»   » 'గబ్బర్‌ సింగ్‌ 2' కు ఇంకో అడ్డంకి

'గబ్బర్‌ సింగ్‌ 2' కు ఇంకో అడ్డంకి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'గబ్బర్‌ సింగ్‌ 2' . ఈ చిత్రం షూటింగ్ లో ఈ రోజు నుంచి పాల్గొనాలి. కానీ పవన్ ఇప్పుడు పవన్ పొలిటికల్ ఇష్యూస్ తో బిజీ అవుతూండటంతో ఇంకా కొద్ది రోజులు ఆయన సెట్స్ కు రావటానికి పట్టేటట్లు ఉందని తెలుస్తోంది. ఆయన రీసెంట్ గా చేసిన ట్వీట్స్ తో ఈ విషయం స్పష్టమైంది. దాంతో గబ్బర్ సింగ్ ఇంకా లేటు అయ్యే అవకాసం ఉందని చెప్తున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

తెలుగు రాష్ట్రాల్లో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలపై త్వరలో తన అభిప్రాయం వెల్లడిస్తానని పవన్‌కల్యాణ్‌ ట్విట్టర్‌లో స్పష్టం చేశారు. ఓటుకు నోటు, సెక్షన్‌-8, ఫోన్‌ ట్యాపింగ్‌ అంశాలపై ఈ వారాంతం లేదా వచ్చేవారం మొదట్లో మీడియాతో మాట్లాడతానని తెలిపారు.

ఇక 'గబ్బర్‌ సింగ్‌ 2' విషయంలో అన్ని జాగ్రత్తలూ పవన్ తీసుకుంటున్నారు. ఆయన తన 'గబ్బర్‌ సింగ్‌ 2' కోసం ఓ నూతన నటుడ్ని ప్రతినాయకుడిగా తెలుగు చిత్రసీమకు పరిచయం చేయబోతున్నారు. అతనే.. శరత్‌ కేల్కర్‌. ఈ మరాఠీ నటుడు 'గబ్బర్‌సింగ్‌ 2'తో ప్రతినాయకుడిగా అరంగేట్రం చేయబోతున్నాడు.

Another Hurdle For Pawan Kalyan's Gabbar Singh 2

ప్రతినాయకుడి పాత్రకు ఎంతోమందిని పరిశీలించి, ఫొటో షూట్‌లు చేసి.. చివరికి పవన్‌ కేల్కర్‌ని ఎంచుకొన్నారట. ఇటీవల ఇతనిపై కొన్ని సన్నివేశాల్నీ తెరకెక్కించారు. కేల్కర్‌ నటన పట్ల పవన్‌ చాలా సంతృప్తితో ఉన్నారని తెలిసింది. కేల్కర్‌కి తెలుగురాదు. అయినా సరే... తెలుగు నేర్చుకొని, తన డైలాగులను తనేపలికాడట.

కేల్కర్‌ గొంతులో గాంభీర్యం, వృత్తిపై అతనికున్న శ్రద్ధ పవన్‌కి బాగా నచ్చాయని చిత్రబృందం చెబుతోంది. ఇటీవల మహారాష్ట్రలో తొలి షెడ్యూలు పూర్తయింది. త్వరలో హైదరాబాద్‌లో చిత్రీకరణ మొదలెడతారు. బాబి దర్శకతం వహిస్తున్న ఈ చిత్రానికి శరత్‌మరార్‌ నిర్మాత.

English summary
Going by Pawan Kalyan's tweets, he is going to get busy in dealing political issues in the coming few days. So, it is unlikely to see the actor on the sets of Gabbar Singh 2 and hence the project might get delayed further.
Please Wait while comments are loading...