»   » అల్లరి నరేష్ 'జేమ్స్‌ బాండ్‌' కొరియా సినిమా కాపీ ?

అల్లరి నరేష్ 'జేమ్స్‌ బాండ్‌' కొరియా సినిమా కాపీ ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఒకప్పుడు హాలీవుడ్ నుంచి మాత్రమే సినిమాలు ఎత్తేవారు. ఇప్పుడు కాలం మారింది. గ్లోబులైజేషేన్ నేపధ్యంలో ప్రపంచం కుగ్రామంలాగ మారింది. దాంతో ఎక్కడెక్కడ వనరులు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా సినిమావారికి ప్రపంచం సినిమా బాగా దగ్గరైపోయింది. దాంతో ఎత్తిపోతల పథకాలు ఎక్కువయ్యాయి. తాజాగా అలాంటి ప్రయత్నమే అల్లరి నరేష్ చేస్తున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో గుప్పు మంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

అల్లరి నరేష్‌, సాక్షి చౌదరి జంటగా నటిస్తున్న చిత్రం 'జేమ్స్‌ బాండ్‌'. 'నేను కాదు నా పెళ్లాం' అనేది ఉపశీర్షిక. సాయి కిశోర్‌ మచ్చ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అనిల్‌ సుంకర నిర్మాత. ఈ చిత్రం కొరియా చిత్రం "My Wife Is A Gangster" ఆధారంగా రూపొందుతోందని టాక్. ఈ సినిమాలో ...ఓ డాన్ కు ఓ అమాయికుడు కి మధ్య జరిగే కామెడీ తో రన్ అవుతుంది. 'జేమ్స్‌ బాండ్‌' కూడా అలాంటి కథే అంటున్నారు. అయితే ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే రిలీజ్ దాకా ఆగాలి. అలాగే..గతంలోనూ అల్లరి నరేష్..ఇదే బ్యానర్ లో చేసిన అహనా పెళ్లంట చిత్రం సైతం ఇదే సినిమా నుంచి తీసుకున్నది కావటం విశేషం.

Allari Naresh's ‘James Bond’ is a rip off Korean movie?

చిత్రం విషయానికి వస్తే...

నిర్మాత మాట్లాడుతూ ''కథకి సరిగ్గా సరిపోయే పేరు ఇది. వినోదాత్మకంగా సాగుతుంది. యాక్షన్‌ సన్నివేశాలూ ఉన్నాయి. నరేష్‌ సినిమా అంటేనే నవ్వులు. ఈ సినిమాలో అవి కావల్సినన్ని ఉంటాయి. కొత్త దర్శకుడైనా కథని బాగా పండించారు. ఈ నెల 12న పాటల్ని విడుదల చేస్తాం. మూడో వారంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ''న్నారు.

దర్శకుడు చెబుతూ ''మన్మథుడు'లో నాగార్జునలా కనిపించే కుర్రాడికి ఓ పవర్‌ ఫుల్‌ డాన్‌కీ మధ్య జరిగే సంఘర్షణ అందులోంచి పుట్టుకొచ్చే నవ్వులు అందరికీ నచ్చుతాయ''న్నారు దర్శకుడు.

Allari Naresh's ‘James Bond’ is a rip off Korean movie?

'పోటుగాడు' తర్వాత నటిస్తోన్న ఈ చిత్రం తనకు పేరు తీసుకొస్తుందని హీరోయిన్ సాక్షి చౌదరి చెప్పింది. ఆరు పాటలున్న ఈ సినిమాలో నేపథ్య సంగీతానికీ ప్రాధాన్యత ఉంటుందన్నారు సంగీతదర్శకుడు సాయికార్తిక్‌.

చంద్రమోహన్‌, అశిష్‌ విద్యార్థి, జయప్రకాష్‌రెడ్డి, రఘుబాబు, కృష్ణభగవాన్‌, పృథ్వీ, బెనర్జీ, ప్రభాస్‌ శ్రీను, ఖయ్యుం, చిత్రం శ్రీను, గుండు సుదర్శన్‌, సారిక రామచంద్రరావు, అనంత్‌, హేమ, రజిత, సత్యకృష్ణ, మధుమణి, శ్రావణ్‌ తదితరులు నటించారు. చిత్రానికి కథ: ఎకె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌, మాటలు: శ్రీధర్‌ సీపాన, ఛాయాగ్రహణం: దాము నర్రావుల.

English summary
Allari Naresh next movie happens to be “James Bond - Nenu Kaadu Na Pellam”, which is being directed by newcomer Kishore. Produced by Anil Sunkara, this film happens to be an unofficial free-make of Korean movie. According to reports, the film got hugely inspired from the movie “My Wife Is A Gangster”.
Please Wait while comments are loading...