»   » మనోడే కదా అని అల్లు అర్జున్ తలూపాడట

మనోడే కదా అని అల్లు అర్జున్ తలూపాడట

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అల్లు అర్జున్ ఆ మధ్య...ఎవడు చిత్రంలో గెస్ట్ గా కనిపించి అలరించారు. ఇప్పుడు రుద్రమదేవిలోనూ ఓ కీలకమైన పాత్రలో కనిపించటానికి కమిటయ్యాడు. ఈ మధ్యలో మరో చిత్రం క్లైమాక్స్ లో అల్లు అర్జున్ కనిపిస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. అది మరేదో కాదు గొల్లభామ. నాగబాబు కుమారుడు వరుణ్ తేజ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలో అల్లు అర్జన్ స్పెషల్ ఎట్రాక్షన్ గా కనపడతాడని వినిపిస్తోంది. మనవాడే కదా అని అల్లు అర్జున్ ఒప్పుకున్నాడని చెప్పుకుంటున్నారు. అయితే ఇది ఖరారు కాలేదని యూనిట్ వర్గాల సమాచారం. కేవలం ప్రపోజల్ స్ధాయిలోనే ఉందని అంటున్నారు. అల్లు అర్జున్ చేస్తే మాత్ర చిత్రానికి పిచ్చ క్రేజ్ రావటం ఖాయం.

ఇక దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చిత్రాలు రెండింటిలోనూ గోదావరి జిల్లా అందాలు, అక్కడ బాష కనిపిస్తుంది. ఇప్పుడు తన మూడో చిత్రానికి సైతం గోదావరి బ్యాక్ డ్రాప్ నే ఎన్నుకున్నట్లు సమాచారం. గొల్లభామ టైటిల్ తో రూపొందే ఈ చిత్రం గోదావరి దగ్గర ఓ పల్లెలో జరిగే అందమైన ప్రేమ కథ అని తెలుస్తోంది. నాగబాబు కుమారుడు వరుణ్ తేజ హీరోగా చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ తాడేపల్లి గూడెంలో జరుగుతోంది. అలాగే ఈ చిత్రానికి మిక్కీ జె.మేయర్ సంగీతం అందిస్తున్నారు.

Allu Arjun's Guest Role in Gollabhama

ఈ చిత్రంలో హీరోయిన్ గా బెంగళూరు కి చెందిన అమ్మాయిని ఎంపిక చేసారు. ఠాగూర్ మధు, నల్లమలుపు బుజ్జి కలిసి జాయింట్ గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కనుందని సమాచారం.

వరుణ్ తేజ్‌ హీరోగా నిలదొక్కుకునేందుకు కావాల్సిన క్వాలిటీస్‌ను మరింత మెరుగు పరుచుకుని మరీ వస్తున్నారు. ముఖ్యంగా డాన్స్‌ల విషయంలో చాలా కష్టడుతున్నాడని వినికిడి. మెగాస్టార్ చిరంజీవి తనతైన డాన్స్ స్టెప్పులతో థియేటర్లను షేక్ చేసాడు. ఆ తర్వాత ఆయన వారసత్వంతో అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ్ డాన్స్‌ల విషయంలో తమ ప్రత్యేకతను చాటుకున్నారు. ఇప్పుడు వరుణ్ తేజ్ కూడా స్టైల్ విషయంలో, డాన్స్ విషయంలో ప్రత్యేకత చాటుకోవడానికి ట్రై చేస్తున్నాడట.

English summary
Allu Arjun is likely to do guest appearance in Varu Tej's debut film Gollabhama.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu