»   »  అల్లరి నరేష్ ‘ఇంట్లో దెయ్యం నాకేం భయం’ఇన్ సైడ్ టాక్

అల్లరి నరేష్ ‘ఇంట్లో దెయ్యం నాకేం భయం’ఇన్ సైడ్ టాక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అల్లరి నరేష్ మరో కామెడీ సినిమాతో మన ముందుకు వస్తున్నాడంటే ఆ ఉత్సాహం వేరేగా ఉంటుంది. అయితే ఆయన వరస ఫ్లాఫ్ లు అభిమానులకు ఆ ఆనందాన్ని ఇవ్వటం లేదు. కొత్త సినిమా వస్తోందంటే ఇదెలా ఉంటుందో అనే టెన్షన్ తో వారికి పట్టుకుంటోంది.

ఈ నేపధ్యంలో ఫ్లాఫ్ లను అధిగమించటానికి అల్లరి నరేష్ ఈ సారి జానర్ మార్చి హిట్ కొట్టాలని డిసైడ్ అయ్యినట్లున్నారు. అల్లరి నరేష్ హీరోగా జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'ఇంట్లో దెయ్యం నాకేం భయం' చిత్రాన్ని రేపు విడుదల చేస్తున్నారు. ఈ నేపధ్యంలో చిత్రం ఎలా ఉండబోతోంది..ఇన్ సైడ్ టాక్ ఏంటనేది మీకు అందిస్తున్నాం.

ఇప్పటికే రిలీజైన చిత్రం అల్లరి నరేశ్‌ ఓ ఇంట్లోని దెయ్యాన్ని పట్టుకోవడానికి నానా కష్టాలు పడుతూ 'ఓరి దీని దెయ్యం వేషాలో..' అంటూ ఫన్నీగా కనిపించారు. కానీ టీజర్ చూసిన వాళ్లు ..ఇందులో అల్లరి నరేష్ నవ్వించేటట్లు లేడు అని అంటున్నారు. మంచి కథతోపాటు హారర్‌ మిక్స్‌ అయిన ఫ్యామిలీ డ్రామాగా రూపొందించారు.

 డబ్బు కోసం కక్కుర్తితో

డబ్బు కోసం కక్కుర్తితో

ఈ సినిమాలో అల్లరి నరేష్ ..బ్యాండ్ మేళం ట్రూప్ మెయింటైన్ చేస్తూంటాడు. ఒకళ్ల ఇంట్లో దెయ్యం వదిలించటానికి ఫోన్ చేస్తే పొరపాటున అల్లరి నరేష్ కు కనెక్ట్ అయ్యి...వచ్చేస్తాడు. అయితే ఆ విషయం ఆ ఇంటికి వచ్చేదాకా తెలియదు. వచ్చాక డబ్బు కు ఆశపడి తన వృత్తి కాకపోయినా దెయ్యాన్ని పాలదోలతానికి , దెయ్యాల తోలే మాంత్రికుడుని అని చెప్పి ఇంట్లోకి వస్తాడు.

 దెయ్యం ఆడుకుంటుంది

దెయ్యం ఆడుకుంటుంది


అయితే అక్కడ ట్విస్ట్ ఏమిటంటే...ఆ ఇంట్లో ఆల్రెడీ దెయ్యం ఉంటుంది. అది హీరోయిన్ కు పెళ్లి అవ్వనివ్వదు. ఆ దెయ్యాన్ని నరేష్ ఎలా పాలద్రోలాడు, ఆ ప్రాసెస్ లో ఆ దెయ్యం న‌రేష్‌తో ఆడుకోవ‌డం మొద‌లెడుతుంది. అదీ.. ఇంట్లో దెయ్యం నాకేం భ‌యం క‌థ‌. కార్తీ నటించిన కాష్మోరా సినిమా చూశాక‌... న‌రేష్ కు ప్యూజలు ఎగిరిపోయాయని, అందుకే ఆ సినిమాని మర్చిపోయేదాకా లేటు చేసారని చెప్పుకుంటున్నారు.

 బి,సి సెంటర్లలలో ..

బి,సి సెంటర్లలలో ..

ఇక ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం సినిమా పెద్ద హిట్ అయితే కాదు కానీ నరేష్ ని ఫ్లాఫ్ ల నుంచి బయిటపడేసే సినిమా అవుతుందని చెప్తున్నారు. కామెడీ బాగా పండిందని, బి,సి సెంటర్లలను ఆ కామెడీ బాగా అలరిస్తుందని చెప్తున్నారు.

అలాగే ఒప్పుకున్నా

అలాగే ఒప్పుకున్నా

‘నాకు ‘ఇంట్లో దెయ్యం నాకేం భయం' కొత్త జోనర్‌ చిత్రమవుతుంది. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో 2006లో ‘సీమశాస్త్రి', 2011లో ‘సీమటపాకాయ్‌' చేశా. ఆ రెండు చిత్రాల కథలను సింగిల్‌ లైన్ లో విని ఓకే చేశా. ఈ సినిమా కథ కూడా అలా ఒప్పుకొన్నదే. రాజేంద్రప్రసాద్‌గారిని చూసి నేను చాలా నేర్చుకున్నా. ఈ చిత్రానికి కూడా ఆయన చాలా అంకితభావంతో పనిచేశారు. సాయికార్తిక్‌తో ఇది నా మూడో సినిమా. '' అని హీరో అల్లరి నరేశ్ అన్నారు.

 కథల ఎటిఎం

కథల ఎటిఎం

‘‘నేను, నరేశ్ కలిసి చేస్తున్న హ్యాట్రిక్‌ చిత్రమిది. నరేశ్ కోసం ఏం కథ చేయాలా? అని ఆలోచిస్తున్నప్పుడు హారర్‌ జోనర్‌లో చేయమని తనే సలహా ఇచ్చాడు. తను నా దృష్టిలో కథల ఏటీయం. మనం ఒక కథ చెప్తే, తను ఆరు కథలు చెప్తాడు. ‘ఇంట్లో దెయ్యం నాకేం భయం'ను ఒకే సిట్టింగ్‌లో ఓకే చేశాడు. మా నిర్మాతగారు కథ వినగానే అంగీకరించి మొదలుపెట్టేయమన్నారు. ముందు ‘సీమ సందులో' అని టైటిల్‌ పెడదామనుకున్నాం. కానీ నిర్మాతగారికి నచ్చకపోవడంతో ఈ టైటిల్‌ను ఖరారు చేశాం'' అని అన్నారు.

 ఆ రెండు పెద్ద చిత్రాల తర్వాత

ఆ రెండు పెద్ద చిత్రాల తర్వాత

"అత్తారింటికి దారేది, నాన్నకు ప్రేమతో చిత్రాల తర్వాత మా బేనర్‌లో వస్తోన్న ఫుల్‌ లెంగ్త్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు హార్రర్‌ టచ్‌తో అందర్నీ అలరించే చిత్రంగా ఇది రూపొందుతుంది. మా బేనర్‌లో ఇది మరో సూపర్‌హిట్‌ సినిమా అవుతుంది" అన్నారు నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌.

 వీరందరూ నటిస్తున్నారు

వీరందరూ నటిస్తున్నారు


అల్లరి నరేష్‌, రాజేంద్రప్రసాద్‌, కృతిక, మౌర్యాని, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, ప్రభాస్‌ శ్రీను, షకలక శంకర్‌, చమ్మక్‌ చంద్ర, చలపతిరావు, కాదంబరి కిరణ్‌, ధన్‌రాజ్‌, ప్రగతి, రజిత, అమిత్‌, టార్జాన్‌, జయవాణి, అపూర్వ, ఆజాద్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

 తెర వెనక

తెర వెనక


ఈ చిత్రానికి ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్‌, సినిమాటోగ్రఫీ: దాశరథి శివేంద్ర, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, మాటలు: డైమండ్‌ రత్నబాబు, పాటలు: భాస్కరభట్ల, డాన్స్‌: రాజుసుందరం, గణేష్‌, దినేష్‌, ఫైట్స్‌: సుంకర రామ్‌, ఆర్ట్‌: నారాయణరెడ్డి, సమర్పణ: భోగవల్లి బాపినీడు, నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జి.నాగేశ్వరరెడ్డి.

English summary
Allari Naresh gears up for his horror flick, Intlo Dayyam Nakem Bhayam .The Film is slated for grand release on Dec 30 in a grand manner.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu