»   » అలీ కి పవన్ కళ్యాణ్ ప్రామిస్ చేసాడా?

అలీ కి పవన్ కళ్యాణ్ ప్రామిస్ చేసాడా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ కు అలీ ఉన్న అనుబంధం తెలయింది కాదు. పవన్ కెరీర్ ప్రారంభం నుంచి అలీ తో వ్యక్తిగతమైన రిలేషన్ ని మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. ఈ నేపధ్యంలో ఆయన అలీకి నిర్మాతగా సినిమా చేసుకుంటే డేట్స్ ఇస్తానని ప్రామిస్ చేసినట్లు సమాచారం. ఆయన మంచి కథతో, దర్శకుడుతో వస్తే వెంటనే ప్రారంభిస్తానని మాట ఇచ్చినట్లు చెప్తున్నారు. ప్రస్తుతం అలీ అదే పనిమీద ఉన్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ప్రస్తుతం పవన్ కళ్యాణ్...

పవన్‌ కల్యాణ్‌ హీరోగా తెరకెక్కబోయే కొత్త చిత్రానికి దాసరి నారాయణరావు నిర్మాతగా వ్యవహరించనున్నారు. తారకప్రభు ఫిలింస్‌ బ్యానర్‌పై దాసరి ఈ సినిమా తీస్తున్నట్లు అధికారికంగా ధ్రువీకరించారు. తారక ప్రభు ఫిలింస్‌ బ్యానర్‌పై 37వ చిత్రంగా పవన్‌కల్యాణ్‌ సినిమా రానుంది. అయితే దర్శకుడు ఎవరనేది ఇంకా నిర్ణయించలేదు.

దాంతో ఈ చిత్రానికి దర్శకుడు ఎవరనేది హాట్ టాపిక్ గా మారింది. ఆ దర్శకుడు పూరి జగన్నాథ్ అయ్యిండే అవకాసం ఉందని అంటున్నారు. రీసెంట్ గా ..పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో జూనియర్‌ ఎన్‌టిఆర్‌ నటించిన 'టెంపర్‌' చిత్రం చూసి ముగ్థుడైన దాసరి... తనవారసుడి లేని లోటును పూరీ భర్తీచేశాడని కూడా ప్రకటించారు. ఈ ఉదంతాలు చూస్తుంటే దాసరి, పవన్‌ కాంబినేషన్‌లో ఓ సెన్సేషనల్‌ చిత్రం తీయనున్నారనీ, దానికి పూరీ దర్శకత్వం వహించనున్నారని కూడా ఫిలింనగర్‌లో వార్తలు విన్పిస్తున్నాయి.

దర్శకరత్న దాసరి నారాయణరావు - పవన్‌ కల్యాణ్‌ కలసి ఓ సినిమా చేస్తున్నారనే వార్త నిన్న సాయింత్రం అందరినీ ఆశ్చర్యంలో పడేసింది. అది రూమర్ అని కొట్టిపారేసే లోగా దానిని ఖరారు చేస్తూ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లో ...దాసరి ఈ విషయాన్ని ఖరారు చేస్తూ పోస్ట్ చేసారు. నా నెక్ట్స్ డైరక్టోరియల్ ప్రాజెక్టు మన పవర్ స్టార్ అని రాసారు. ఇది అభిమానులలో కలకలం పుట్టించింది. దాసరి దర్శకత్వంలో పవన్ సినిమా ఏంటని తలలు పట్టుకున్నారు. అయితే ఈ విషయం గమనించినట్లున్నారు...మరి కాస్సేపటికి దాన్ని ఎడిట్ చేస్తూ...నా నెక్ట్స్ ప్రాజెక్టు పవర్ స్టార్ తో అని పోస్ట్ పెట్టి రిలీఫ్ ఇచ్చారు.

Ali produces a film with Pawan?

త్వరలోనే ఈ సినిమా పూర్తి వివరాలు తెలుపుతారని సమాచారం. దీని పట్ల పవన్ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు ఊహకందని విధంగా ఉంటున్నాయి.

పవన్‌ కల్యాణ్‌ హీరోగా తెరకెక్కబోయే కొత్త చిత్రానికి దాసరి నారాయణరావు నిర్మాతగా వ్యవహరించనున్నారు. తారకప్రభు ఫిలింస్‌ బ్యానర్‌పై దాసరి ఈ సినిమా తీస్తున్నట్లు అధికారికంగా ధ్రువీకరించారు. తారకప్రభు ఫిలింస్‌ బ్యానర్‌పై 37వ చిత్రంగా పవన్‌కల్యాణ్‌ సినిమా రానుంది.

ఇలా ఈ విషయాన్ని దాసరి ధ్రువీకరించారు కూడా. అయితే దర్శకుడెవరనేది త్వరలో తెలుస్తుంది. ప్రస్తుతం 'గబ్బర్‌ సింగ్‌ 2' పనుల్లో బిజీగా ఉన్నారు పవన్‌. ఆ సినిమా పూర్తయ్యాకే దాసరి సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. మొత్తానికి పరిశ్రమ మొత్తాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తిన కాంబినేషన్‌ ఇది. మరి ఈ కలయిక ఇంకెన్ని షాక్‌లను ఇస్తుందో మరి అంటోంది మీడియా.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్ 2′ పనుల్లో బిజీగా ఉన్నారు. శరత్ మరార్ ఈ సినిమాకు నిర్మాత. ‘గబ్బర్ సింగ్ 2′ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఇటివలే ‘గోపాల గోపాల' దర్శకుడు డాలీ(కిషోర్) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తానని మాటిచ్చారు. దాసరి సినిమా ఎవరి దర్శకత్వంలో ఉంటుందో.. అని చర్చ నడుస్తోంది.

English summary
Sources say Pawan promised to do a film for Ali if he comes with a good story after Ali expressed his wish in front of him.
Please Wait while comments are loading...