అల్లు అర్జున్ అండతోనే ఎలక్షన్ టిక్కెట్

ఇక నిన్న సాయింత్రం అల్లు అర్జున్ హీరోగా రూపొందిన చిత్రం రేసు గుర్రం. శ్రుతిహాసన్ హీరోయిన్. సురేందర్‌రెడ్డి దర్శకుడు. తమన్ స్వరాలందించారు. నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), డా||కె.వెంకటేశ్వరరావు నిర్మాతలు. తొలి సీడీని చిరంజీవి ఆవిష్కరించారు. దర్శకుడు వి.వి.వినాయక్ స్వీకరించారు. అల్లు అర్జున్ గురించి సమాచారాన్ని తెలిపే ఓ ఆప్‌ని కూడా ఇదే వేదికపై విడుదల చేశారు.
చిరంజీవి మాట్లాడుతూ.. ''బన్నీ హీరో కావాలని కోరుకున్న మొదటి వ్యక్తిని నేను. 'డాడీ'చిత్రంలో డ్యాన్స్ వేసే కుర్రాడి పాత్ర కోసం అనుకుంటే అల్లు అర్జునే గుర్తొచ్చాడు. ఆ ఒకటిన్నర నిమిషం సన్ని వేశంతో ఇండస్ట్రీ దృష్టిలో పడ్డాడు. క్రమశిక్షణ, కష్టపడే తత్వం బన్నీకి ఉన్నాయి. అవే అతనికి మంచి ఫలితాల్నిస్తున్నాయి. సురేందర్ రెడ్డి తీసిన 'కిక్' సినిమాని ఇటీవలే టీవీలో చూశాను. చాలా నచ్చింది. ఆ సమయంలో నేను రవితేజలా ఉండుంటే ఆ సినిమాని నేనే చేసేవాడినేమో అనిపించింది. చాలా మంచి దర్శకుడు సురేందర్‌రెడ్డి'' అన్నారు. చిత్ర పరిశ్రమలో నిర్మాతల పరిస్థితి గురించి చిరంజీవి మాట్లాడుతూ ''నిర్మాత లేకపోతే సినిమానే లేదు. ప్రతి ఒక్కరూ నిర్మాత బాగోగులు చూసి నడుచుకోవాలి. నిర్మాతకు విలువనిచ్చినప్పుడే పరిశ్రమ నిలబడుతుంది. ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు కలిసి చేసిన ఈ చిత్రం మంచి ఫలితాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా'' అన్నారు.


Click it and Unblock the Notifications











