»   » రంగమ్మత్త జోష్.. మల్టీస్టారర్ చిత్రంలో.. ఆ ఇద్దరి హీరోలతో అనసూయ!

రంగమ్మత్త జోష్.. మల్టీస్టారర్ చిత్రంలో.. ఆ ఇద్దరి హీరోలతో అనసూయ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

రంగమ్మత్త పాత్రతో తెలుగు ప్రేక్షకుల మదిలో గొప్ప స్థానాన్ని సంపాదించుకొన్న నటి అనసూయ మరో భారీ అవకాశాన్ని దక్కించుకొన్నారనే వార్త మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది. సుకుమార్ దర్శకత్వం వహించిన రంగస్థలం చిత్రంలో అనసూయ పోషించిన రంగమ్మత్త పాత్రకు మంచి పేరుతోపాటు విమర్శకుల ప్రశంసలు లభిస్తున్న సంగతి తెలిసిందే.

Rangasthalam Casted By Anasuya Gave Party To Her Co-stars
మల్టీస్టారర్ చిత్రంలో

మల్టీస్టారర్ చిత్రంలో

రంగస్థలం సినిమా తర్వాత అనసూయకు దర్శక, నిర్మాతలు మంచి పాత్రలను ఆఫర్ చేస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో దర్శకుడు అనిల్ రావిపూడి ఓ మంచి పాత్రను అనసూయకు ఆఫర్ చేయగా, దానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తున్నది. అయితే అనసూయ గానీ, అనిల్ రావిపూడి గానీ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో

అనిల్ రావిపూడి దర్శకత్వంలో

అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ చిత్రం ప్రారంభం కానున్నది. నిర్మాత దిల్ రాజు రూపొందిస్తున్న ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్, మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్నారు. ఈ చిత్రం మే నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్నది.

ఎఫ్2లో కీలకపాత్ర

ఎఫ్2లో కీలకపాత్ర

ఈ మల్టీస్టారర్ చిత్రానికి ఎఫ్2 అని టైటిల్ ఖరారైంది. ఎఫ్2 అంటే ఫన్ అండ్ ఫ్రస్టేషన్ అని అర్థం. ఈ చిత్రంలో అనసూయ ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్టు ఫిలింనగర్‌లో ఓ వార్త వైరల్‌గా మారింది.

హీరోయిన్లుగా వీరే

హీరోయిన్లుగా వీరే

సస్సెన్స్, థ్రిల్లర్‌గా రూపొందే చిత్రంలో వెంకటేష్ సరసన తమన్నా భాటియా, వరుణ్ తేజ్‌ పక్కన మెహ్రీన్ ఫిర్జాదా నటిస్తున్నట్టు తెలిసింది. హీరోయిన్ల ఎంపిక విషయంపై శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. త్వరలోనే హీరోయిన్ల ఎంపికపై ఓ ప్రకటన చేసే అవకాశం ఉంది.

English summary
After Rangasthalam huge hit, actress Anasuya Bharadwaj gets huge response for her Rangammatta role. Now Industries full attention towards top anchor cum actor. Reports suggest that, Anasuya got big offer in Director Anil Ravipudi's Multistarrer with Venkatesh and Varun Tej.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X