»   » పవన్ కళ్యాణ్‌‌కు అనసూయ నో ఎందుకు చెబుతోంది?

పవన్ కళ్యాణ్‌‌కు అనసూయ నో ఎందుకు చెబుతోంది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: మాజీ జబర్దస్త్ యాంకర్ అనసూయ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. అనసూయ పవన్ కళ్యాణ్ సినిమాలో అవకాశాన్ని కాదనడమే అందుకు కారణం. నిజానికి, పవన్ కళ్యాణ్ సినిమాలో నటించడానికి ఎవరైనా ఇట్లే ఒప్పేసుకుంటారు. ఆ అవకాశం రావడమే గొప్ప అనుకుంటారు. కానీ అనసూయ మాత్రం పవన్ సినిమా అంటే నో అనేస్తోంది.

కారణం ఏదైన అంతకు ముందు అత్తారింటికి దారేది సినిమాలో ఓ ఐటెం సాంగ్ చేయమంటే గతంలో నిరాకరించింది. ఇలాంటి సినిమా పాటల్లో ఆడి పాడితే ఏం గుర్తింపు వస్తుంది అందుకే ఆ అవకాశం వదులుకున్నా అని సూటిగా చెప్పేసింది. దాంతో పవన్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైంది. ఇటీవల విడుదలైన పవన్ కళ్యాణ్, వెంకటేష్ నటించిన మల్టీస్టారర్ మూవీ గోపాల గోపాలలో కూడా అవకాశం వచ్చిందట అయితే దాన్ని కూడా సున్నితంగా తిరస్కరించిందట.

Anasuya rejects chance in Pawan Kalyan's film

ఆపాత్రకు ఆ సినిమాలో పెద్దగా ప్రాదాన్యం లేకపోవటంతో ఒప్పుకోలేదని ఓ టీవీ ఛానల్ షోలో చెప్పింది అనసూయ. గోపాల గోపాల చిత్రంలో అనీషా అంబ్రోస్ చేసిన టీవి ఛానల్ యాకంర్ పాత్ర అది. నాగార్జున సరసన సోగ్గాడే చిన్ని నాయన చిత్రంలో ఓ పాత్ర చేయటానికి అంగీకరించిన విషయం తెలిసిందే.

ఇదే కాక కొత్త దర్శకుడు ర‌వికాంత్ పారేపు ద‌ర్శ‌క‌త్వం లో తెరకెక్కుతున్న క్ష‌ణం లో కూడా న‌టించ‌టానికి అంగీక‌రించింది. ఈ మధ్య జరిగిన గామా అవార్డు ఫంక్షన్ లో చేసిన పాటలు ఐటెం సాంగ్స్ కి ఏమి తక్కువ లేదన్నట్లు ఉన్నాయి. కానీ పవన్ కళ్యాణ్ సినిమాలో నటించటానికి మాత్రం ససేమిరా ఒప్పుకోవటం లేదు. కారణం ఏమిటో అనసూయకే తెలియాలి.

English summary
It is said that Jabardasth ex anchor Anasuya rejecting chance in Pawan Kalyan's films is a mystery.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu