»   » హాట్ టాపిక్ : 'రేసు గుర్రం' కథ లీకైంది

హాట్ టాపిక్ : 'రేసు గుర్రం' కథ లీకైంది

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్ : అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం 'రేసు గుర్రం'. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కలయికలో వస్తున్న తొలి సినిమా ఇదే. నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), డా.కె.వెంకటేశ్వరరావు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ పై మంచి అంచనాలే ఉన్నాయి.ఇక ఈ చిత్రం కథ లీకైందంటూ తాజాగా ఓ కథ ఫిల్మ్ సర్కిల్స్ లో ప్రచారంలోకి వచ్చింది.

  Allu Arjun's Race Gurram story leaked

  ఆ కథ ప్రకారం... సరదాగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ తిరిగే అల్లు అర్జున్ కి ఓ అన్నయ్య ఉంటాడు. అతను ఓ టప్ పోలీస్ ఆఫీసర్..కిక్ శ్యామ్. ఇద్దరికి ఎప్పుడూ పడదు..ఏదో ఒక గొడవ పడుతూనే ఉంటారు. ఈ లోగా..శ్యామ్... ఓ అవినీతి మినిస్టర్ కి చెందిన ఇల్లీగల్ ఏక్టివిటీస్ పట్టుకుని అరెస్టు చేయటానికి రెడీ అవుతాడు. అయితే అతన్ని పట్టిచ్చే డాక్యుమెంట్స్ మిస్ అవుతాయి. వాటి మీద తన తమ్ముడు అల్లు అర్జున్ ఫింగర్ ఫ్రింట్స్ ఉంటాయి. దాంతో తన తమ్ముడునే దోషిగా నిర్దారించి అరెస్ట్ చేయటానికి సిద్దపడతాడు. అలాంటి పరిస్ధితుల్లో అల్లు అర్జున్...తన నిర్ధోషిత్వాన్ని ఎలా నిరూపించుకున్నాడు...తనని కేసులో ఇరికించిన విలన్స్ కి ఎలా బుద్ది చెప్పాడనేది మిగతా కథ. ఈ చిత్రంలో ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు పూర్తి స్ధాయి కామెడీ ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ కథ నిజమే అయితే మంచి యాక్షన్ ఎంటర్టైన్మెంట్ చూడబోతున్నామన్నమాట.

  ఇద్దరమ్మాయిలతో... సినిమా బాక్సాఫీస్‌ వద్ద పరాజయం చెందిన తరువాత బన్ని చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమాతో ఎలాగైనా హిట్‌ కొట్టాలని భావిస్తున్నాడు. అలాగే ఊసరవెల్లి సినిమా తరువాత సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇది. ఇతనికీ ఈ సినిమా విజయం ఎంతో అవసరం ఉంది. ఎందుకంటే ఊసరవెల్లి అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది.ఈ చిత్రంలో సలోని సెకండ్ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ చిత్రానికి కథ : వక్కతం వంశీ, సంగీతం : తమన్, సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస, ఎడిటింగ్ : గౌతం రాజు, నిర్మాతలు : నల్లమలుపు శ్రీనివాస్, వెంకటేశ్వర రావు, దర్శకత్వం : సురేందర్ రెడ్డి.

  English summary
  According to insiders the ‘Race Gurram’ 's story runs like this. Happy go lucky guy Allu Arjun and Kick Shyam, a tough cop are both brothers. Shyam finds out the illegal dealings of a corrupt minister and the documents he finds against him were lost with fingers pointing towards his brother. All boils down to Shyam facing the dilemma of arresting his brother Allu Arjun, while Bunny is out evading him to prove his innocence tackling the unknown enemies. Film stars Shruthi Haasan and Saloni.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more