»   »  నిజంగా అలా జరుగుతుందా, నమ్మలేం: 'డీజే’ టీజర్‌ వెనుక అల్లు అరవింద్ వ్యూహం?

నిజంగా అలా జరుగుతుందా, నమ్మలేం: 'డీజే’ టీజర్‌ వెనుక అల్లు అరవింద్ వ్యూహం?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :వరుస విజయాలతో దూసుకుపోతున్న స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం 'దువ్వాడ జగన్నాథమ్‌'. హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ ఇటీవలె విడుదలైంది. అయితే బన్నీ పూర్తి మేకోవర్ లో కనిపిస్తున్న ఈ సినిమాకు ఫస్ట్ లుక్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన డీజే టీం ఇప్పుడు టీజర్ తో రికార్డ్ ల వేట మొదలు పెట్టింది. గురువారం రిలీజ్ అయిన డీజే ఫస్ట్ లుక్ టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.


కేవలం 50 గంటల్లో ఈ టీజర్ మిలియన్ వ్యూస్ మార్క్ ను దాటి బన్నీ కెరీర్ లో సరికొత్తి రికార్డ్ సృష్టిస్తూ ముందుకు వెళ్తోంది. అయితే అనుకున్నంతగా ఈ టీజర్‌ జనాలను ఆకట్టుకోవడం లేదు. ట్రైలర్‌ కట్‌ చేయడంలో దిట్ట అయిన హరీష్‌ శంకర్‌ మ్యాజిక్‌ ఇందులో కనిపించలేదని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కేవలం ఒక్క డైలాగ్‌తో టీజర్‌ను సరిపెట్టేశారు. దీని వెనుక ఓ వ్యూహముందని మీడియాలో వార్తలు ప్రచారం అవుతున్నాయి.


ముఖ్యంగా తాను నిర్మాత కాకపోయినా తన కుమారుడు చిత్రం గురించి .. అల్లు అరవింద్ ఓ స్ట్రాటజీ ప్రకారం ఈ విషయంలో వెళ్లమని సలహా ఇచ్చారని అంటున్నారు. ఆ సలహా ఏమిటంటే... ప్రస్తుతం బన్నీ మూడు వరుస విజయాలతో సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. అభిమానుల్లో కూడా ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి.


బన్నీ తొలిసారి బ్రాహ్మణ యువకుడి పాత్రలో కనిపిస్తుండడంతో అందరూ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో టీజర్‌ విడుదలైంది. టీజర్‌ అదిరిపోతే సినిమా మీద విపరీతమైన హైప్‌ వచ్చేస్తుంది. అంచనాలు ఆకాశాన్నంటుతాయి. దీంతో సినిమా వాళ్ల అంచనాలకు అనుగుణంగా లేకుంటే ఫలితమే తారుమారయ్యే ప్రమాదముంది. అందుకే టీజర్‌ను అంత చప్పగా కట్‌ చేశారని చెప్పుకుంటున్నారు.


Allu Aravind Behind Allu Arjun's DJ Teaser?

అయితే ఈ టీజర్ సంచలన విజయం సాధించింది. తన హవాను కంటిన్యూ చేస్తూ 2 మిలియన్ మార్క్ ను దాటి దూసుకుపోతొంది. ఇప్పటికే 25 లక్షలకు పైగా వ్యూస్ సాధించిన డీజే దువ్వాడ జగన్నాథమ్ టీజర్ ముందు ముందు మరిన్ని రికార్డ్ లు సృష్టిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్.


బ్రాహ్మణుడి గెటప్‌లో అల్లు అర్జున్ కనిపించిన ఈ టీజర్‌లో హీరోయిన్ పూజాహెగ్డే ముద్దుపెట్టుకున్న సన్నివేశం కనిపిస్తుంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ 'ఇలాఇలా ముద్దులు పెట్టేసి సభ్యసమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని' అంటూ చెప్పిన డైలాగ్ అందరికీ నచ్చింది.


టీజర్ మంచి ఆదరణ పొందుతోందని నిర్మాత దిల్‌రాజు తెలిపారు. తమ సంస్థ నుండి సినిమా అంటేనే ప్రేక్షకులలో భారీ అంచనాలు వుంటాయని, అలాగే అల్లు అర్జున్ తమ సంస్థలో చేస్తున్న హ్యాట్రిక్ మూవీగా డి.జె నిలుస్తుందని నిర్మాత తెలిపారు. ఇటీవల విడుదలైన ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన వచ్చిందని, అలాగే నేడు విడుదల చేసిన టీజర్‌కు కూడా ప్రేక్షకులనుండి ట్రెమండస్ రెస్పాన్స్ లభించిందని తెలిపారు.


సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయని, ప్రేక్షకులకు అంచనాలకు తగ్గట్టుగానే సినిమాను ప్రెస్టేజియస్‌గా రూపొందించామని ఆయన అన్నారు. ఈ చిత్రానికి కెమెరా:ఐనాక బోస్, సంగీతం:దేవిశ్రీ ప్రసాద్, ఎడిటింగ్:చోటా కె.ప్రసాద్, స్క్రీన్‌ప్లే:రమేశ్‌రెడ్డి, దీపక్‌రాజ్, నిర్మాతలు:రాజు, శిరీష్, కథ, మాటలు, దర్శకత్వం:హరీశ్ శంకర్.ఎస్.

English summary
Allu Arjun's 'Duvvada Jagannadham' teaser has become the talk of the town.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu