For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  తండ్రికి పోటీగా అల్లు అర్జున్ న్యూ ప్లాన్.. ఆహా అనిపించెలా సొంత పెట్టుబడులతో..

  |

  కరోనా కారణంగా ఓటీటీ రంగం వాల్యూ ఏమిటో చాలా తొందరగా అర్ధమయ్యింది. భవిష్యత్తులో అప్పర్ హ్యాండ్ ఓటీటీదేనని ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది. కరోనా కంటే ముందు కూడా మెల్లగా ఓటీటీల హవా కొనగుతూ వచ్చింది. కానీ కరోనా వాటి వాల్యును ఒక్కసారిగా పెంచేసింది. అందుకే దర్శక్క నిర్మాతలు అటు వైపుగా ఒక దారిని అయితే క్రియేట్ చేసుకుంటున్నారు. తెలుగులో అగ్ర నిర్మాతల్లో ఒకరైన అల్లు అరవింద్ ఆహా యాప్ తో ఓటీటీలో కూడా పట్టు సాధించేందుకు సిద్ధమయ్యారు.

  ఆహా బ్రాండ్ పెంచేవిదంగా..

  ఆహా బ్రాండ్ పెంచేవిదంగా..

  ఇటీవల ఆహా మీట్ లో సరికొత్త మళ్ళీ బ్రాండ్ వాల్యూను పెంచిన అల్లు అరవింద్ వీలైనంత వరకు ఈ కరోనా కాలంలోనే వీక్షకుల సంఖ్యను పెంచాలని చూస్తున్నాడు. అయితే ఆయన ఒక్కరితోనే అది సాధ్యం కాదు. ఇక ఇటీవల సమంత తో ఒక షోను గ్రాండ్ గా లాంచ్ చేసి హైప్ గట్టిగానే క్రియేట్ చేశారు. విజయ్ దేవరకొండ కూడా అందుకు బాగానే సపోర్ట్ చేశాడు.

   ఖాళీ సమయాల్లో కథలు వింటున్న బన్నీ

  ఖాళీ సమయాల్లో కథలు వింటున్న బన్నీ

  ఇక తండ్రి మొదలుపెట్టిన ఓటీటీ సంస్థ బ్రాండ్ ను మరింత పెంచాలని మరోవైపు తనయుడు అల్లు అర్జున్ కూడా తనవంతు కృషి చేయబోతున్నట్లు తెలుస్తోంది. బన్నీ కాళీ సమయాల్లో ఎక్కువగా కథలు వినడం బాగా అలవాటు చేసుకున్నాడు. తనకు తెలిసిన దర్శకులు శిష్యులు ఎవరు ఎలాంటి కథలు చెప్పినా కూడా తన అభిప్రాయాన్ని చెప్పడం అలవాటు చెసుకున్నాడు.

  వెబ్ కంటెంట్ కోసం న్యూ ప్రొడక్షన్

  వెబ్ కంటెంట్ కోసం న్యూ ప్రొడక్షన్

  ఇక ఇటీవల కొందరు యువకులు చెప్పిన కథలు సెలెక్ట్ చేసుకున్న బన్నీ సొంత పెట్టుబడులతో వాటిని వెబ్ సిరిస్ లుగా నిర్మించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. అంటే చిన్న తరహాలో నిర్మాతగా అడుగులు వేసేందుకు బన్నీ ప్రయత్నం చేస్తున్నాడన్నమాట. గీత ఆర్ట్స్, GA2 సంస్థలు ఉన్నప్పటికీ వెబ్ కంటెంట్ కోసం మరొక ప్రొడక్షన్ హౌజ్ ఉండాలని ఆలోచించినట్లు సమాచారం. అల్లు అరవింద్ కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ అయితే వస్తోంది.

  సుకుమార్ పుష్ప సినిమాతో..బిజీగా..

  సుకుమార్ పుష్ప సినిమాతో..బిజీగా..

  ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఆ సినిమాలో బన్నీ పుష్పరాజ్ అనే ఒక లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నాడు. మొదటిసారి సుక్కు, బన్నీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా కథ కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. వచ్చే ఏడాది సినిమాను ఎలాగైనా రిలీజ్ చేయాలనీ బన్నీ ప్లాన్ చేసుకుంటున్నాడు.

  English summary
  Tollywood star heroes have been making movies with star directors lately. As the market grows, producers are also not adding new directors to star heroes. As far as possible, the directors who are blinding Labal with commercial films are selecting. Recently, Allu Arvind made a huge remuneration offer for his son, a star director.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X