అల్లు అర్జున్ మరో పాన్ ఇండియా మూవీ: కోలీవుడ్ నిర్మాతతో బిగ్ డీల్.. ఆ దర్శకుడితోనే చేసే ఛాన్స్

టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కుమారుడిగా సినిమాల్లోకి ప్రవేశించాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఆరంభంలోనే తన టాలెంట్‌తో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన అతడు.. తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నాడు. అప్పటి నుంచి జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ సత్తా చాటుతోన్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం 'పుష్ప' అనే మూవీ చేస్తోన్న అల్లు అర్జున్.. ఇప్పుడు మరో పాన్ ఇండియా సినిమాకు సంతకం చేసేశాడట. అది కూడా కోలీవుడ్‌కు చెందిన భారీ నిర్మాణ సంస్థతో అతడు ఇది చేస్తున్నాడట. ఆ వివరాలు మీకోసం!

చాలా ఏళ్లకు ఇండస్ట్రీ హిట్ కొట్టిన బన్నీ

చాలా ఏళ్లకు ఇండస్ట్రీ హిట్ కొట్టిన బన్నీ

అల్లు అర్జున్ హీరోగా పరిచయమై చాలా కాలమే కావొస్తుంది. సుదీర్ఘమైన కెరీర్‌లో అతడు ఒక్కటంటే ఒక్క ఇండస్ట్రీ హిట్‌నే అందుకున్నాడు. అది కూడా గత ఏడాది వచ్చిన 'అల.. వైకుంఠపురములో' అనే చిత్రంతోనే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించిన ఈ సినిమా భారీ హిట్ అయింది. అదే సమయంలో కలెక్షన్లను కూడా ఓ రేంజ్‌లో రాబట్టింది.

పాన్ ఇండియా స్టార్ అయ్యేందుకు ఇలా

పాన్ ఇండియా స్టార్ అయ్యేందుకు ఇలా

భారీ హిట్ తర్వాత అల్లు అర్జున్.. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' అనే సినిమా చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా చేస్తోంది. ఫహద్ ఫాజిల్ విలన్‌గా చేస్తున్నాడు. దేవీ శ్రీ ప్రసాద్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. గంథపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో వస్తున్న ఈ మూవీలో బన్నీ లారీ డ్రైవర్‌ పుష్ప రాజ్‌గా నటిస్తున్నాడు.

పుష్ప రెండు భాగాలు.. ఒక్కటే ఇప్పుడు

పుష్ప రెండు భాగాలు.. ఒక్కటే ఇప్పుడు

పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న 'పుష్ప' మూవీని రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నారని ఇటీవలే చిత్ర యూనిట్ వెల్లడించింది. దీంతో ఇది దేశ వ్యాప్తంగ చర్చనీయాంశం అయింది. మొదటి భాగానికి సంబంధించిన షూట్ దాదాపు 80 శాతం వరకూ పూర్తైనట్లు తెలుస్తోంది. ఇక, ఇందులో మొదటి భాగం దసరాకు గానీ సంక్రాంతికి గానీ విడుదల కాబోతుందని అంటున్నారు.

ఆ సినిమా అన్నారు.. కానీ చాలా టాక్స్

ఆ సినిమా అన్నారు.. కానీ చాలా టాక్స్

'పుష్ప' మొదటి భాగం ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత అటు అల్లు అర్జున్.. ఇటు సుకుమార్ వేరే వాళ్లతో సినిమాలు చేయబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. అంటే రెండో భాగం విడుదలకు ముందే వాళ్లిద్దరి చెరో సినిమా వస్తుందట. ఈ నేపథ్యంలో బన్నీ తన తదుపరి చిత్రాన్ని వేణు శ్రీరామ్‌తో చేస్తాడని ప్రచారం జరుగుతోంది. ఇది 'ఐకాన్' స్క్రిప్ట్ అని జోరుగా వార్తలు వస్తున్నాయి.

అల్లు అర్జున్ మరో పాన్ ఇండియా మూవీ

అల్లు అర్జున్ మరో పాన్ ఇండియా మూవీ

'పుష్ప' మూవీతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అవుతాడనడంలో ఏమాత్రం సందేహం లేదు. దీనికి కారణం ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా నెలకొన్న ఆసక్తే. దీనికితోడు బన్నీకి డబ్బింగ చిత్రాల ద్వారా హిందీ ప్రేక్షకులు, మలయాళ ఆడియెన్స్ బాగా చేరువయ్యారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అల్లు అర్జున్ మరో పాన్ ఇండియా సినిమా చేయబోతున్నట్లు ఓ న్యూస్ తాజాగా బయటకొచ్చింది.

కోలీవుడ్ నిర్మాతతో అల్లు అర్జున్ బిగ్ డీల్

కోలీవుడ్ నిర్మాతతో అల్లు అర్జున్ బిగ్ డీల్

అల్లు అర్జున్ ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ సంస్థతో 'పుష్ప' చేస్తున్నాడు. దీని తర్వాత డీవీవీ దానయ్య ప్రొడక్షన్‌లో ఓ మూవీ ఉంటుందని అన్నారు. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ స్టార్ హీరో కోలీవుడ్ బడా ప్రొడ్యూసర్ ఎస్ థానుతో ఓ సినిమా చేయబోతున్నాడట. ఇప్పటికే వీళ్లిద్దరి మధ్య డీల్ కూడా జరిగినట్లు తెలిసింది. దీని కోసం బన్నీ భారీగా ఛార్జ్ చేస్తున్నాడని తెలుస్తోంది.

ఆ దర్శకుడితోనే చేసే ఛాన్స్ ఉందని టాక్

ఆ దర్శకుడితోనే చేసే ఛాన్స్ ఉందని టాక్

ఎస్ థాను నిర్మాణంలో గతంలో 'తేరీ', 'తుపాకీ', 'అసురన్' వంటి భారీ హిట్ చిత్రాలు వచ్చాయి. అందుకే అల్లు అర్జున్ ఆయనకు ఓకే చెప్పాడని అంటున్నారు. ఇక, ఈ చిత్రాన్ని కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్‌ తెరకెక్కిస్తాడని తమిళ పరిశ్రమలో జోరుగా ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి బన్నీ - మురుగదాస్ కాంబోపై ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X