»   » నోరు జారిన యాంకర్ రష్మి, వైజాగ్ యువకుడితో పెళ్లి అంటూ పుకార్లు!

నోరు జారిన యాంకర్ రష్మి, వైజాగ్ యువకుడితో పెళ్లి అంటూ పుకార్లు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

విశాఖ: సినీ సెలబ్రిటీలు ఏం మాట్లాడినా అదో సంచలనం అవుతుంది. కొన్ని సార్లు వారు మాట్లాడిన మాటలను మరో రకంగా అర్థం చేసుకుని ఏవేవో ఊహించుకుంటారు అభిమానులు. తాజాగా యాంకర్ రష్మి విషయంలో కూడా ఇలానే జరిగింది.

విశాఖపట్నంలోని మద్దిలపాలెంలో ఓ షాప్ ప్రారంభోత్సవంలో యాంకర్, హీరోయిన్ రష్మి సందడి చేసింది. తన కోసం భారీగా తరలి వచ్చిన అభిమానులను చూసిన ఆనందంలో రెండు మాటలు జారింది. ఇపుడు అవే ఆమెపై పుకార్లు షికార్లు చేయడానికి కారణం అయ్యాయి.

వైజాగ్ యువకుడితో పెళ్లి?

వైజాగ్ యువకుడితో పెళ్లి?

రష్మి త్వరలో వైజాగ్ యువకుడిని పెళ్లాడబోతోంది అంటూ ప్రచారం మొదలైంది. ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తిని ఆమె ప్రేమిస్తోందని, త్వరలోనే పెళ్లి భాజాలు మ్రోగబోతున్నాయని రూమర్స్ స్పెడ్ అయ్యాయి.

 ఈ పుకార్లకు కారణం?

ఈ పుకార్లకు కారణం?

ఈ పుకార్లకు కారణం రష్మి చేసిన కామెంట్సే. వైజాగ్‌లోనే స్థిరడతాను అని ప్రకటించడంతో ఆమె వైజాగ్‌కు చెందిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటుందేమోననే ప్రచారం తెరపైకి వచ్చింది.

రష్మి ఏమంటోంది?

రష్మి ఏమంటోంది?

అయితే రష్మి మాత్రం తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని, తాను వైజాగ్ లో స్థిరపడినంత మాత్రాన అక్కడి వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని అర్థం కాదని తన సన్నిహితులతో అన్నట్లు సమాచారం.

ఇప్పుడే పెళ్లి ఆలోచన లేదు

ఇప్పుడే పెళ్లి ఆలోచన లేదు

తనకు ఇప్పడే పెళ్లి ఆలోచన లేదని, ఇప్పుడిప్పుడే సినిమాల్లో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం తన దృష్టంతా కెరీర్ మీదనే ఉందని రష్మి గతంలో పలు ఇంటర్వ్యూల్లో చెప్పిన సంగతి తెలిసిందే.

రష్మి చేస్తున్న సినిమాలు

రష్మి చేస్తున్న సినిమాలు

గీతా ఆర్ట్స్‌, యువీ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఓ సినిమాలో తాను ఆది సరసన నటిస్తున్నాన‌ని చెప్పింది. ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ అవుతుంద‌ని వైజాగ్ షాపు ప్రారంభోత్సవం సందర్భంగా రష్మి తెలిపారు.

English summary
Jabardust Anchor and Tollywood actress Rashmi inaugurated "SRI SUBHA GRUHA FOODS" at maddilapalem, Vizag.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu