For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Pushpa Story లైన్ లీక్: రాఖీ భాయ్‌ను ఫాలో అవుతోన్న అల్లు అర్జున్.. గూస్‌బమ్స్ వచ్చేలా ప్లాన్!

  |

  ఈ మధ్య కాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన హీరోలంతా పాన్ ఇండియా స్టార్లు అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు హీరోలు తమ స్టామినాను దేశం మొత్తానికి పరిచయం చేసుకున్నారు. ఈ క్రమంలోనే మరికొందరు పాన్ ఇండియా బాట పడుతున్నారు. అలాంటి వారిలో అల్లు వారి అబ్బాయి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకడు. గత ఏడాది 'అల.. వైకుంఠపురములో' సినిమాతో ఇండస్ట్రీ హిట్‌ను సొంతం చేసుకున్న అతడు.. ఇప్పుడు 'పుష్ప' అనే భారీ చిత్రంలో నటిస్తున్నాడు.

  ఐదో భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ లైన్ బయటకు వచ్చింది. దీంతో ఇండస్ట్రీలో కొత్త చర్చలు మొదలయ్యాయి. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

  స్మగ్లర్ ‘పుష్ప'గా రాబోతున్న అల్లు అర్జున్

  స్మగ్లర్ ‘పుష్ప'గా రాబోతున్న అల్లు అర్జున్

  ‘రంగస్థలం' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత లెక్కల మాస్టారు సుకుమార్.. ‘అల.. వైకుంఠపురములో' వంటి పరిశ్రమ విజయం తర్వాత అల్లు అర్జున్ కలిసి చేస్తున్న చిత్రమే ‘పుష్ప'. పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతోన్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. కన్నడ పిల్ల రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది.

  మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేస్తున్నాడు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్ ఇందులో కీలక పాత్రలో నటిస్తోంది.

  నిహారిక భర్త చైతన్యపై పోలీస్ కేసు: అర్ధరాత్రి ఆ విషయంలో మొదలైన గొడవ.. సీసీ పుటేజ్‌లో కీలక ఆధారాలు

  ఐకాన్ స్టార్ అయ్యేందుకు అన్ని రకాలుగా

  ఐకాన్ స్టార్ అయ్యేందుకు అన్ని రకాలుగా

  కెరీర్ ఆరంభం నుంచీ విభిన్నమైన స్టైల్స్‌తో స్టైలిష్ స్టార్‌గా పేరొందిన అల్లు అర్జున్.. ‘పుష్ప' మూవీతో ఐకాన్ స్టార్‌ బిరుదును అందుకుంటున్నాడు. ఈ విషయాన్ని దర్శకుడు సుకుమార్ ఇటీవలే వెల్లడించాడు. ఇందుకోసం అతడు ఎన్నో సాహసాలు సైతం చేస్తున్నాడు. ఇప్పటికే కొండ ప్రాంతాల్లో లారీ డ్రైవింగ్‌ నేర్చుకున్న అతడు.. రియల్ స్టంట్స్ కూడా చేస్తున్నాడు. అంతేకాదు, చిత్తూరు ప్రాంతపు యాసను మాట్లాడుతున్నాడు. మరీ ముఖ్యంగా ఈ మూవీలో అతడు డీ గ్లామర్‌గా కనిపిస్తున్నాడు కూడా.

  రెండు భాగాలుగు పుష్ప.. రిలీజ్ డేట్ ఇదే

  రెండు భాగాలుగు పుష్ప.. రిలీజ్ డేట్ ఇదే

  భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న ‘పుష్ప' మూవీని రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నారన్న విషయం తెలిసిందే. ఇప్పటికే మొదటి భాగానికి సంబంధించిన 90 శాతం షూటింగ్ పూర్తైంది. అలాగే, రెండో పార్ట్‌ కోసం దాదాపు 30 శాతం చిత్రీకరణ జరిపారు. ఇప్పుడు మొదటి దాని కోసం షూట్ చేస్తున్నారు. ఇక, మొదటి భాగాన్ని ‘పుష్ప.. ద రైజ్' పేరిట వచ్చే క్రిస్టమస్‌కు ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవలే ప్రకటించింది. అలాగే, మొదటి పాటను కూడా ఆగస్టు 13న విడుదల చేస్తున్నారు.

  మంచు లక్ష్మీ ఘాటు ఫోజులు: గతంలో ఎన్నడూ చూడని విధంగా.. షాకిస్తోన్న ఆమె పర్సనల్ ఫొటోలు

  ఒక్క వీడియోతో వండర్స్ క్రియేట్ చేశాడు

  ఒక్క వీడియోతో వండర్స్ క్రియేట్ చేశాడు

  అల్లు అర్జున్ నటిస్తోన్న ‘పుష్ప' సినిమా నుంచి కొద్ది రోజుల క్రితం ‘Introducing Pushpa Raj' అనే వీడియోను విడుదల చేశారు. పూర్తి మాస్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ వీడియోకు ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. ఫలితంగా ఇది ఎన్నో రికార్డులను బద్దలు కొట్టేసింది. తద్వారా తెలుగులోనే ఎక్కువ వ్యూస్ సాధించిన టీజర్‌గా నిలిచింది. ఈ మధ్యనే 70 మిలియన్ మైలురాయి దాటింది. దీంతో ఈ టీజర్ టాలీవుడ్‌లోనే కాకుండా సౌతిండియన్ రికార్డులను సైతం బద్దలు కొట్టేసిన విషయం తెలిసిందే.

  బయటకు వచ్చిన పుష్ప మూవీ స్టోరీ లైక్

  బయటకు వచ్చిన పుష్ప మూవీ స్టోరీ లైక్

  పూర్తి స్థాయి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ‘పుష్ప' మూవీ తెరకెక్కుతోంది. ఇక, ఇప్పటికే ఈ మూవీ స్టోరీ లైన్ గురించి ఎన్నో ఊహాగానాలు ప్రచారం అయ్యాయి. మరీ ముఖ్యంగా ఇది రివేంజ్ డ్రామా అని కూడా వార్తలు వచ్చాయి. అయితే, తాజాగా ఈ మూవీ నేపథ్యం గురించి ఓ న్యూస్ బయటకు వచ్చింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో అల్లు అర్జున్ ట్రాన్స్‌పోర్ట్ బిజినెస్ చేస్తుంటాడట. అలాంటి వ్యక్తి పెద్ద డాన్‌గా ఎలా మారాడన్నదే ఈ సినిమా కథ అని అంటున్నారు. అందుకే ఫస్ట్ పార్ట్‌కు ‘రైజ్' అనే ట్యాగ్ లైన్ పెట్టారని తెలిసింది.

  అక్షర హాసన్ అదిరిపోయే ఫొటోలు: శృతి హాసన్‌కు ఏమాత్రం తక్కువ కాకుండా.. రెచ్చిపోయిన పిల్లికళ్ల పిల్ల

  రాఖీ భాయ్‌ను ఫాలో అవుతున్న బన్నీ

  రాఖీ భాయ్‌ను ఫాలో అవుతున్న బన్నీ

  ‘పుష్ప' మూవీకి స్టోరీకి సంబంధించి తాజాగా అందిన సమాచారం ప్రకారం.. ఇందులో అల్లు అర్జున్ గంథపు చెక్కలను స్మగ్లింగ్ చేసే ఇల్లీగల్ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీని నడుపుతుంటాడు. అలాంటి వ్యక్తి నల్లమల ఫారెస్ట్ మొత్తానికి డాన్‌గా ఎదుగుతాడని తెలుస్తోంది. ఇక, ఇది బయటకు వచ్చిన తర్వాత ‘పుష్ప' మూవీలో ‘కేజీఎఫ్' సినిమా మూలాలు ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది. అందులో కూడా కేజీఎఫ్‌ను సొంతం చేసుకుని రాఖీ భాయ్ డాన్‌గా అవతరిస్తాడు. దీంతో ఈ రెండు చిత్రాలనూ అప్పుడూ పోల్చేస్తున్నారు సినీ ప్రియులు.

  బాలీవుడ్, దక్షిణాది సినిమాకు సంబంధించిన తాజా వార్తలకు, తారల ఇంటర్యూలకు, ఫోటోగ్యాలరీలు, సినిమా ఈవెంట్లు, వివాదాస్పద అంశాలకు సంంధించిన వార్తా విశ్లేషణలకు ఫేస్‌బుక్, ట్విట్టర్ , ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్లను ఫాలో అవ్వండి.

  English summary
  Tollywood Star Hero Allu Arjun Doing Pushpa Under Creative Director Sukumar Direction. Now This Movie Story Line Leaked.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X