»   » వర్కవుట్ అవుద్దా? : సునీల్ నో చెప్పిన దానికే అల్లరి నరేష్ సై

వర్కవుట్ అవుద్దా? : సునీల్ నో చెప్పిన దానికే అల్లరి నరేష్ సై

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రీసెంట్ గా జేమ్స్ బాండ్ అంటూ వచ్చిన అల్లరి నరేష్ ఇప్పుడు ఓ రీమేక్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. కన్నడంలో విజయవంతమైన విక్టరి చిత్రాన్ని ఆయన తెలుగులో చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ జరుగుతోంది. సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం చిత్రం చేసిన ఈశ్వరరెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. చలసారి రామబ్రహ్మం తమ గోపీ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

డిసెంబర్ లో రిలీజ్ అన్నట్లు రెడీ చేస్తున్న ఈ చిత్రాన్ని మొదట సునీల్ చెయ్యాల్సిందని ఇండస్ట్రీ టాక్. అయితే సునీల్ ఈ చిత్రం చూసి పెద్దగా ఆసక్తి చూపలేదని చెప్తున్నారు.గతంలో తెలుగులో వచ్చిన సన్నివేశాలతో ఈ చిత్రం ఉందని రిజెక్టు చేసినట్లు చెప్పుకున్నారు. అంతేకాదు...ఈ చిత్రంలో క్లైమాక్స్ ని సునీల్ చిత్రం భీమవరం బుల్లోడు చిత్రంలో ఆల్రెడీ వాడేసారు. దాంతో ఇప్పుడు ఈ చిత్రం రీమేక్ చేసినా పూర్తి మార్పులతో చేయాలని అంటున్నారు. అసలే అంతంత మాత్రంగా ఉన్న అల్లరి నరేష్ ఈ రీమేక్ కు పూర్తి స్క్రిప్టు మార్పులతో చెయ్యకపోతే కష్టం అంటున్నారు.

Allari Naresh next is Kannada Movie Victory re-make

ఇక అల్లరి నరేష్ తాజా చిత్రం విషయానికి వస్తే..

హీరో అల్లరి నరేష్ తో కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాకి ‘మామ మంచు - అల్లుడు కంచు' అనే టైటిల్ ని ఫైలైజ్ చేసారు. ఆగష్టు మొదటి వారంలో ఈ సినిమా షూటింగ్ హైదరాబాడ్ లో మొదలు పెట్టారు. ఒక వారం రోజుల పాటు జరిగిన ఫస్ట్ షెడ్యూల్ ముగిసింది.

సెకండ్ షెడ్యూల్ ఆగష్టు 19 నుంచి తిరుపతిలో మొదలు కానుంది. ఈ లాంగ్ షెడ్యూల్ లో సినిమాలోని మేజర్ టాకీ పార్ట్ ని ఫినిష్ చేయనున్నారు. ఈ సినిమాలో మోహన్ బాబు - అల్లరి నరేష్ లు మామ అల్లుల్లుగా కనిపించి తెలుగు ప్రేక్షకులను నవ్వించనున్నారు. ఓ మరాఠీ సినిమాని స్పూర్తిగా తీసుకొని చేస్తున్న ఈ సినిమా కథని డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి మన తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేసారు. మంచు విష్ణు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.

అలాగే ఈ సినిమాలో రమ్యకృష్ణ, మీనా వంటి మాజీ హీరోయిన్లు కీలక పాత్రలు పోషిస్తుండటమూ, హీరోయిన్ పూర్ణ ...నరేష్ కు సరిజోడుగా కనిపించనుంటంతో ఈ సినిమా ఇప్పటికే అన్ని వర్గాల ప్రేక్షకుల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రానికి మరిన్ని హంగులు అద్దాలని భావిస్తున్న దర్శకుడు శ్రీనివాస రెడ్డి... మోహన్ బాబు సూపర్ హిట్ సాంగ్ ను రీమిక్స్ చేసేందుకు సమాయత్తం అవుతున్నాడట.

23 ఏళ్ల క్రితం మోహన్ బాబు, రమ్యకృష్ణ, మీనా కాంబినేషన్ లోనే వచ్చిన అల్లరి మొగుడు చిత్రం నేపథ్యంలోనే ఈ తాజా చిత్రం తెరకెక్కనుంది. అందుకే ఆ చిత్రంలో పెద్ద హిట్టైన ముద్దిమ్మంది ఓ చామంతి సాంగ్ ను ఈ చిత్రం కోసం రీమిక్స్ చేయబోతున్నారు. ఈ సినిమా కోసం ముచ్చటగా ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లను ఫైనలైజ్ చేయటం విశేషం. అందులో రఘు కుంచే కు ఈ రీమిక్స్ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.

English summary
Allari Naresh is starring under the direction of Eshwar Reddy of ‘Siddhu from Srikakulam’ fame Eshwar. Film is a re-make of the Kannada hit ‘Victory’ and currently the pre-production is in full swing. Film produced by Chalasani Ramabrahmam on Gopi Arts is slated for December release.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu