»   »  చంద్రప్రతాప్ గా అల్లు అర్జున్ ?

చంద్రప్రతాప్ గా అల్లు అర్జున్ ?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Allu Arjun
భాస్కర్, అల్లు అర్జున్ ల కాంబినేషన్ లో వచ్చిన పరుగు ప్రేక్షకుల అంచనాలు అందుకోలేక చతికిలిపడింది. దాంతో వీరు మళ్ళీ కలిపి చేస్తారా అన్న ప్రశ్న అందరిలో మెదిలింది. కాని 'పరుగు' షూటింగ్ సమయంలో అల్లు అర్జున్ కి భాస్కర్ ఓ స్టోరి వినిపించాడుట. దానికి అతను పచ్చ జెండా ఊపాడని వార్తలు వినిపిస్తున్నాయి. అందులోనూ భాస్కర్ 'చంద్రప్రతాప్' పేరుతో ఓ టైటిల్ ఆల్రెడీ రిజిస్టర్ చేసాడట. చారిత్రిక కథాంశంతో కూడిన ఈ కథ కుటుంబ విలువలు, వాటి పరిరక్షణ కోసం ప్రాణాలు సైతం ఇవ్వగల పాత్రల చుట్టూ తిరుగుతుందిట. 'హ్యాపీడేస్' ఫేమ్ తమన్నా అర్జున్ కి పెయిర్ గా చెయ్యాలని ఆలోచిస్తున్నారుట. అలాగే స్కిప్టు వర్క్ పూర్తియి ఈ ప్రాజెక్టు కార్య రూపం దాల్చేసరికి ఎలాగో యేడాది పైగా పడుతుందని ఈ లోగా బన్ని...ఆర్య సుకుమార్ ప్రాజెక్టు పూర్తి చేసుకుంటాడట. ఈ వార్త నిజమైతే పరుగులో అప్పుడప్పుడూ పడిపోవటం కామన్ అన్న విషయాన్ని గమనించి భాస్కర్ కి అవకాశం ఇవ్వటానికి ముందుకొచ్చే బన్ని ని మెచ్చుకోవాలి. ఇదంతా బాగానే ఉందిగాని భాస్కర్ తో విక్రమ్ సినిమా అన్నారుగా ఇప్పుడు అది మెటీరిలైజ్ అవుతుందా అంటున్నారు ఓ వర్గం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X