»   » కేక: ‘సరైనోడు’పూర్తి లుక్‌

కేక: ‘సరైనోడు’పూర్తి లుక్‌

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: హీరో అల్లు అర్జున్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘సరైనోడు'. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను సోమవారం విడుదల చేశారు. అల్లు అర్జున్‌ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా ఈ పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు.

బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌ నిర్మిస్తున్నారు. సాయి శ్రీనివాస్‌ సంగీతం సమకూర్చారు. ఏప్రిల్‌లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. రీసెంట్ గా ఈ చిత్రం ప్రీ లుక్ రిలీజ్ చేసారు. దానికి మంచి క్రేజ్ వచ్చింది.

యాక్షన్ ఓరియెంటెడ్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ గన అనే పాత్రను పోషిస్తున్నారు. మాస్‌, యాక్షన్‌, వినోదం ఇలా ఎలాంటి కథలో అయినా ఇట్టే ఇమిడిపోతాడు అల్లు అర్జున్‌. 'సన్నాఫ్‌ సత్యమూర్తి'తో కుటుంబ ప్రేక్షకులకూ దగ్గరయ్యాడు. హీరోలోని వీరత్వాన్ని ఓ స్థాయిలో చూపించే దర్శకుడు బోయపాటి శ్రీను. వీళ్లిద్దరి కలయికలో ఈ చిత్రం రూపుదిద్దుకొంటోంది.

Allu Arjun's Sarainodu first look

గీతా ఆర్ట్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రకుల్‌ప్రీత్‌ సింగ్‌, కేథరిన్‌ హీరోయిన్స్. శ్రీకాంత్‌, ఆది పినిశెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే అల్లు అర్జున్‌, కేథరిన్‌, ఆది పినిశెట్టి తదితరులపై కొన్ని కీలకమైన సన్నివేశాలు తెరకెక్కించారు.

ఈ చిత్రం కోసం 'సరైనోడు' అనే పేరు పరిశీలిస్తున్నారు. బన్నీ తన సినిమాల్లో స్త్టెల్‌కి ప్రాధాన్యం ఇస్తుంటారు. ఇందులోనూ విభిన్నమైన గెటప్‌లో కనిపించబోతున్నారట. యాక్షన్‌తో పాటు వినోదం, కుటుంబ బంధాలకూ ఈ చిత్రంలో ప్రాధాన్యం ఉందని తెలుస్తోంది.

అలాగే ఈ చిత్రంలో చబ్బీ బ్యూటీ అంజలి గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది. అల్లు అర్జున్, బోయపాటి కాంబినేషన్ లో రూపొందుతున్న సరైనోడు చిత్రంలో ఆమె నటించనుందని సమాచారం. ఈ సినిమాలో ఆమెది ఫుల్ ప్లెడ్జెడ్ రోల్ కాకపోయినా ఆమె స్పెషల్ అప్పీరియన్స్ సినిమాకు హైలెట్ గా నిలిచే పాత్ర అని చెప్తున్నారు.

ఓ సీన్, స్పెషల్ సాంగ్ అని చెప్తున్నారు. మొదటి ఈ పాత్రకు గానీ అనుష్క ను అనుకున్నా ఆమె డేట్స్ ఎడ్జెస్ట్ కాకపోవటంతో అంజలి సీన్ లోకి వచ్చిందని తెలుస్తోంది. సంగీతం: తమన్‌

English summary
Allu Arjun's ‘Sarainodu’ first look released as Republic day Special.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu