మెగా పవర్‌కు అల్లు అర్జున్ దూరం.. సొంత కుంపటికి ఏర్పాట్లు
ఇటీవల భారీ హిట్లతో దూసుకెళ్తున్న బన్నీ మెగా ఇమేజ్ నుంచి బయటపడి తనకంటూ ఓ ఐడెంటీటిని ఏర్పాటుచేసుకొనేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది.
ఇప్పటి వరకు మెగా హీరోగా ముద్ర వేసుకొన్న 'అల్లు'వారసుడు అల్లు అర్జున్ ప్రస్తుతం సొంత కుంపటి పెట్టుకొంటున్నట్టు వార్తలు షికారు చేస్తున్నాయి. ఇటీవల భారీ హిట్లతో దూసుకెళ్తున్న బన్నీ మెగా ఇమేజ్ నుంచి బయటపడి తనకంటూ ఓ ఐడెంటీటిని ఏర్పాటుచేసుకొనేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకు తన సోదరుడు అల్లు శిరీష్ పబ్లిక్ రిలేషన్ (పీఆర్) గ్రూప్ ను స్టైలిష్ స్టార్ రూపొందిస్తున్నట్టు సమాచారం.

పవన్ కల్యాణ్ తప్ప వేదికల మీద మెగా హీరోలందరూ ఐక్యమత్యంగా కనబడుతున్పప్పటికీ దీంతో వారి మధ్య విభేదాలు ఉన్నట్టు ఓ రూమర్ వినిపిస్తున్నది. కొన్ని వేదికల మీద పవన్ ఫ్యాన్స్ పై తీవ్రస్థాయిలో ఫైర్ అయిన అల్లు అర్జున్ ప్రస్తుతం రాంచరణ్ కు అంటీ ముట్టనట్టే ఉంటున్నట్టు ఫిలింనగర్ టాక్.
allu arjun mega fans ram charan pawan kalyan pr agency అల్లు అర్జున్ మెగా ఫ్యాన్స్ రామ్ చరణ్ పవన్ కల్యాణ్ పీఆర్ ఏజెన్సీ


Click it and Unblock the Notifications