»   » హైఫై నైట్ క్లబ్ వ్యాపారంలోకి అల్లు అర్జున్, ఈ నెల్లోనే

హైఫై నైట్ క్లబ్ వ్యాపారంలోకి అల్లు అర్జున్, ఈ నెల్లోనే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : కేవలం సినిమాల్లో సంపాదించిన డబ్బుతోటే సినిమా వాళ్లు లెక్కలేనంత ఆస్దులు కొంటారా...మిలియనీర్లు అయిపోతారా...అంటే ఒకటే సమాధానం. నిజానికి వాళ్ల రెమ్యునేషన్స్ దాస్తే ఎంత వస్తాయి. ఆ వడ్డీ డబ్బుతో ఏమీ కాదు. వారు తాము పారితోషికంగా సంపాదించిన డబ్బుని పెట్టుబడిగా పెట్టి వ్యాపారాలు చేసి డబ్బుని సంపాదిస్తారు. ఇది ఇండస్ట్రీ లో ఓపెన్ సీక్రెట్.

అందులో భాగంగానే మన తెలుగు స్టార్ హీరోలు ఒక్కొక్కరూ ఒక్కో బిజినెస్ పెడుతున్నరు. ఇప్పటికే నాగార్జున హోటల్స్, రవితేజ ఇన్వెస్టుమెంట్స్, రామ్ చరణ్ ఎయిర్ లైన్స్ ఇలా పెడుతూంటే... చిన్న హీరోల రెస్టారెంట్స్, రియల్ ఎస్టేట్ ఇలా తమకు తోచిన, పరిచయం ఉన్న రంగాల్లో పెట్టుబడి పెడుతూ ముందుకు వెళ్తున్నారు. ఇన్నాళ్లూ వాటికి దూరంగా ఉంటూ వచ్చిన స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా వాళ్ల దారిలోకే వచ్చాడు.

Allu Arjun To Float A Nightclub

యం కిచెన్స్ అనే రెస్టారెంట్.. హై లైఫ్ బ్రూయింగ్ కో అనే బారు వారితో కలసి.. ఇప్పుడు హైదరాబాదులో ఒక కొత్త కాన్సెప్టు ఓరియెంటెడ్ నైట్ క్లబ్ పెడుతున్నాడు అల్లు అర్జున్. ఈ విషయాన్ని స్వయంగా అల్లు అర్జున్ ప్రముఖ దిన పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వూులో చెప్పుకొచ్చాడు.

బన్నీ ఈవిషయమై మాట్లాడుతూ.. ''యం కిచెన్స్ మరియు బఫెలో వైల్డ్ వింగ్స్ అనే సంస్థలు నన్ను ఎప్రోచ్ అయినప్పుడు.. పెద్దగా ఆలోచించాలని అనిపించలేదు. వారితో కలసి ''800 జూబిలీ'' అనే క్లబ్ పెడుతున్నాం'' అన్నారు.

హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెం.36లో రాబోతున్న ఈ క్లబ్ లో ఒక కేఫ్ - జపానీస్ రెస్టారెంట్ - బార్బిక్యూ రెస్టారెంట్ వగైరా ఉంటాయని చెప్తాన్నారు. క్లబ్ లో స్వయంగా వారే తయారుచేసిన బీర్లు వగైరా కూడా దొరుకుతాయిట. ఇక జూలై 29న స్వయంగా అల్లు అర్జున్ చేతుల మీదుగా ఈ క్లబ్ ఓపెన్ చేయనున్నారు.

English summary
Bunny is all set to float an upscale nightclub Hyderabad. The nightclub will be launched on July 29.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu