twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టాలీవుడ్‌లో మరో భారీ మల్టీస్టారర్: ఒకే దెబ్బకు ఇద్దరు స్టార్లు.. అనిల్ రావిపూడి అదిరిపోయే స్కెచ్

    |

    తెలుగు ప్రేక్షకుల అభిరుచి రోజు రోజుకూ మారిపోతోంది. ఈ కారణంగానే వాళ్లు కొత్త కొత్త ప్రయోగాత్మక చిత్రాలపై మక్కువ చూపిస్తున్నారు. అలాగే, భిన్నమైన కథలకు మంచి స్పందనను అందిస్తున్నారు. అన్నింటికీ మించి మల్టీస్టారర్ మూవీలకు జై కొడుతున్నారు. అందుకే ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో ఎక్కువగా అలాంటి మూవీలు వస్తున్నాయి. వీటిలో ఎక్కువ శాతం హిట్లుగా నిలుస్తున్నాయి. దీంతో దర్శక నిర్మాతలు, హీరోలు మరిన్ని చిత్రాలు చేయడానికి ముందుకొస్తున్నారు. ఈ క్రమంలోనే సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మరో మల్టీస్టారర్‌ను ప్లాన్ చేశాడని తెలిసింది. ఆ వివరాలు మీకోసం!

    అలా మొదలైన కెరీర్.. అన్నీ విజయాలే

    అలా మొదలైన కెరీర్.. అన్నీ విజయాలే

    కెరీర్ ఆరంభంలో ఎంతో మంది దర్శకుల దగ్గర అసిస్టెంట్‌గా చేయడంతో పాటు కథా రచయితగా పని చేశాడు అనిల్ రావిపూడి. ఈ క్రమంలోనే కల్యాణ్ రామ్ నటించిన 'పటాస్'తో దర్శకుడిగా మారాడు. అప్పటి నుంచి గత ఏడాది వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' వరకు చేసిన చిత్రాలతో విజయాలను అందుకున్నాడు. తద్వారా టాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా వెలుగొందుతున్నాడు.

    ఆ హిట్ మూవీకి సీక్వెల్ చేస్తున్న అనిల్

    ఆ హిట్ మూవీకి సీక్వెల్ చేస్తున్న అనిల్

    ప్రస్తుతం అనిల్ రావిపూడి 'ఎఫ్‌3' మూవీని రూపొందిస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్నారు. మూడేళ్ల క్రితం విడుదలైన భారీ విజయాన్ని అందుకున్న 'ఎఫ్‌2'కు ఇది సీక్వెల‌్‌గా వస్తోంది. మెహ్రీన్, తమన్నా భాటియా హీరోయిన్లు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్న విషయం తెలిసిందే.

    బాలకృష్ణతో సినిమాకు సన్నాహాలు చేసి

    బాలకృష్ణతో సినిమాకు సన్నాహాలు చేసి

    వరుస విజయాలతో దూసుకుపోతోన్న అనిల్ రావిపూడి.. సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణతో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇటీవల వీళ్లిద్దరి మధ్య కథా పరమైన చర్చలు జరిగాయని తెలిసింది. ఈ స్క్రిప్టుకు బాలయ్య వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కూడా వార్తలు వచ్చాయి. దీంతో ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు.

    ఆ ఇద్దరితో కమిట్‌మెంట్.. వస్తుందంటూ

    ఆ ఇద్దరితో కమిట్‌మెంట్.. వస్తుందంటూ

    అనిల్ రావిపూడి చేయబోయే సినిమాల గురించి ఎన్నో వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇప్పటికే 'ఎఫ్‌3' చేస్తున్న అతడు.. త్వరలోనే ఎనర్జిటిక్ స్టార్ రామ్‌తో సినిమా చేయబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. అలాగే, మాస్ మాహారాజా రవితేజతో 'రాజా ది గ్రేట్' సీక్వెల్‌ ప్లాన్ చేస్తున్నాడని కూడా అంటున్నారు. దీంతో ఈ దర్శకుడు ప్రతిరోజూ హాట్ టాపిక్ అవుతూనే ఉన్నాడు.

    టాలీవుడ్‌లో మరో భారీ మల్టీస్టారర్ ప్లాన్

    టాలీవుడ్‌లో మరో భారీ మల్టీస్టారర్ ప్లాన్

    టాలీవుడ్‌లోనే స్టార్ డైరెక్టర్‌గా వెలుగొందుతోన్న అనిల్ రావిపూడి.. వరుసగా ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నాడు. అదే సమయంలో వేగంగా సినిమాలు తీయగలగడంతో హీరోలు కూడా అతడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. అందుకే ఒక్కొక్కరితో సంప్రదింపులు జరుపుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన టాలీవుడ్‌లో మరో భారీ మల్టీస్టారర్‌ను ప్లాన్ చేసినట్లు ఓ న్యూస్ లీకైంది.

    ఒకే దెబ్బకు ఇద్దరు స్టార్లతో సినిమా చేసి

    ఒకే దెబ్బకు ఇద్దరు స్టార్లతో సినిమా చేసి

    తాజా సమాచారం ప్రకారం.. మాస్ మహారాజా రవితేజ.. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనితో కలయికలో ఓ మల్టీస్టారర్ మూవీని ప్లాన్ చేస్తున్నాడట దర్శకుడు అనిల్ రావిపూడి. వాళ్ల బాడీ లాగ్వేజ్‌కు సరిపడేలా ఇప్పటికే ఓ కథను రెడీ చేశాడని తెలుస్తోంది. ఈ కథను త్వరలోనే వీళ్లిద్దరికీ వినిపించబోతున్నాడట. వాళ్లకు నచ్చితే ఒకే దెబ్బకు ఇద్దరితో ఉన్న కమిట్‌మెంట్‌లకు న్యాయం చేస్తాడట.

    English summary
    Anil Ravipudi is an Indian film director and screenwriter who works in Telugu cinema. He made his directorial debut with the comedy Pataas. He then directed the dramedy works such as Supreme, Raja The Great, F2: Fun and Frustration, and Sarileru Neekevvaru. F2 was featured in the "Indian Panorama" Mainstream section of the 50th International Film Festival of India.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X