»   » త్రివిక్రమ్ తో కుదరలేదు... పవన్ కళ్యాణ్ తో సెట్టయ్యేట్టే ఉంది!

త్రివిక్రమ్ తో కుదరలేదు... పవన్ కళ్యాణ్ తో సెట్టయ్యేట్టే ఉంది!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ హీరోగా ఎస్.జె.సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఖుషి' చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది. 2001లో వచ్చిన ఈ బ్లాక్ బస్టర్ మూవీ అప్పట్లో కలెక్షన్లు ఇరగదీసింది. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతున్నట్లు సమాచారం. ఈ మేరకు దర్శకుడు ఎస్.జె.సూర్య ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఎస్.జె సూర్య ఈ సినిమా ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టాడని, టెక్నికల్ టీంని కూడా ఫైనలైజ్ చేస్తున్నాడని టాక్. తాజా సమాచారం ప్రకారం కోలీవుడ్ యంగ్ అండ్ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ ని ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నాడట. బీప్ సాంగ్ వివాదం కారణంగా త్రివిక్రమ్ తో చేయాల్సిన ‘అ..ఆ' ప్రాజెక్టు నుండి బయటకు వచ్చిన అనిరుధ్ ఇపుడు పవన్ కళ్యాణ్ సినిమా ఛాన్స్ దక్కించుకునే ప్రయత్నంలో ఉన్నాడు.

Anirudh Ravichander Confirmed for Pawan's Khushi 2?

మరో ఆసక్తికర విషయం ఏమిటంటే... ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నిర్మాత, దర్శకురాలు రేణు దేశాయ్ సహ నిర్మాతగా వ్యవహరించబోతోందని తెలుస్తోంది. ఇటీవల న్యూఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా రేణు దేశాయ్ ని కలిసిన సూర్య... ఈ విషయమై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహహాన్ సంగీతం అందించబోతున్నారట. త్వరలోనే ఈ విషయమై అఫీషియల్ ప్రకటన వెలువడనుందని అంటున్నారు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్' షూటింగులో బిజీగా ఉన్నారు. కె.ఎస్‌.రవీంద్ర(బాబీ) దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ స్నేహితుడు శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

English summary
Source said that, SJ Suriya has developed a sequel script of 'Khushi' to direct Pawan once again. Anirudh Ravichander, has been roped in as the musician of the movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu