»   » బూతు కంటెంటు ఉండటం వల్లేనా? యాంకర్ రేష్మిని అంత మాటన్నారేంటి?

బూతు కంటెంటు ఉండటం వల్లేనా? యాంకర్ రేష్మిని అంత మాటన్నారేంటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: జబర్దస్త్ కామెడీ షోలో తన హాట్ యాటిట్యూడ్ తో బాగా పాపులర్ అయిన యాంకర్ రేష్మి తర్వాత సినిమాల్లోకి ఎంటరవ్వడం తెలిసిందే. గుంటూరు టాకీస్ సినిమా తర్వాత రేష్మి హాట్ టాపిక్ అయింది. అందుకు కారణం సినిమాలో ఆమె చేసిన హాట్ సీన్లే..

'గుంటూరు టాకీస్' సినిమా విడుదల సమయంలో పోస్టర్లలో రేష్మి ఫోటోలు బాగా వాడారు. ఆ పోస్టర్లు చూసి సినిమాలో రేష్మి పాత్ర కీలకంగా ఉంటుందని అంతా అనుకున్నారు. తీరా సినిమా రిలీజ్ అయ్యాక అందులో ఆమె పెద్దగా ప్రాధాన్యం లేని పాత్రే చేసిందని తేలిపోయింది. కేవలం రేష్మి గ్లామర్ వాడుకోవడానికి, ఆమెతో హాట్ సీన్లు చేయించడానికే ఆమెను తీసుకున్నట్లు తేలిపోయింది.

మరో వైపు ఆమెను అప్పటి వరకు బుల్లితెరపై మామూలుగా చూసిన అభిమానులు, బుల్లితెర ప్రేక్షకులు గుంటూరు టాకీస్ చిత్రంలో ముద్దు సీన్లు, బికినీ సీన్లతో చూసి షాకయ్యారు. రేష్మి ఏంటి ఇలా రెచ్చిపోయింది అంటూ ముక్కున వేలేసుకున్నారు.

గుంటూరు టాకీస్ సినిమా తర్వాత కూడా రేష్మికి వచ్చిన అవకాశాలన్నీ కేవలం ఆమె గ్లామర్‌ను ప్రదర్శించడానికే ఉన్నాయి. దీంతో ఆమెపై బిగ్రేడ్ సినిమాల హీరోయిన్ ముద్ర పడింది. దీంతో ఓ అభిమాని సోషల్ మీడియా ద్వారా ఆమెను ఈ విషయమై ప్రశ్నించినట్లు తెలుస్తోంది. స్లైడ్ షోలో పూర్తి వివరాలు...

మంచివి చేయొచ్చుగా?

మంచివి చేయొచ్చుగా?

'బీ గ్రేడ్ సినిమాల్లో నటించేబదులు మంచి స్టోరీలు ఎంచుకుంటే నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది కదా అంటూ ఇటీవల ఓ అభిమాని సలహా ఇచ్చారట.

మంచివి చెడ్డవి ఉంటాయా?

మంచివి చెడ్డవి ఉంటాయా?

వాస్తవానికి నటనా రంగంలో మంచివి చెడ్డవి అనే తారతమయ్యాలు ఉండవు. పాత్రల్లో నెగెటివ్ షేడ్స్, గ్లామర్ డోస్ ఎక్కువగా ఉంటే ప్రేక్షక్షుల్లో అలాంటి భావన వ్యక్తమవుతుంది.

రేష్మి ఫీలైంది..

రేష్మి ఫీలైంది..

అయితే తనను బి గ్రేడ్ హీరోయిన్ గా లెక్క కట్టడంతో లక్ష్మి కాస్త ఫీలైందట. ఆమె రిప్లై కాస్ల ఘాటుగానే ఇచ్చినట్లు సమాచారం.

సమాధానం ఇలా.

సమాధానం ఇలా.

'తప్పకుండా.. నువ్వు సినిమా ఎప్పుడు ప్రొడ్యూస్ చేస్తున్నావో చెప్పు' అంటూ రేష్మి సమాధానం ఇచ్చిందట.

అవకాశాలు రావడం లేదా?

అవకాశాలు రావడం లేదా?

అభిమాని అలా ప్రశ్నించడంలోనూ విషయం ఉంది. ఇంత పాపులర్ అయిన రష్మి ఇప్పటి వరకు స్టార్ దర్శకులు, స్టార్ హీరోల సినిమాల్లో మాత్రం అవకాశం దక్కించుకోలేదు. వారి సినిమాల్లో రష్మికి అవకాశం రావడం లేదా?

ప్రస్తుతం చేస్తున్న సినిమాలు

ప్రస్తుతం చేస్తున్న సినిమాలు

త్వరలో రష్మి 'తను వచ్చెనంట' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జాంబీ కాన్సెప్టును తొలిసారిగా తెలుగులో చూపించబోతున్నారు. జాంబీ కాన్సెప్టుతో పాటు కామెడీని కూడా జోడించి ఆసక్తికరంగ తెరకెక్కించారు.

రష్మి

రష్మి

‘తను వచ్చెనంట' సినిమాలో రష్మి అందం కూడా హైలెట్ కాబోతోంది. ఇప్పటికే కొన్ని సీన్లు యువతలో ఆసక్తిని పెంచుతున్నాయి.

ఫ్యూచర్ బాగుండాలంటే

ఫ్యూచర్ బాగుండాలంటే

రష్మి ఫ్యూచర్ బావుండాలంటే ఏది పడితే అది కాకుండా... సెలక్టెడ్‌గా పాత్రలు ఎంచుకోవాలని అభిమానులు సూచిస్తున్నారు.

గ్లామర్ తో పాటు

గ్లామర్ తో పాటు

సినిమాల్లో గ్లామర్ ప్రదర్శించడం తప్పనిసరి... దానితో పాటు నటిగా తనను తాను నిరూపించుకుంటేనే గుర్తింపు ఉంటుంది.

ఇమేజ్ తొలగించుకోవాలి

ఇమేజ్ తొలగించుకోవాలి

రేష్మి అంటే ఈ సినిమాలో హాట్ సీన్లు ఉంటాయనే ఇమేజ్ వచ్చేసింది. అలాంటి ఇమేజ్ నుండి బయట పడితే బావుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

English summary
Anchor Rashmi responded on Fan tweet. Rashmi Gautam is an Indian film actress, who appears mostly in Telugu films.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu