»   » అగ్లీ ఫైట్: నిహారిక ఆందోళన, ఏం జరుగుతుందో?

అగ్లీ ఫైట్: నిహారిక ఆందోళన, ఏం జరుగుతుందో?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కొన్ని రోజులు ఇంటర్నెట్ వేదికగా ఒక అగ్లీ ఫైట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ అభిమానులు అల్లు అర్జున్ 'చెప్పను బ్రదర్' అనే మాటను పట్టుకుని సోషల్ మీడియా వేదికగా ఎంత పెద్ద రచ్చ చేసారో అందరికీ తెలిసిందే.

పవన్ గురించి చెప్పమంటే బన్నీ 'చెప్పను బ్రదర్' అనడం మా దేవుడి(పవన్ కళ్యాణ్)ని అవమానించడమే అంటూ నేషనల్ లెవల్లో ట్విట్టర్లో ట్రెండింగ్ క్రియేట్ చేసారు ఫ్యాన్స్. అయినా బన్నీ ఏ మాత్రం తగ్గ లేదు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కూడా 'చెప్పను బ్రదర్' అనేసాడు. వాస్తవానికి నిజ జీవితంలో పవన్, బన్నీ బాగానే ఉంటారు. కాక పోతే అభిమానం పేరుతో ఇలా ఒకరిపై ఒకరు విద్వేషాలు పెంచుకునేది ఫ్యాన్స్ గ్రూఫులే.


Also See: మళ్లీ ఎందుకిలా మాట్లాడాడు? వివాదం పెరుగుతుందని తెలియదా.. ? అల్లు అరవింద్ సపోర్ట్ చేస్తున్నాడా


ఈ వివాదం ఇలా ఉంటే.... అల్లు వారి హీరోకు మరో తలనొప్పి వచ్చి పడింది. ట్విట్టర్లో 'చీప్ అల్లు పాలిటిక్స్' పేరుతో మహేష్ ఫ్యాన్స్ ట్రెండింగ్ క్రియేట్ చేసారు. ఇది కూడా నేషనల్ లెవల్లో ట్రెండింగ్ అవుతోంది. బ్రహ్మోత్సవం సినిమాకు థియేటర్లు దక్కకుండా అల్లు వారు థియేటర్లు బ్లాక్ చేసారని, మహేష్ ఫ్యాన్స్ ఇలా రెచ్చిపోవడానికి కారణం ఇదే అనే ప్రచారం జరుగుతోంది.


Allu Arjun maybe lash out?

ఇప్పటికే 'చెప్పను బ్రదర్' వివాదంతో బన్నీ చాలా డిస్ట్రబ్ అయ్యారు. ఇపుడు 'చీప్ అల్లు పాలిటిక్స్' వివాదంతో ఆయన మరింత గరం అయ్యారని టాక్. ఏదైనా వేదిక దొరికితే తగిన సమాధానం చెప్పాలని, తన పదునైన సమాధానంతో వాళ్ల దుమ్ము దులిపేయాలనేంత కోపంతో ఉన్నారట.


Also Read: మాతో పెట్టుకుంటే మడతడిపోద్ది: పవన్ ఫ్యాన్స్ పాంఫ్లేట్ వేసి మరీ అల్లు అర్జున్ ని...


నేటి సాయంత్ర మెగా ఫ్యామిలీ తొలి హీరోయిన్ నిహారిక నటించిన 'ఒక మనసు' ఆడియో వేడుక ఉంది. ఈ వేడుకకు అతిథిగా బన్నీ కూడా హాజరవుతున్నాడు. బయట జరుగుతున్న వివాదాలపై చాలా కోపంగా ఉన్న బన్నీ 'ఒక మనసు' ఆడియో వేడుకలో బరస్ట్ అయ్యే అవకాశం ఉందని టాక్. ఒక వేళ అదే జరిగితే తన తొలి సినిమా ఆడియో వేడుక రచ్చరచ్చ అవుతుందనే ఆందోళనలో ఉందట నిహారిక.


సాధారణంగా బన్నీ చాలా వరకు కంట్రోల్డ్ గానే ఉంటాడు. కానీ 'ఒక మనసు' ఆడియో వేడుకలో పాల్గొనే పవన్ ఫ్యాన్స్ రెచ్చ గొడితే మాత్రం బన్నీని ఆపడం ఎవరి తరం కాదు అని చర్చించుకుంటున్నారు. అదే జరిగితే 'చెప్పను బ్రదర్', 'చీప్ అల్లు పాలిటిక్స్' వివాదాలపై బన్నీ తగిన సమాధానం చెప్పే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఏం జరుగబోతోందో? వెయిట్ అండ్ సీ...

English summary
Film Nagar source estimated that Allu Arjun maybe lash out fans of Pawan and Mahesh at 'Oka Manasu' Audio launch.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu