»   » వర్మ షూటింగ్ స్పాట్ కు బాలయ్య వెళ్లటానికి అసలు కారణం ఇదా? (ఫొటోలు)

వర్మ షూటింగ్ స్పాట్ కు బాలయ్య వెళ్లటానికి అసలు కారణం ఇదా? (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: తెలుగు సినిమా సర్కిల్స్ లో నే కాదు సినీ లవర్స్ లోనూ హాట్ టాపిక్ గా నిలిచిన అంశం.. నందమూరి బాలకృష్ణ..ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మని కలవటం. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో 'సర్కార్-3'సినిమా చేస్తున్నారు అమితాబ్. ఈ చిత్రం సెట్ కు వెళ్లి బాలకృష్ణ సరదాగా వర్మతో ,బిగ్ బితో ముచ్చటించారు. వీరి మీటింగ్ కు సంభందించిన ఫొటోలు మీరు క్రింద చూడవచ్చు.

  మొదట రామ్ గోపాల్ వర్మ, బాలకృష్ణ కలిసిన ఫొటోలు రాగానే అంతా కంగారు పడ్డారు. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఏదైనా రాబోతోందా అని ఆలోచనలో పడ్డారు. అయితే అంత సీన్ లేదని కాస్సేపటిలోనే తెలిసిపోయింది. బాలయ్య ..అక్కడికి వెళ్లటానికి కారణం కేవలం అమితాబ్ ని కలవటానికే అని తేలింది.

  'సర్కార్‌3' సెట్‌లో ఉన్న అమితాబ్‌ బచ్చన్‌తో సమావేశమయ్యారు. 'సర్కార్‌ 3'ని తెరకెక్కిస్తున్న దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మతోనూ బాలకృష్ణ కాసేపు ముచ్చటించారు.

  ముఖ్యంగా బాలయ్యే స్వయంగా సర్కార్ సెట్స్ కి వెళ్లటం అందరికీ షాకింగ్ గా అనిపించింది. అక్కడ ఆయన అమితాబ్ ను కలిశారు. బాలయ్య వెంట దర్శకుడు కృష్ణ వంశీ కూడా వున్నారు.ఆ ఫొటోలు మీరు ఇక్కడ చూడవచ్చు. అలాగే బాలయ్య, అమితాబ్ కలవటానికి కారణం కూడా ఇక్కడ మీరు చదవవచ్చు.

  వర్మ చెప్పేది ఆసక్తిగా...

  వర్మ చెప్పేది ఆసక్తిగా...

  రామ్ గోపాల్ వర్మ నవ్వుతూ ఏదో చెప్తూంటే బాలయ్య ఆసక్తిగా వింటున్నారు. వాస్తవానికి ఇద్దరూ తమ సినిమాలు చాలా సీరియస్ గా ప్రెజెంట్ చేస్తూంటారు. కానీ రియల్ లైఫ్ లో ఇద్దరు కూడా డిఫరెంట్ వ్యక్యులే. వేర్వేరు ఇమేజ్ లు ఉన్న ఇద్దరు సెలబ్రెటీలు ఒకే చోట కనపడటం ఆశ్చర్యమే కదా.

  సీరియస్ గా చూస్తున్నారు

  సీరియస్ గా చూస్తున్నారు

  రామ్ గోపాల్ వర్మ షాట్ చెప్తున్నట్లున్నారు. బాలయ్య..ఆ విషయాన్ని ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ పొటో చూస్తూంటే రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో బాలయ్య చేస్తున్న సినిమా షూటింగ్ లోతీసినట్లు లేదూ. భలే ఇంట్రస్టింగ్ కదా.

  బాలయ్య ఎంట్రీ భలే సరదా

  బాలయ్య ఎంట్రీ భలే సరదా

  రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో అమితాబ్‌ నటిస్తున్న ‘సర్కార్‌ 3' సినిమా షూటింగ్‌ నిన్నే ప్రారంభమైంది. ఈ సినిమా షూటింగ్‌ సెట్‌కు బాలకృష్ణ వెళ్లారు. బాలకృష్ణ తన సినిమా సెట్ కు రావటంతో వర్మ చాలా హ్యాపీ పీలయ్యినట్లున్నారు. దాంతో సింహా, లెజండ్ తన షూటింగ్ వచ్చిందని ఆయన ట్వీట్స్ చేసారు.

  మేకింగ్ స్టైల్ చూసి ముచ్చట్లు

  మేకింగ్ స్టైల్ చూసి ముచ్చట్లు

  ఈ సందర్భం గా చాలా విషయాలు ముచ్చటించుకున్నారు బాలయ్య ,వర్మ. అలాగే అమితాబ్ యాక్టింగ్ ను లైవ్ లో చూశారు. అంతేకాదు కాసేపు దర్శకుడి సీట్ లో కూర్చొని మోనిటర్ లో అమితాబ్ యాక్టింగ్ పరిశీలించారు. రామ్ గోపాల్ వర్మ మేకింగ్ స్టైల్‌ను దగ్గరుండి చూసి వర్మతోనూ ముచ్చటించారు.

  బిగ్ బితో బాలయ్య..

  బిగ్ బితో బాలయ్య..

  బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌ను టాలీవుడ్‌ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ కలిశారుఈ సందర్భంగా బాలకృష్ణ.. అమితాబ్‌తో ‘గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్రం గురించి కొంత సమయం మాట్లాడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్న బాలకృష్ణ వీలు చూసుకుని వెళ్లి అమితాబ్‌ను పలకరించారట.

  రైతు కోసమే ఇలా

  రైతు కోసమే ఇలా

  బాలకృష్ణ 101వ సినిమాపై దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది. కృష్ణవంశీ దర్శకత్వంలో ‘రైతు' చేయాలనే నిర్ణయానికొచ్చినట్టు సమాచారం. వందో చిత్రంగానే ‘రైతు' తెరకెక్కుతుందని ప్రచారం సాగింది. అంతలో ‘గౌతమిపుత్ర శాతకర్ణి' కథ విని సెట్స్‌పైకి తీసుకెళ్లారు. అయితే ఇప్పుడు ‘రైతు'ని 101వ చిత్రంగా తెరకెక్కించేందుకు రంగం సిద్ధమైంది.

  ‘రైతు' పాత్ర చెప్పటానికే..

  ‘రైతు' పాత్ర చెప్పటానికే..

  ‘రైతు'లో ఓ కీలక పాత్రలో అమితాబ్‌ నటించే అవకాశాలున్నట్టు తెలిసింది. ఆ పాత్ర గురించి చెప్పడానికే బాలకృష్ణ, కృష్ణవంశీ కలిసి వెళ్లినట్టు సమాచారం. అమితాబ్ కూడా చాలా ఆసక్తిచూపిస్తున్నట్లు తెలుస్తోంది.

  బిగ్ బి మాత్రమే

  బిగ్ బి మాత్రమే

  రైతులో కృష్ణవంశీ రాసుకున్న పాత్రకు కేవలం బిగ్ బి మాత్రమే న్యాయం చేయగలరని బాలయ్య భావించారట. అందుకే వెంటనే ఆయన్ని కలిసి ఒప్పించే పనిలో పడ్డారట. ఆ పాత్రకు వేరే వారని తీసుకున్నా నిలబడదని నిర్ణయించుకునే వెళ్లి కలిసారని చెప్పుకుంటున్నారు.

  ఇక్కడే ఉన్నారు అమితాబ్

  ఇక్కడే ఉన్నారు అమితాబ్

  ‘సర్కార్', ‘సర్కార్ రాజ్' లాంటి సినిమాలు అమితాబ్ కు రీ ఎంట్రీలో తిరుగులేని క్రేజ్ తెచ్చిపెట్టాయి. ఇక తాజాగా ఈ సిరీస్‌లో మూడో భాగంగా ‘సర్కార్ 3' తెరకెక్కుతోంది. సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ సినిమా హైద్రాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటోంది.

  గౌతమి పుత్ర శాతకర్ణి క్రేజ్

  గౌతమి పుత్ర శాతకర్ణి క్రేజ్

  క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్న ‘గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ చిత్రంలో శ్రియ, హేమమాలిని, కబీర్‌బేడీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల ‘పింక్‌' చిత్రంతో మంచి హిట్‌ అందుకున్న అమితాబ్‌ ప్రస్తుతం ‘సర్కార్‌ 3'లో నటిస్తున్నారు.

  బాలయ్య వస్తే అంతే..

  బాలయ్య వస్తే అంతే..

  ఇక బాలయ్య రాకతో సర్కార్ 3 సెట్ అంతా కళకళలాడిందట. వర్మ ఇంటెన్సివ్ స్టైల్ మేకింగ్‌తో, భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా గురించి మరిన్ని వివరాలను బాలయ్య అడిగి తెలుసుకున్నారట. వర్మతో ఏమో భవిష్యత్ లో బాలయ్య ప్లాన్ చేసినా చెయ్యవచ్చు అంటున్నారు.

  ఇన్ కేస్, కాంబినేషన్ ఓకే అనుకోండి..

  ఇన్ కేస్, కాంబినేషన్ ఓకే అనుకోండి..

  ఒక వేళ రామ్ గోపాల్ వర్మ, బాలకృష్ణ కాంబినేషన్ లో ఓ సినిమా మొదలయ్యిందనుకోండి. ఏం టైటిల్ పెట్టచ్చు, అలాగే అది ఎలాంటి కథ అయ్యి ఉంటుంది. అలాగే ఈ కాంబో సక్సెస్ అవుతుందా.. మీకు ఏమనుపించిందో క్రింద కామెంట్ల కాలంలో పంచుకోండి.

  English summary
  As both Balakrishna and Krishnavamsi met Bollywood mega hero Amitabh Bachchan on the sets of 'Sarkar 3' in Mumbai, speculations are floating around that Big B may play an important role in 'Rythu'. But no official word from the makers on this front.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more