For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bheemla Nayak: రిలీజయిన నెలకు ఓటీటీలో.. భారీ మొత్తానికి డీల్ క్లోజ్.. ఇందులో రిలీజ్ అంటే?

  |

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దగ్గుబాటి రానా కాంబినేషన్లో ఒక మల్టీస్టారర్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రకటన వచ్చిన నాటి నుంచే సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు నిర్మాతలు. సంక్రాంతి సందర్భంగా సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ సినిమాను ఏ ఓటీటీ కొనుక్కుంది అనేది కూడా ఇప్పుడు వెల్లడయింది. ఆ వివరాల్లోకి వెళితే..

  దుమ్ము రేపాడుగా

  దుమ్ము రేపాడుగా

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కాంబినేషన్ సినిమా భీమ్లా నాయక్ నుంచి తాజాగా టైటిల్ తో పాటు ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. "భీమ్లా నాయక్" అనే టైటిల్ ను ప్రకటిస్తూ లుంగీలో పవన్ రచ్చ చేస్తున్నట్టుగా లుక్ రివీల్ అయ్యే వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో పవర్ స్టార్ దుమ్మురేపాడు. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులయితే పండగ చేస్తుకున్నారు.

  ఇగో సమస్యే

  ఇగో సమస్యే

  అయ్యప్పనుమ్ కోషియుమ్ అనే ఒక మల్టీ స్టారర్, ఈ సినిమాని మలయాళంలో బిజు మీనన్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రధారులుగా తెరకెక్కించారు. బిజు మీనన్ ఒక ఏజెన్సీ ప్రాంతంలో పోలీస్ అధికారిగా పని చేస్తూ ఉండగా పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారు. నో ఆల్కహాల్ జోన్ పరిధిలో ఉన్న ఏజెన్సీ ఏరియాలో కి ఆల్కహాల్ తో ప్రయాణిస్తూ పృథ్వీరాజ్ సుకుమారన్ పట్టుబడతారు.

   సినిమా బాగా నచ్చడంతో

  సినిమా బాగా నచ్చడంతో

  మద్యం మత్తులో ఉన్నప్పుడు సుకుమారన్ బిజు మీనన్ మీద చేయి చేసుకునే పరిస్థితి రావడంతో వీరిద్దరి మధ్య పెద్ద యుద్ధమే మొదలవుతుంది. ఆ ఇగో వార్ ఎంత దూరం వెళ్ళింది ? ఒకరినొకరు చంపుకునే వరకు ఎందుకు వెళ్ళింది ? అనే దానిని ఆసక్తికరమైన రీతిలో చూపడంతో సినిమా మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా నచ్చడంతో నిర్మాత నాగవంశీ ఈ సినిమా హక్కులు కొనేశారు.

  త్రివిక్రమ్ క్రేజ్

  త్రివిక్రమ్ క్రేజ్

  ముందు నుంచి ఈ సినిమాలో రానా-బాలకృష్ణ, రవితేజ -రానా ఇలా అనేక కాంబినేషన్లు సెట్ చేస్తారని వార్తలు వచ్చినా చివరికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-రానా కాంబినేషన్ లో మొదలైంది. అయితే సాగర్ కే చంద్ర అనే ఒక సినిమా తీసిన దర్శకుడు ఈ సినిమా తెరకేక్కిస్తూ ఉండగా సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ, కథనం మాటలు అందిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నిత్యామీనన్ నటిస్తుండగా రానా సరసన ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు అని అంటున్నారు.

  Shabeer Kallarakkal As dancing rose is the latest social media sensation.
  ఆమెజాన్ ప్రైం చేతిలోనే

  ఆమెజాన్ ప్రైం చేతిలోనే

  ఈ సినిమా జనవరి 13 2022 , సంక్రాంతి స్పెషల్ గా విడుదల చేస్తున్నారు. ఇటీవల విడుదలైన పవన్ కళ్యాణ్ స్పెషల్ ట్రైలర్‌కి అద్భుతమైన స్పందన రావడంతో సినిమాపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇక అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా డిజిటల్ హక్కులను రికార్డు ధరకు పొందినట్లు ప్రచారం జరుగుతోంది. అది ఎంత అనే విషయం మాత్రం బయటకు రాలేదు. మరో విషయం ఏంటంటే ఓటీటీ ప్లాట్‌ఫాం పవన్ కళ్యాణ్ చివరి సినిమా వకీల్ సాబ్‌ను కూడా రిలీజ్ చేసింది. ఆసక్తికరంగా ఇదే ప్లాట్‌ఫారమ్‌ దగ్గరే భీమ్లా నాయక్ ఒరిజినల్ - అయ్యప్పనుమ్ కోషియుమ్ యొక్క రైట్స్ కూడా ఉన్నాయి. సినిమా విడుదలైన నేల తరువాత ఓటీటీలో విడుదల చేయబోతున్నారు అని అంటున్నారు. అయితే ఈ వార్తకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

  English summary
  As per some reports Amazon Prime Bought Pawan Kalyan Rana Bheemla Nayak OTT Rights. Movie may release digitally after a month of theatrical release
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X