»   » చిరు చిత్రం కన్నా ముందే తెలుగులో అమితాబ్

చిరు చిత్రం కన్నా ముందే తెలుగులో అమితాబ్

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  అబితాబ్-ఫూరి కాంబినేషన్ లో వచ్చిన బాలీవుడ్ మూవీ 'బుడ్డా" ప్రీమియర్ షో సందర్బంగా చిరంజీవితో 150వ సినిమా తీస్తానని దర్శకుడు పూరి ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి సానుకూలంగా స్పందించిన చిరు...ఆ సినిమాలో బిగ్ బి గెస్ట్ పాత్రలో కనిపించాలని కోరడం, అందుకు అమితాబ్ కూడా ఓకే చెప్పడం కూడా జరిగింది. బిగ్ బి తొలి సారిగా తెలుగు తెరపై కనిపించ బోతుండటం, అది కూడా మెగాస్టార్ సినిమాలో కావడంతో చిరు అభిమానులు సంబర పడ్డారు. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం చిరు 150 సినిమా కంటే ముందే బిగ్ బి తెలుగు తెరపై కనిపించ బోతున్నారని తెలుస్తోంది.

  బాలీవుడ్ ఆ మధ్య వచ్చిన 'డిపార్ట్ మెంట్ " సినిమా ఉన్నది ఉన్నట్లుగా తెలుగులో రాబోందట. అలా అని ఇది డబ్బింగ్ సినిమా అనుకుంటే ఫొరపాటే. ఎందుకంటే ఇందులో బిగ్ నటించిన సన్ని వేషాలు తెలుగు ప్రేక్షుకులను ఆకట్టకునే విధంగా రీ షూట్ చేశారట. అంటే బిగ్ బితో తెలుగు లిప్ మూమెంట్ ఇప్పించి ఆయనతో డబ్బింగ్ చెప్పించారట. ఇతర ముఖ్య పాత్రల లిప్ మూమెంట్ లో కూడా తేడా రాకుండా తెలుగుకు సెట్ అయ్యే విధంగా తీర్చిదిద్దారని తెలిసింది. ఇదే జరిగితే....చిరంజీవి 150వ సినిమా కంటే ముందు బిగ్ బి తెలుగు తెరపై మెరవడం ఖాయం. తన ద్వారానే బిగ్ బి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు అని చిరంజీవి చెప్పకునే అవకాశం కూడా ఉండదు.

  English summary
  Amitabh might be acting in a Telugu film before Chiru’s project. Strong gossip is that the Hindi film ‘Department’ is happening in Telugu as well. If that is true then Big B is also part of it. If it is dubbing then okay, but if few scenes are really re-shot with Big B’s lip movement to sync for Telugu, then it will become straight Telugu film for Big B.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more