Allu Arjun: అల్లు అర్జున్ రికార్డ్ రెమ్యునరేషన్.. అట్లీ మూవీ కోసం ఎన్నో కోట్లంటే?
సినీ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. పుష్ప సినిమా సక్సెస్ తో బన్నీకెరీర్ పూర్తిగా మారిపోయింది. ఎంతలా అంటే.. పుష్ప ముందు.. పుష్ప తరువాత అల్లు అర్జున్ అనేలా. పుష్ప 2 మూవీ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈ సినిమా భారీ విజయం అందుకోవడంతో పాటు పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ నటుడిగా అల్లు అర్జున్ నేషనల్ అవార్డు అందుకున్నారు. ఇలాంటి సంచలన విజయాలను అందుకున్న తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. సౌత్ ఇండియా సక్సెస్ పుల్ డైరెక్టర్ అట్లీతో ఓ భారీ బడ్జెట్ మూవీలో నటించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆ భారీ బడ్జెట్ మూవీ కోసం అల్లు అర్జున్ ఎంత పారితోషికం తీసుకోబోతున్నాడనేది చర్చనీయాంశంగా మారింది.
ఇండియన్ బాక్సాఫీస్‌లో పుష్ప 2 సినిమా ఓ సంచలనం. ఎవ్వరూ ఊహించని రికార్డులు బద్దలు కొట్టింది. ఓపెనింగ్స్ నుంచే హల్‌చల్ క్రియేట్ చేసింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ విడుదలైన మొదటి రోజే రూ.290 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి సంచలనం క్రియేట్ చేసింది. ఫలితంగా పుష్ప 2 మొత్తం రూ.1800 కోట్లపైగా వసూళ్లు చేసింది. ఇండియన్ సినిమా చరిత్రలో అత్యంత పెద్ద హిట్‌గా గుర్తింపు పొందింది. ఈ ఘనవిజయం అల్లు అర్జున్ రేంజ్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. అభిమానులు "పుష్ప అంటే నేషనల్ కాదు.. ఇంటర్నేషనల్!"అని కామెంట్స్ చేస్తున్నారు.

ఇంతటీ భారీ విజయాన్ని అందుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. అట్లీ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం AA22xA6 (వర్కింగ్ టైటిల్)లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ దీపికా పదుకోన్ హీరోయిన్‌గా నటిస్తోంది. సన్ పిక్చర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్‌తో ఈ మూవీను నిర్మిస్తున్నారు. అల్లు- అట్లీ కాంబోలో సినిమా ప్రకటించిన నాటి నుంచే సినిమాపై భారీ హైప్స్ నెలకొన్నాయి. అంతే కాకుండా ఈ భారీ బడ్జెట్ మూవీ నుంచి క్రేజీ అప్డేట్స్ లీక్ కావడంతో అభిమానులు, సినీ విశ్లేషకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
AA22xA6 మూవీని సైన్స్-ఫిక్షన్ అడ్వెంచర్ ఎంటర్టైనర్‌గా రూపొందిస్తున్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం, సినిమాను దాదాపు. రూ. 700 కోట్ల భారీ బడ్జెట్‌లో నిర్మిస్తున్నారట. ఈ బడ్జెట్ లో గ్రాఫిక్స్ కోసం రూ.250 కోట్లు, డైరెక్టర్, హీరోయిన్లు, టెక్నిషియన్స్ రెమ్యునరేషన్స్, ప్రొడక్షన్ ఖర్చులు మిగిలిన రూ.250 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేస్తున్నారు. ఇక అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ హైలైట్ గా మారింది. బన్నీ నటించడానికి ఎన్నో కోట్లు వసూలు చేయబోతున్నారని హాట్ టాపిక్ గా మారింది.
అయితే.. 'పుష్ప 2: ది రైజ్'సక్సెస్ తర్వాత అల్లు అర్జున్ మార్కెట్, క్రేజ్, ఇమేజ్ ఎంతో పెరిగింది. ఆ ప్రభావంతో ఇప్పుడు AA22xA6 కోసం అల్లు అర్జున్ రూ.175 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు నెట్టింట చర్చ జరుగుతోంది. ఫిలిం సర్కిల్స్‌లో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. బన్నీ స్టార్ డమ్‌ను దృష్టిలో ఉంచుకుని, నిర్మాతలు డిమాండ్ మేరకు పారితోషికం చెల్లించడానికి రెడీ అయ్యారట.
ప్రస్తుతం ఇండియన్ సినిమాల్లో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ పొందిన హీరోల జాబితాలో షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, రజనీకాంత్, ప్రభాస్ వంటి సూపర్ స్టార్‌లు ఉన్నాయి. వీరు ప్రాజెక్ట్ ఆధారంగా కోట్లకొద్దీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట. అల్లు అర్జున్ కూడా ఇప్పుడు అదే కేటగిరీలో చేరుతున్నారని, రూ.175 కోట్లు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే.. ఈ పారితోషిక, బడ్జెట్ వివరాలను అధికారికంగా వెల్లడించలేదు. అయినప్పటికీ సోషల్ మీడియాలో లీక్ అవుతున్న సమాచారం ద్వారా అభిమానుల్లో మళ్లీ హైప్ క్రియేట్ అయ్యింది. ఒకవేళ నిజమైతే, అల్లు అర్జున్ టాలీవుడ్‌లో హయ్యెస్ట్ పారితోషికం తీసుకునే హీరోగా రికార్డు సృష్టించనున్నారు.


Click it and Unblock the Notifications











