Just In
- 12 min ago
అన్ని భాషల్లోకి వెళ్లనున్న ప్లే బ్యాక్.. రియల్ సక్సెస్ అంటే ఇదే!
- 29 min ago
తిరుపతిలో జాన్వీ కపూర్ పెళ్లి: లుంగీలో పెళ్లి కొడుకు దర్శనం.. సీక్రెట్ రివీల్ చేసిన శ్రీదేవి కూతురు
- 46 min ago
బెడ్‌కే పరిమితమైన నిహారిక.. ఆ గాయం అవ్వడంతో చైతన్య సేవలు
- 1 hr ago
Uppena 22 Days Collections: అన్ని సినిమాలున్నా తగ్గని ‘ఉప్పెన’.. వాటితో పోల్చితే కలెక్షన్లు ఎక్కువే
Don't Miss!
- Finance
దిగొస్తోన్న సోనా.. ఆగస్ట్‌లో 50 వేల పైచిలుకు.. మార్చిలో 43 వేలు
- News
దీదీకి షాక్ .. బెంగాల్ ఎన్నికలకు ముందు బిజెపిలో చేరిన టీఎంసీ మాజీ ఎంపి దినేష్ త్రివేది
- Sports
India vs England: వణికిస్తున్న అశ్విన్, అక్షర్.. పెవిలియన్‌కు ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్!
- Automobiles
కార్లలో ఇకపై ఫ్రంట్ ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్ కూడా తప్పనిసరి: కేంద్రం
- Lifestyle
శనివారం దినఫలాలు : ఓ రాశి ఉద్యోగులకు ఉన్నతాధికారులతో మంచి సమన్వయం ఉంటుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఎన్నిసార్లు తగ్గాలన్న బన్నీ.. పట్టువీడని మహేష్.. విడుదల తేదీపై వీడని ఉత్కంఠ
తెలుగు సినిమాలకు సంక్రాంతి సెంటిమెంట్ ఉంటుంది. ఎన్ని సినిమాలు వచ్చినా.. ఎంత మంది హీరోలు తలపడినా సరే సంక్రాంతి పుంజుల్లా పోటీ కూడా మజానే ఇస్తుంది. అయితే ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు సంక్రాంతికి వచ్చే సినిమాల్లో ఎన్నడూ లేని సందిగ్దత ఏర్పడింది. గత ఏడాదికి కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడలేదు.కానీ, ఈ సారి మాత్రం విచిత్రమైన పరిస్థితి వచ్చి పడింది. సంక్రాంతి దగ్గరపడుతున్న సినిమా రిలీజ్ డేట్లను మాత్రం ప్రకటించడం లేదు. దీనికి కారణం మహేష్ బాబు వ్యవహార శైలే అని టాక్ నడుస్తోంది.

ఫ్యాన్స మధ్య వాగ్వాదం..
సరిలేరు, అల వైకుంఠపురములో రెండూ కూడా భారీ బడ్జెట్ చిత్రాలే కావడం, రెంటికి కూడా భారీ హైప్ క్రియేట్ కావడం సంక్రాంతి పోటీని మరింత రంజుగా తయారు చేసింది. అయితే విడుదల జాప్యమవుతుండటంతో ఆ మజా పోతోంది. ఇక ఈ వ్యవహారంపై ఇరువురి ఫ్యాన్స్ మధ్య వాగ్వాదం కూడా జరుగుతోంది. రిలీజ్ డేట్ల సమస్య రావడానికి బన్నీ.. అతని టీమ్ కారణమని భావిస్తున్న మహేష్ ఫ్యాన్స్ కొందరు ఇప్పటికే బన్నీ సినిమాను బాయ్ కాట్ చెయ్యాలని ఆలోచిస్తున్నారు. ఇదిలా ఉంటే బన్నీ ఫ్యాన్స్ మాత్రం తమ హీరోను వెనకేసుకొస్తూ తప్పు మహేష్ టీమ్ వైపు ఉందని.. సరిలేరు నీకెవ్వరు టీమ్ ఈ పరిస్థితి కి కారణమని కౌంటర్లు ఇస్తున్నారు.

అప్పటి నుంచీ ఈ సమస్య..
నిజానికి మహేష్.. అల్లు అర్జున్ మధ్య పోటీ ఇప్పటిది కాదని తెలుస్తోంది. భరత్ అనే నేను.. నా పేరు సూర్య రిలీజ్ సమయంలో కూడా డేట్ విషయంలో ఇలానే పోటీ వచ్చిందని.. అప్పుడు అల్లు అర్జున్ పరిస్థితిని అర్థం చెసుకుని మహేష్ సినిమాకు కోసం తమ సినిమా డేట్‌ను మార్చుకున్నాడని అంటున్నారు. ఇప్పుడు కూడా అలానే మహేష్ సినిమాకు స్పేస్ ఇవ్వాలని అనుకున్నారట. అందుకే ఒక రోజు ఆలస్యంగా వచ్చేందుకు మొదట్లో సమ్మతించినట్లు టాక్.

బన్నీకి కోపం..
అయితే అగ్రిమెంట్ ప్రకారం థియేటర్లు ఇవ్వరని.. మహేష్ సినిమా వైపు దిల్ రాజు మొగ్గు చూపుతున్నాడని సమాచారం అందడంతో బన్నీకి కోపం వచ్చిందని.. తగ్గే కొద్ది కావాలని రెచ్చగొడుతున్నారని భావించి పోటీకి సై అన్నాడని తెలుస్తోంది. ఒకే రోజు రిలీజ్ చేస్తే అప్పుడు సత్తా తెలుస్తుందని డిసైడ్ అయ్యాడని టాక్. ఈ సమయం లోనే సరిలేరు నీకెవ్వరు కంటే ఒక రోజు ముందు వస్తే అడ్వాంటేజ్ ఉంటుందని.. క్లాష్ కూడా అవసరం లేదని చెప్పడంతో అలాగే ఫిక్స్ అయ్యారని సమాచారం.

మహేష్ మొండిపట్టు..
ఈ విషయం తెలిసి మహేష్ కూడా 'అల వైకుంఠపురములో' ఎప్పుడు రిలీజ్ చేస్తే తమ సినిమాను అప్పుడు రిలీజ్ చెయ్యాలని పట్టుబడుతున్నాడట. మరి చివరకు ఏం జరుగుతుందో చూడాలి. రెండూ ఒకే రోజే వస్తాయా? వచ్చినా అవి జనవరి 10న వస్తాయా? లేదా జనవరి 11 వస్తాయా? అన్నది వేచి చూడాలి.