక ఆ సినిమా ఆగిపోయినట్టేనట

దిల్ రాజు వల్లే హ్యాండిచ్చాడా.? ఇక ఆ సినిమా ఆగిపోయినట్టేనట

Posted By:
Subscribe to Filmibeat Telugu

మొదట్లో వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేవాడు అల్లరి నరేష్. ఒక ప్పుడు ఒకె సంవత్సరం లో రెండు.., మూడు సినిమాలు కూడా వచ్చేవి. అంతే కాదు అల్లరి నరేష్ సినిమా అంటే ఫ్లాప్ అవాల్సింది కూడా యావరేజ్ అనిపించుకునేది. కానీ రానూ..రానూ.. మూస కామెడీకి కాస్త ఆధరణ తగ్గింది. నరేష్ కి కూడా ఒకే రకం పాత్రలతో మొహం మొత్తిందో లేదంటే నిజంగానే అవకాశాలు రాలేదేమో కానీ ఈ మధ్య మరీ సైలెంట్ అయిపోయాడు.

అయితే ఇలా కుదరదనుకున్నాడేమో ఇప్పుడు మళ్లీ తన స్పీడు పెంచుతున్నట్టు అనిపిస్తోంది. 'సెల్ఫీ రాజా','ఇంట్లో దెయ్యం నాకేం భయం' అంటూ వెంట వెంటనే వచ్చినా రెండూ అదే స్పీడ్ లో బాక్సాఫీస్ నుంచి వెళ్ళిపోయాయ్. ఇంట్లో దయ్యం... సినిమా సెట్స్ పై ఉండగానే 'అలా ఎలా' దర్శకుడు అనీష్ తో కలిసి మరో కొత్త సినిమా ప్రయత్నాలు మొదలెట్టేసాడు. ఈ చిత్రానికి 'మేడ మీద అబ్బాయి' అనే పేరు కూడా రిజిస్టర్ చేయించారు.

Alaa Elaa Director Anish krishna and Allari Naresh is halted

కానీ ఆ సినిమా ముందుకు క‌దిలేలా క‌నిపించ‌ట్లేదు. ఎప్పుడో ఆరు నెల‌ల కింద‌ట న‌రేష్‌-అనీష్ కాంబినేష‌న్లో సినిమా అంటూ ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. కానీ ఇప్ప‌టిదాకా ఈ సినిమా మొద‌ల‌వ్వ‌లేదు. ప్ర‌స్తుత ప‌రిణామాలు చూస్తుంటే ఈ చిత్రం ఇక‌ముందూ క‌దిలేలా క‌నిపించ‌ట్లేదు.

న‌రేష్‌తో క‌మిట్మెంట్‌ను ప‌క్క‌న పెట్టేసి అనీష్ కృష్ణ వేరే సినిమాను ఒప్పుకున్న‌ట్లు స‌మాచారం. అగ్ర నిర్మాత దిల్ రాజు అనీష్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌డానికి సన్నాహాలు చేస్తున్నాడు. రాజ్ త‌రుణ్ హీరోగా అనీష్ ద‌ర్శ‌క‌త్వంలో దిల్ రాజు సినిమా నిర్మించ‌బోతున్నట్లు స‌మాచారం. ఆ సినిమాకోసమే అనీష్, నరేష్ ని పక్కన పెట్టేసాడట. అసలే వరుస ఫ్లాప్ లతో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్న నరేష్ ఇప్పుడు ఏం చేస్తాడో చూడాలి.

అయితే "మేడ మీద అబ్బాయి" తర్వాత భీమినేని శ్రీనివాసరావు తో చేయటానికి ఒప్పుకున్న ప్రజెక్ట్ ఇప్పుడు తెరమీదకి వచ్చే అవకాశం ఉంది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'సుడిగాడు' ఘన విజయాన్ని అందుకుంది. దాంతో నరేష్ కోసం భీమనేని శ్రీనివాసరావు ఒక ఆసక్తికరమైన కథను సిద్ధం చేశాడట. అల్లరి నరేష్ ఆ కథకి ఓకే చెప్పడం జరిగిపోయిందని చెబుతున్నారు.

English summary
A new buzz in Tollywood that thea project with the Combination oj Alaa Elaa Director Anish krishna and Allari Naresh is halted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu