»   »  'మనం' లో గెస్ట్ గా చేస్తున్నాడా... వేస్టే?

'మనం' లో గెస్ట్ గా చేస్తున్నాడా... వేస్టే?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య కలసి నటించిన చిత్రం 'మనం'. సమంత, శ్రియ హీరోయిన్స్. విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వం వహించారు. అక్కినేని కుటుంబం నిర్మించింది. ఈ చిత్రంలో అమితాబ్ గెస్ట్ గా కనిపించనున్నారని సమాచారం. ఈ మేరకు రీసెంట్ గా హైదరాబాద్ లో షూటింగ్ జరిగిందని సమాచారం. గతంలో ఓ యాడ్ లో నాగార్జున, అమితాబ్ ఇద్దరూ కలిసి నటించారు. అయితే అమితాబ్ గెస్ట్ గా కనిపించటం వల్ల పెద్దగా ఒరిగేది ఏముంది అంటున్నారు. అదే ఏ తెలుగు హీరోనో గెస్ట్ గా చేస్తే వచ్చే మైలేజే వేరనేది నిజం.

నాగార్జున మాట్లాడుతూ "నాన్నగారు నటించిన చివరి చిత్రం కాబట్టిసినిమా మీద అంచనాలు మెండుగా ఉన్నాయి. ట్రైలర్ చూసిన తర్వాత ఇది మంచి సినిమాఅవుతుంది అనిపిస్తోంది.ఇది పూర్తి కుటుంబ సభ్యులతో చూడతగ్గ చిత్రం లా ఉంటుందని చాలా మందిఫోన్లు చేసి వాకబు చేస్తున్నారు. నాన్న,నేను, చైతన్య కలిసి నటించిన ఈ సినిమానుఅన్నపూర్ణ స్టూడియోస్ బేనర్ లో ఓ ప్రెస్టీజియస్ సినిమా గా దర్శకులు విక్రమ్ కుమార్ రూపొందించారుసినిమా ఆడియోను ఈ నెలలో నే విడుదల చేసి సినిమానుమే నెల 23న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాము'' అన్నారు

Amitabh has a guest role in Manam?

అలాగే ...కాలంతోపాటు పద్ధతులు, నాగరికత వల్ల అలవాట్లు మారతాయేమో కానీ ప్రేమ మారదు. నిన్న, నేడు, రేపు.. ఎప్పుడైనా సరే. ప్రేమ ప్రేమే. అదే మా 'మనం' సారం అంటున్నారు నాగార్జున. '' 'ఇంటిల్లిపాది చూడాల్సిన సినిమాలా ఉంది' అంటున్నారంతా. నిజంగానే ఇది అలాంటి సినిమానే. మనందరి ప్రేమకథని 'మనం'లో చూడొచ్చు. మా సంస్థ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన చిత్రమిది. త్వరలో పాటల్ని వినిపిస్తాము''అన్నారు.

అక్కినేని,నాగార్జున, చైతన్య కలిసి నటించిన ఈ సినిమాలో సమంత, శ్రెయహీరోయిన్స్ గా నటిస్తున్నారు. బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అలీ, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్ రెడ్డి, పోసాని కృష్ణ మురళి, నాగినీడు, శరణ్య, కాశీవిశ్వనాథ్, రవిబాబు, వెన్నెల కిషోర్, మెల్కొటే ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈచిత్రానికి మాటలు : హర్షవర్ధన్, పాటలు : చంద్రబోస్, వనమాలి, డాన్స్ : బృంద, ఫైట్స్ : విజయ్, కాస్ట్యూమ్స్: నళిని శ్రీరామ్, ఫోటోగ్రఫీ : పి.ఎస్.వినోద్, సంగీతం : అనూప్ రూబెన్స్, ఆర్ట్ :రాజీవన్, ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వై.సుప్రియ, నిర్మాత : నాగార్జున అక్కినేని, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : విక్రమ్ కె.కుమార్.

English summary
Amitabh Bachchan playing a guest role in Akkineni Nagarjuna’s ‘Manam’. Some scenes involving Amitabh were shot recently in Hyderabad and the team is keeping the news a secret.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu