twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిజమా ?: ‘ఐ’ విడుదల ఆగటం వెనక ఆంధ్రా నిర్మాత

    By Srikanya
    |

    హైదరాబాద్ : భారతీయ సినిమా మొత్తం ఎంతో ఆసక్తి ఎదురుచూస్తున్న శంకర్‌ - విక్రమ్‌ల ప్రతిష్టాత్మక చిత్రం ‘ఐ' . ఈ చిత్రం విడుదలపై మద్రాస్‌ హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. ఈ స్టే రావటానికి దారితీసిన పరిస్ధితులు వెనక ఓ ఆంధ్రా ప్రొడ్యూసర్ ఉన్నాడంటూ చెన్నై ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఆయన మరెవరో కాదు పివిపి సంస్ద అధినేత ప్రసాద్ వి పొట్లూరి. ఆయన నిర్మాతగానే కాకుండా పెద్ద సినిమాలకు ఫైనాన్స్ చేస్తున్నారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    ఆ క్రమంలో ఈ భారీ చిత్రానికి ఫైనాన్స్ చేసారని, దాంతో ఆ ఫైనాన్స్ ని క్లియర్ చేయమని కోర్టుకు ఎక్కారని చెప్పుకుంటున్నారు. సిని పరిశ్రమ నిభంధనల మేరకు...రిలీజ్ కు ముందే ఫైనాన్స్ లు అన్ని క్లియర్ చెయ్యాలి. దాంతో తమ వద్ద నుంచి తీసుకున్న మొత్తం క్లియర్ చెయ్యకుండా రిలీజ్ చేయటానికి వీల్లేదని పివిపి సంస్ద చెప్పి కోర్టుకు ఎక్కిందని, దాని పర్యవసానమే ఇదంతా అని చెప్పుకుంటున్నారు. అయితే రూమరా ...వాస్తవమా అనేది తెలియాల్సి ఉంది.

    Andhra Producer Behind Stalling of Shankar's I

    ఈ చిత్రాన్ని నిర్మించిన ఆస్కార్‌ రవిచంద్రన్‌ తమ వద్ద తీసుకున్న డబ్బు తిరిగి ఇచ్చేవరకు ‘ఐ' విడుదల చేయకుండా ఆదేశాలివ్వాలని కోరుతూ ఓ తమిళ నిర్మాణ సంస్థ కోర్టుని ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ నెల 30వ తేదీలోపు వివరణ ఇవ్వాలని ఆస్కార్‌ రవిచంద్రన్‌ను ఆదేశిస్తూ.. ‘ఐ' విడుదలపై తాత్కాలిక స్టే విధించింది. సంక్రాంతి కానుకగా 14న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ అనూహ్య పరిణామంతో అభిమానులు షాక్ కి గురయ్యారు.

    ఈ చిత్రంలో విక్రమ్‌ ఈ చిత్రంలో భిన్న పాత్రల్లో కన్పించనున్నారు. ఓ వైపు బాడీబిల్డర్‌ లింగేశ్వర్‌ పాత్ర కోసం బరువు పెరిగి... మళ్లీ గూనివాడి పాత్ర కోసం పూర్తిగా తగ్గారు. సైకిల్‌ హీరోయిన్‌గా మారడం, నోకియా ఫోన్‌ డ్రెస్‌లో కధానాయికను చూపించడం వంటి శంకర్‌ మార్క్‌ మాయాజాలం ఈ చిత్రంలోనూ చూడవచ్చు. ఈ చిత్రాన్ని ఆస్కార్‌ ఫిలిమ్స్‌ పతాకంపై ఆస్కార్‌ రవిచంద్రన్‌ నిర్మించగా తెలుగులో మెగా సూపర్‌గుడ్‌ ఫిలిమ్స్‌ విడుదల చేస్తోంది. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించారు. అమీజాక్సన్‌ హీరోయిన్.

    ఆస్కార్‌ ఫిలింస్‌, మెగా సూపర్‌గుడ్‌ ఫిలింస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థలు సంయుక్తంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాయి. ఇటీవల విడుదలైన పాటలకు లభిస్తున్న స్పందన పట్ల చిత్రబృందం ఆనందం వ్యక్తం చేసింది. ''శంకర్‌ ప్రదర్శించనున్న మరో మాయాజాలం 'ఐ'. విక్రమ్‌ నటన అందరినీ ఆకట్టుకుంటోంది. ఇటీవల ఎక్కడకి వెళ్లినా ఈ చిత్రంలోని గీతాలే వినిపిస్తున్నాయి.

    చేతి వేళ్లకు పూలు పూయడం, ఒంటిపై సీతాకోక చిలుకలు వాలడం, ప్రపంచ వింతలను ఒకే పాటలో చూపించడం ఇవన్నీ ఎక్కడ చూడవచ్చు అంటే సినీ పరిజ్ఞానం ఉన్నవారు ఎవరైనా టక్కున చెప్పేది శంకర్‌ సినిమాలో అని. అందుకు తగినట్లే ఆయన సినిమాలు ఉంటాయి.

    ఈ చిత్రానికి సంబంధించి తాజాగా విడుదల చేసిన టీజర్‌ యూట్యూబ్‌లో విపరీతంగా హల్‌చల్‌ చేస్తోంది. టీజర్‌లో విక్రమ్‌ను చూపించిన విధానం అందర్నీ మంత్రముగ్ధుల్ని చేస్తోంది. మరి ఇక సినిమాలో విక్రమ్‌ విశ్వరూపాన్ని చూడాలంటే కొంచెం వేచి చూడాల్సిందే. యూట్యూబ్‌లో ఈ వీడియోకు హిట్లు 13 లక్షలకుపైగా దాటాయి.

    విక్రమ్‌ గెటప్‌లు, అమీజాక్సన్‌ అందచందాలు, అద్భుతమైన విజువల్‌ ఎఫెక్ట్స్‌తో ఈ చిత్రం ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామ''ని తెలిపాయి చిత్రవర్గాలు. సురేష్‌గోపి, ఉపేన్‌పటేల్‌, సంతానం, రాంకుమార్‌ గణేషన్‌, శ్రీనివాసన్‌, సయ్యద్‌ సిద్ధిక్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: పి.సి.శ్రీరామ్‌, కూర్పు: ఆంటోని, సంగీతం: ఎ.ఆర్‌.రెహమాన్‌.

    English summary
    While the whole film industry and movie buffs are shocked with the Sudden stalling of Shankar's magnum opus I and yet to come to terms with the Madras High Court's decision, not many know that leading film producer and distributor Prasad V Potluri from Andhra Pradesh is behind this.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X