twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రకాష్ రాజ్ - 'ఆగడు' వివాదం : తప్పే అని తేల్చారు

    By Srikanya
    |

    హైదరాబాద్ : ప్రకాష్ రాజ్,'ఆగడు' టీమ్ వివాదం మరో మలుపు తిరిగింది. ఈ విషయంలో కలగచేసుకున్న ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (APFCC) ఈ ఇష్యూని సీరియస్ తీసుకున్నట్లు సమాచారం. దర్శకుల సంఘాన్ని, ప్రకాష్ రాజ్ ని ఇద్దరిని మందలించినట్లు తెలుస్తోంది. దర్శకుల సంఘం తన సభ్యులకు ...ప్రకాష్ రాజ్ కు సహకరించవద్దనే మెసేజ్ లు పంపిన విషయంలో తప్పు పట్టింది. అలాగే వివాదం ఛాంబర్ లో డిస్కషన్ స్టేజీలో ఉన్నప్పుడు మీడియా ముందుకు వచ్చిన ప్రకాష్ రాజ్ ని సైతం తప్పు అని తేల్చింది.

    ఈ విషయమై ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్ష్యుడు ఎన్ వి ప్రసాద్ తమ వద్ద డిస్కషన్ జరుగుతున్నప్పుడు మీడియాతో మాట్లాడాల్సిన పని ఏమిటని అంది. ఇక నుంచి మీడియా వద్దకు వెళ్లిన సమస్యలను ఫిల్మ్ ఛాంబర్ పరిగణనలోకి తీసుకోదని,అవి తమ పరిధిలోకి రావని తేల్చి చెప్పారు. హీరో, దర్శకుడు ఎలా ఉన్నా ఇలాంటి వివాదాల వల్ల నిర్మాతకే ఎక్కువ నష్టం అని ఫిల్మ్ ఛాంబర్ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఈ వివాదంపై సోమవారం చర్చించి నిర్ణయిం తీసుకుంటామని తెలియచేసారు.

    'ఆగడు' సినిమా సెట్‌లో తనపై ప్రకాష్‌రాజ్‌ దురుసుగా ప్రవర్తించారనీ, అకారణంగా దుర్భాషలాడారనీ ఒక సహాయ దర్శకుడు ఇటీవల తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘానికి ఫిర్యాదు చేశాడు. దీంతో దర్శకుల సంఘం అత్యవసర సమావేశాన్ని నిర్వహించిన నేపథ్యంలో ప్రకాష్‌రాజ్‌ హైదరాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేయటం ఇప్పుడు ఆయనకే సమస్యగా మారింది. ఆ సమావేశంలో ''జరిగిన సంఘటనను వక్రీకరించి నాపై ఫిర్యాదు చేశారు. ఒక వ్యక్తి ఆడుతున్న నాటకమే ఇదంతా. ఆ వ్యక్తి ఎవరన్నది త్వరలో చెబుతా. నేను మాత్రం ఏ తప్పు చేయలేదు'' అన్నారు ప్రకాష్‌రాజ్‌.

    Andhra Pradesh Film Chamber of Commerce warns Prakash Raj

    ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ ''ఆగడు' సినిమా కోసం నేను మొదటి రోజు సెట్‌లో చేయాల్సిన సన్నివేశాలన్నీ పూర్తి చేశాను. నాకూ, దర్శకుడికీ మధ్య సృజనాత్మకతకి సంబంధించిన భేదాభిప్రాయాలు వచ్చాయి. దాంతో నన్ను కాదనుకొని వేరొక నటుడిని తీసుకొన్నారు. వేరే నటుడిని ఎంచుకొనే హక్కు వారికి ఉంటుంది. ఆ విషయాన్ని అక్కడితో వదిలేయకుండా, ఆ సంఘటనను వక్రీకరించి నాపై దర్శకుల సంఘానికి ఫిర్యాదు చేశారు. బాధాకరమైన విషయమేమిటంటే... ఆవేశంతో ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదును అందుకొని దర్శకుల సంఘం నాపై చర్య తీసుకోవాలని నిర్ణయించడం.

    నేను గత 20, 30 ఏళ్లుగా పరిశ్రమలో కొనసాగుతున్నాను. నా అభిప్రాయాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక కమిటీ వేసి ఇద్దరి వాదనల్నీ విన్న తర్వాతే ఎలాంటి చర్యకైనా సిద్ధపడాలి. అలా కాకుండా ఏకపక్షంగా వ్యవహరించింది దర్శకుల సంఘం. నేను ఈ స్థాయికి రావడం వెనక నా ప్రతిభ, తెలివితేటలు, అవగాహన మాత్రమే కాదు. దర్శకులు, రచయితలు, నిర్మాతలు ప్రోత్సాహం కూడా ఉంది. ప్రేక్షకులు ఆదరించారు.

    అలాగే నేను సినిమా కంటే గొప్పోణ్ని కాను. నా వాదనను 'మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) దగ్గర వినిపించాను. వారిపై నాకు నమ్మకముంది. 'ఆగడు' నిర్మాతలు మంచోళ్లు. వీళ్లు మరో సినిమా చేస్తే అందులో నేను నటిస్తా. నాపై ఫిర్యాదు చేసిన సహాయ దర్శకుడు కూడా మంచోడే. అతను కథ చెబితే నేను రేపు సినిమా చెయొచ్చు. మహేష్‌బాబుకి కూడా నేనేంటో తెలుసు. ఆయనతో ఎన్నో సినిమాలు చేశాను. తనపై కూడా నాకు ఏమీ లేదు. కానీ ఒక వ్యక్తి తన తప్పును కప్పి పుచ్చుకోవడానికి ఇదంతా చేస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరో ఇప్పుడు చెప్పేవాణ్నే. కానీ సంఘం నియమ నిబంధనలకు అది విరుద్ధం కాబట్టి చెప్పలేకపోతున్నా. 'మా' జరిపే విచారణ తర్వాత అసలు విషయాలు వెలుగులోకి వస్తాయ''న్నారు.

    ఆ ఒక్క వ్యక్తి గురించి ప్రకాష్‌రాజ్‌ పద్యం రాసుకొచ్చి సమావేశంలో చదివి వినిపించారు. ''నన్ను రాళ్లతో కొట్టాలనుకోకు... నేను ఆ రాళ్లతో ఇల్లు కడతాను. నన్ను కాల్చేయాలని నిప్పు పెట్టకు, ఆ నిప్పుతో నేను దీపం వెలిగిస్తాను. నన్ను పరిశ్రమ నుంచి పంపించాలనుకోకు, నేను చేరాల్సిన గమ్యానికి ఇంకా త్వరగా చేరుకొంటాను. నన్ను చంపాలని విషం పెట్టకు, మింగి నీలకంఠుడిని అవుతాను'' అని పద్యం చదివి సమావేశం నుంచి వెళ్లిపోయారు.

    English summary
    
 Andhra Pradesh Film Chamber of Commerce (APFCC) is serious on the Directors Association and Prakash Raj regarding 'Aagadu' controversy.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X