Don't Miss!
- News
ప్రస్తుతానికి పర్వాలేదు.. తర్వాతేం జరుగుతుందో చూద్దాం!
- Finance
h1b layoffs: సెలవులో ఉన్న టెక్కీకి లేఆఫ్.. US వెళ్లే దారిలేక..
- Sports
INDvsAUS : గిల్ బ్యాటింగ్‌తో రాహుల్‌పై ఒత్తిడి.. డేంజర్లో ఓపెనింగ్ స్థానం?
- Lifestyle
Happy Propose Day 2023: మీరు ప్రపోజ్ చేయడానికి ఈ ప్లేసెస్ ది బెస్ట్, అవేంటంటే..
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Pushpa The Rule: పుష్ప 2లో మరో తెలుగు హీరో.. బన్నీ కోసం సుకుమార్ ప్లాన్
బడా ప్రొడ్యూసర్ కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తనదైన శైలి యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, స్టైల్స్‌తో సుదీర్ఘ కాలంగా ప్రేక్షకులను అలరిస్తూ దూసుకుపోతోన్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇంత కాలం టాలీవుడ్‌కే పరిమితం అయిన అతడు.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన 'పుష్ప: ద రైజ్'తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయాడు. గంథపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ దేశ వ్యాప్తంగా హిట్ అయింది. మరీ ముఖ్యంగా 'పుష్ప' హిందీలో వంద కోట్ల వసూళ్లను రాబట్టి రికార్డులు నమోదు చేసింది.
బ్రాలో టెంపరేచర్ పెంచేసిన దివి: అందాల ఆరబోతకు హద్దే లేదుగా!
'పుష్ప ద రైజ్' ఊహించని రీతిలో పాన్ ఇండియా స్థాయిలో విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమా రెండో భాగం 'పుష్ప ద రూల్' మూవీపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో రెండో పార్ట్‌కు సంబంధించిన షూటింగ్‌ను మరింత ఉత్సాహంగా జరపాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే షూటింగ్‌ను కూడా మొదలు పెట్టారు. అలాగే, మరికొద్ది రోజుల్లోనే రెండో షెడ్యూల్‌ను స్టార్ట్ చేయబోతున్నారు. ఇందులో యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేస్తారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి మరో ఆసక్తికరమైన వార్త లీకైంది.

'పుష్ప ద రూల్' మూవీలో ఫలానా స్టార్ హీరో కీలక పాత్రను పోషిస్తున్నాడని ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఎంతో మంది పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. ఇక, తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో టాలీవుడ్‌లోని ఓ స్టార్ హీరో కూడా నటిస్తున్నట్లు తెలిసింది. అతడు ఎవరో తెలియలేదు కానీ.. సుకుమార్ మాత్రం గట్టి ప్రయత్నాలే చేస్తున్నట్లు తెలిసింది. ఇక, ఈ పాత్ర చాలా తక్కువగానే ఉన్నా.. ఎంతో ప్రభావాన్ని చూపించే విధంగా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు, ఇందులో రామ్ చరణ్ కూడా నటిస్తున్నట్లు ఓ న్యూస్ ఇప్పటికే వైరల్ అయిన విషయం తెలిసిందే.
కిటికీ లాంటి టాప్‌లో సీతా రామం హీరోయిన్: ఏం దాచాలో అవే కనిపించేలా!

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో రాబోయే చిత్రమే 'పుష్ప ద రూల్'. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా చేస్తోండగా.. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా నటిస్తున్నాడు. సునీల్, అనసూయ కీలక పాత్రలు చేయనున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని ఇస్తున్నాడు.