»   » ‘బద్మాష్’అనిపించుకోవటానికి అల్లు అర్జున్ రెడీనా?

‘బద్మాష్’అనిపించుకోవటానికి అల్లు అర్జున్ రెడీనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగుళూరు : అల్లు అర్జున్ దృష్టి ఓ కన్నడ చిత్రంపై పడిందని, దాన్ని రీమేక్ చేయాలని ఆయన ప్లాన్ చేస్తున్నట్లు కన్నడ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పీవిపి బ్యానర్ లో ఈ చిత్రం రూపొందనుందని చెప్తున్నారు. ఈ మేరకు టాక్స్ జరుగుతున్నాయని వినికిడి.

కన్నడ సిని వర్గాల నుంచి అందుతున్న సమాచారం....కన్నడంలో త్వరలో విడుదల అవుతున్న బద్మాష్ చిత్రాన్ని అల్లు అర్జున్ తో ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో ధనుంజయ్ హీరోగా చేసారు. అర్బన్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ చిత్రం ఓ రొమాంటిక్ థ్రిల్లర్ గా రూపొందుతోంది.

ఇక అల్లు అర్జున్ హీరోగా తాజాగా నటిస్తున్న చిత్రం 'డి.జె.. దువ్వాడ జగన్నాథమ్‌'. హరీశ శంకర్‌.ఎస్‌. దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స పతాకంపై రూపొందుతున్న 25వ చిత్రమిది. దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రంలోని పాటలకు సంబంధించి సంగీత చర్చలు చెన్నైలో జరుగుతున్నాయి.

దేవిశ్రీప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. అల్లు అర్జున్, దేవిశ్రీ ప్రసాద్‌ కాంబినేషన్‌లో ఇంతకు ముందు పలు మ్యూజికల్‌ బ్లాక్‌బస్టర్లున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్.

English summary
If latest reports are to be believed, Allu Arjun wants to remake a Kannada film in telugu. The Bollywood star is quite impressed with the film which stars Dhananjay and Sanchita Shetty in lead roles ‘Badmaash’
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu