శేఖర్ కమ్ముల ఫ్యాన్ ఇండియా మూవీలో మరొక హీరో.. ధనుష్‌తోపాటు టాలీవుడ్ నటుడు?
శేఖర్ కమ్ముల ఎలాంటి సినిమా చేసినా కూడా రెగ్యులర్ సినిమాలకు పూర్తి విబిన్నంగా ఉంటుందని చెప్పవచ్చు. హ్యాపీడేస్ లాంటి సింపుల్ సినిమాతో పాటు లీడర్ లాంటి మంచి సందేశాత్మక సినిమాలతో కూడా జనాలను కదిలించగలరని క్లారిటీగా అర్ధమయ్యింది. ఇక మెల్లగా కమ్ముల కూడా స్టార్ దర్శకుల రేంజ్ లో బార్డర్స్ దాటేస్తున్నారు. ధనుష్ తో ఒక సినిమాను ఎనౌన్స్ చేయగా అందులో ఒక తెలుగు హీరో కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది.

ఎవరితో చేసినా అదే మ్యాజిక్
శేఖర్ కమ్ముల కెరీర్ మొదటి నుంచి కూడా ఒకే తరహా టైమింగ్ తో వెళుతున్నాడు. కొత్త వాళ్ళతో చేసినా స్టార్ క్యాస్ట్ తో చేసినా కూడా ఆయన మ్యాజిక్ లో ఏ మాత్రం తేడా రాలేదు. ఫిదా సినిమాతోనే అందరికి ఒక క్లారిటీ వచ్చేసింది. ఎలాంటి హడావుడి లేకుండా ఒక సింపుల్ ఫ్యామిలీ లవ్ స్టోరీతో కూడా బాక్సాఫీస్ హిట్ కొట్టగలరని నిరూపించారు.

లీడర్ అనంతరం..
అయితే ఈసారి అంతకుమించి అనేలా ధనుష్ తో సినిమాను ఎనౌన్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. తెలుగు తమిళ్ హిందీలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం నిర్మాతలు భారీ బడ్జెట్ కేటాయించినట్లు టాక్. మళ్ళీ లీడర్ అనంతరం శేఖర్ కమ్ముల తీస్తున్న బిగ్గెస్ట్ సినిమా అని తెలుస్తోంది.

మహేష్ బాబుతో చేయాలని..
గతంలో తెలుగులో మహేష్ బాబుతో కూడా సినిమా చేయాలని శేఖర్ కమ్ముల ప్రయత్నాలు చేశాడు. ఫిదా కథ కూడా చెప్పాడు. అయితే కమర్షియల్ గా వర్కౌట్ కాకపోవచ్చని స్టార్ హీరోలు ఎవరు కూడా శేఖర్ కమ్ములతో చేయలేదు. ఇక ధనుష్ ప్రయోగాలు చేయడంలో ముందుంటారు కాబట్టి శేఖర్ కమ్ముల పనితనాన్ని ముందే పసిగట్టి ఒప్పేసుకున్నారు.
Recommended Video

వెంకటేష్ మరొక పాత్రలో?
ఇక ఈ సినిమాలో మరొక స్టార్ హీరో కూడా నటిస్తున్నట్లు టాక్ అయితే వస్తోంది. ఆయన మరెవరో కాదు వెంకటేష్ అని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకు ఒక బలమైన కారణం కూడా ఉంది. గతంలో రానా అరణ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన కమ్ముల అక్కడ వెంకటేష్ ను కలిసి ఒక కథ విషయంలో మాట్లాడాల్సి ఉందని అన్నారట.
స్టేజ్ పై కూడా మీతో వర్క్ చేయాలని ఉందని చెప్పారు. దీంతో శేఖర్ కమ్ముల వెంకీని ముఖ్యమైన పాత్ర కోసం సెలెక్ట్ చేసుకొని ఉండవచ్చని టాక్ అయితే వస్తోంది. చూడాలి మరి ఇది ఎంతవరకు నిజమవుతుందో..?


Click it and Unblock the Notifications











