»   » రెమ్యూనరేషన్లో... చుక్కలు చూపిస్తున్న యాంకర్ అనసూయ!

రెమ్యూనరేషన్లో... చుక్కలు చూపిస్తున్న యాంకర్ అనసూయ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రెండు సినిమాలు చేసిందో లేదో...యాంకర్ అనసూయ రెమ్యూనరేషన్ విషయంలో కొండెక్కి కూర్చుందనే టాక్ వినిపిస్తోంది ఇండస్ట్రీలో. నాగార్జున మూవీ 'సోగ్గటాడే చిన్ని నాయనా' చిత్రంలో యాంకర్ అనసూయ తన గ్లామర్ తో అదరగొట్టింది. తర్వాత 'క్షణం' చిత్రంలో కీలకమైన రోల్ చేసింది. ఈ రెండు చిత్రాలు భారీ విజయం సాధించడంతో అనసూయకు అవకాశాలు వెల్లువెత్తాయి.

Also read: ఖరీదైన కారు కొని అందరికీ షాకిచ్చిన....యాంకర్ అనసూయ!

అయితే తనతో సినిమాలు చేయడానికి వచ్చిన నిర్మాతలకు రెమ్యూనరేషన్ విషయంలో చుక్కలు చూపిస్తోందట. ఏకంగా రూ. 40 లక్షలు డిమాండ్ చేస్తోందట. దీంతో ఆమెతో సినిమాలు చేయడానికి వచ్చిన చాలా మంది నిర్మాతలు వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. పైగా ఆమెది హీరోయిన్ గా చేసే రేంజి కూడా కాదు. మరో వైపు ఇండస్ట్రీలో చాలా మంది టాలెంట్ ఉన్న కొత్త హీరోయిన్లు రూ. 20 లక్షలకే ఓకే చెబుతున్నారు. దీంతో నిర్మాతలు వారి వైపే మొగ్గు చూపుతున్నారని టాక్.

Anchor Anasuya demands 40 lakhs remuneration

అనసూయ ఇంత డిమాండ్ చేయడానికి కారణం యాంకర్ గా జనాల్లో తనకు ఉన్నక్రేజ్ మాత్రమే అని అంటున్నారు. అందుకే ఆమె రెమ్యూనరేషన్ విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదట. ఒక్కసారి తగ్గితే వ్యాల్యూ తగ్గుతుందని, అవకాశాలు తక్కువైనా ఫర్వాలేదని బీష్మించుకుని కూర్చుందట.

అయితే కొన్ని పెద్ద బేనర్లో అనసూయతో సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని, అందుకే తక్కువ రెమ్యూనరేషన్ తో వస్తున్న నిర్మాతల ఆఫర్లను ఆమె తిరస్కరిస్తుందని టాక్. పివిపి బేనర్లోనే అనసూయ మరో సినిమా చేయడానికి సిద్ధమవుతుందని తెలుస్తోంది. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.

English summary
Anchor Anasuya demands 40 lakhs remuneration for movie.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu