»   » మీడియాను మభ్యపెట్టాలని చూసిన అల్లు అరవింద్...

మీడియాను మభ్యపెట్టాలని చూసిన అల్లు అరవింద్...

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెగా ఫ్యామిలీలో ముసలం అంటూ మీడియా ఊదరగొట్టి పొరేస్తుంటే, ఇంట్లోని లుకలుకల్ని మరింత పెద్దవి చేసి చూపించకుండా ఉండేందుకు మెగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా తమ వంతు కృషి చేస్తున్నారు. పబ్లిక్ లో జరుగుతున్న వేడుకల్లో ఒకరి వేడుకలో ఒకరు పాల్గొంటూ మీడియా స్పెక్యులేషన్లకి తెర దించే ప్రయత్నం చేస్తున్నారు. పవన్, అల్లు అరవింద్ మధ్య ఇప్పుడు అస్సలు సఖ్యత లేకపోయినా కానీ 'తీన్ మార్" ఆడియోకి అరవింద్ వచ్చాడు. కేవలం మీడియాని మాయ చేయడానికే ఆయన ఈ వేడుకకి వచ్చాడు కానీ నిజంగా బావ తమ్ముడి మీద అభిమానంతో కాదు.

తీన్ మార్ సినిమా బాగా ఆడాలి అనే కనీస ఆకాంక్ష కూడా వెలిబుచ్చకుండా ఈ వేడుకలో పవన్ తప్ప వేరెవరు మాట్లాడినా జనం వినరు, పైగా బోరు ఫీలవుతారు అంటూ తనే తేల్చేసి మైకు యాంకర్ చేతిలో పెట్టేశాడు. ఇదే గీతా ఆర్ట్స్ సినిమా అయివుంటే తీన్ మార్ గురించి ముప్పయ్ వంకర్లు తిరిగిపోతూ మాట్లాడి ఉండేవాడు. అల్లు అరవింద్ గతం మర్చిపోయాడేమో అని పవన్ అతనికి ఓ సంగతి గుర్తు చేశాడు. తాను హీరో అవుతానని అనుకున్నదీ, అందుకు ప్రోత్సహించింది అల్లు అరవింద్ తల్లి అని, అందుకు ఆమెకి రుణపడి ఉంటానని పవన్ పేర్కొన్నాడు.

English summary
Allu Aravind, Naga Babu, Shyam Prasad Reddy, Konda Krishnam Raju, Shobanadri and Danaiah graced the occasion.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu