For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అల్లు అర్జున్ తండ్రిగా మెగా స్టార్!?

  By Srikanya
  |

  హైదరాబాద్ : అల్లు అర్జున్ తండ్రిగా మెగా స్టార్ కనిపించే అవకాశాలు ఉన్నాయంటున్నారు టాలీవుడ్ వాసులు. అయితే మెగాస్టార్ అనగానే చిరంజీవికి ఫిక్సైపోకండి. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ని తండ్రి పాత్రకు గానూ అడుగుతున్నట్లు సమాచారం. ఈ మేరకు టాక్స్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అదే నిజమైతే ప్రాజెక్టుకు మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు.

  ఇంతకుముందు అత్తారింటికి దారేది చిత్రంలో పవన్ కు తాతగా బొమన్ ఇరాని ని తీసుకువచ్చి మార్కులు కొట్టేసిన త్రివిక్రమ్ ఈ సారి ఇలా అమితాబ్ ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేద్దామని ఫిక్సైనట్లు తెలుస్తోంది. అలాగే ఈ పాత్రకు గానూ ఇప్పటికే ముమ్మట్టి,మోహన్ లాల్ ని సైతం సంప్రదించినట్లు తెలుస్తోంది. ఎందుకంటే మళయాళంలో అల్లు అర్జున్ కు ఉన్న మార్కెట్ ని దృష్టిలో పెట్టుకునే ఆ నిర్ణయిం తీసుకున్నారు.

  అయితే ముమ్మట్టే తనకు మొదటే ఇలా తండ్రి పాత్రల పట్ల ఆసక్తి లేదని తేల్చే సారు. అయితే మోహన్ లాల్ మాత్రం ఏ నిర్ణయం ఆలోచించుకుని చెప్తానని అన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే మళయాళంలో కూడా ఈ చిత్రం భారీగా విడుదల కానుండటంతో ఆ సీనియర్ హీరోలు ఆలోచనలో పడ్డారు. ఈ నేపధ్యంలో అమితాబ్ తో ఈ పాత్రను చేయించాలని అల్లు అర్జున్ సూచించాడని చెప్పుకుంటున్నారు. అన్నీ ఫైనల్ అయితే నవంబర్ రెండవ వారంలో ఆ పాత్రకు సంభందించిన సీన్స్ షూట్ చేస్తారు.

  హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సమంతా, ఆదాశర్మ, రాశిఖన్నా హీరోయిన్స్ . ఏప్రిల్‌లో ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభోత్సవం జరుపుకున్న విషయం తెలిసిందే. జులాయి తర్వాత త్రివిక్రమ్, అల్లు అర్జున్ కలయికలో వస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.

  Amitabh Bachchan as Allu Arjun's Father!

  కొత్త కథ, కథనాలతో ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ పాత్ర చిత్రణ సరికొత్త పంథాలో వుంటుందని నిర్మాత చెబుతున్నారు. ఈ చిత్రంలో స్నేహ, కన్నడ నటుడు ఉపేంద్ర కీలక పాత్రల్ని పోషిస్తున్నారు. ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్ సంగీతాన్నందిస్తున్నారు.

  త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఆయన చేస్తున్న తాజా చిత్రం షూటింగ్ కోసం ఆయన అక్కడకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అక్కడ కంటిన్యూగా ఓ పెద్ద షెడ్యూల్ చేయనున్నారు. సమంత, అదా శర్మ, ఉపేంద్ర ఆ షెడ్యూల్ లో పాల్గొననున్నారు.

  ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ చిత్రం కీ సీన్స్ షూటింగ్ జరుగుతోంది. అలాగే ఈ చిత్రంలో ఉపేంద్ర నెగిటివ్ పాత్ర చేస్తాడని ప్రచారం జరుగుతోంది. అయితే ఆ పాత్ర నెగిటివ్ కాదని..ప్యారలల్ గా సాగే పాత్ర అని సినిమాలో మరో లీడ్ క్యారెక్టర్ లాంటిదని తెలుస్తోంది. అందుకే ఉపేంద్ర ఒప్పుకున్నాడని తెలుస్తోంది.

  త్రివిక్రమ్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ మరోసారి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో మొదలైంది. చాలా కాలం నుంచి రేపు మాపు అంటూ వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలు కావటంతో అభిమానుల ఆనందానికి అంతేలేదు.

  ఇదివరకు 'జులాయి'తో సందడి చేసిన ఈ కలయికపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కొత్త సినిమాకు చాలా రోజుల క్రితమే కొబ్బరికాయ కొట్టేశారు. వచ్చే నెలలో చిత్రీకరణ అన్నారు. అయితే రకరకాల కారణాలతో వాయిదాపడుతూ వచ్చింది. ఈ లోగా అల్లు అర్జున్ షార్ట్ ఫిలిం, యాడ్స్ అంటూ బిజీ అయ్యారు. ఈలోగా త్రివిక్రమ్ చిత్రం స్క్రిప్టుకు పూర్తి స్ధాయిలో మెరుగులు దిద్దారు.

  ప్రస్తుతం ఉపేంద్ర చేస్తున్న పాత్రకు గానూ...జగపతిబాబు, అర్జున్‌ పేర్లనూ పరిశీలించారు. చివరికి ఉపేంద్రను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఇందులో బన్నీ సరసన సమంతతో పాటు ప్రణీత, రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటిస్తారని సమాచారం. స్నేహ ఓ కీలక పాత్రలో నటిస్తుంది. కె.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తారు.

  English summary
  Allu Arjun's latest movie Makers have approached Bollywood Megastar Amitabh Bachchan for the role of Father.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X