»   »  ఏఎన్నార్‌ని సీజీ వర్క్‌లో చూపిస్తారట

ఏఎన్నార్‌ని సీజీ వర్క్‌లో చూపిస్తారట

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అక్కినేని వంశంలో మూడు తరాల హీరోలు కలసి నటించిన చిత్రం 'మనం'. విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకుడు. ఈ చిత్రం అనేక ప్రత్యేకతలతో ముస్తాబవుతోంది. అఖిల్‌ ఓ ప్రత్యేక పాత్రలో కనిపిస్తాడని చెప్పుకొంటున్నారు. ఇప్పుడు ఏఎన్నార్‌ క్లాసిక్‌ పాటని ఈ సినిమా కోసం రీమిక్స్‌ చేస్తున్నారని సమాచారమ్‌. అందులో ఆయన్ని సీజీ వర్క్ లో చూపిస్తారని తెలుస్తోంది.

'ప్రేమ్‌నగర్‌'లోని 'నేను పుట్టాను.. ఈలోకం ఏడ్చింది' అనే పాట 'మనం'లో మళ్లీ చూపిస్తారట. ఈ పాటలో అక్కినేని, నాగార్జున, నాగచైతన్య కనిపిస్తారట. ఇటీవలే నాగార్జున, నాగచైతన్యలపై ఈగీతాన్ని తెరకెక్కించినట్టు తెలుస్తోంది. ఏఎన్నార్‌ని సీజీ వర్క్‌లో చూపిస్తారట. మొత్తానికి అక్కినేని అభిమానులకు ఈ సినిమా పరిపూర్ణ విందుభోజనమే. మే 23న 'మనం' విడుదల కాబోతోంది.

అలాగే ...కాలంతోపాటు పద్ధతులు, నాగరికత వల్ల అలవాట్లు మారతాయేమో కానీ ప్రేమ మారదు. నిన్న, నేడు, రేపు.. ఎప్పుడైనా సరే. ప్రేమ ప్రేమే. అదే మా 'మనం' సారం అంటున్నారు నాగార్జున. '' 'ఇంటిల్లిపాది చూడాల్సిన సినిమాలా ఉంది' అంటున్నారంతా. నిజంగానే ఇది అలాంటి సినిమానే. మనందరి ప్రేమకథని 'మనం'లో చూడొచ్చు. మా సంస్థ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన చిత్రమిది. త్వరలో పాటల్ని వినిపిస్తాము''అన్నారు.

Anr in CG work in Manam film

అక్కినేని,నాగార్జున, చైతన్య కలిసి నటించిన ఈ సినిమాలో సమంత, శ్రెయహీరోయిన్స్ గా నటిస్తున్నారు. మిగిలిన పాత్రల్లో బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, అలీ,ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్ రెడ్డి, పోసాని కృష్ణమురళి, నాగినీడు, శరణ్య
కాశీవిశ్వనాధ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌, మాటలు: హర్షవర్థన్‌, పాటలు: చంద్రబోస్‌, వనమాలి
ఈచిత్రంలో సమంత, శ్రీయ హీరోయిన్లు. బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అలీ, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్ రెడ్డి, పోసాని కృష్ణ మురళి, నాగినీడు, శరణ్య, కాశీవిశ్వనాథ్, రవిబాబు, వెన్నెల కిషోర్, మెల్కొటే ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈచిత్రానికి మాటలు : హర్షవర్ధన్, పాటలు : చంద్రబోస్, వనమాలి, డాన్స్ : బృంద, ఫైట్స్ : విజయ్, కాస్ట్యూమ్స్: నళిని శ్రీరామ్, ఫోటోగ్రఫీ : పి.ఎస్.వినోద్, సంగీతం : అనూప్ రూబెన్స్, ఆర్ట్ :రాజీవన్, ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వై.సుప్రియ, నిర్మాత : నాగార్జున అక్కినేని, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : విక్రమ్ కె.కుమార్.

English summary
Akkineni trio starrer Manam - Theatrical Trailer released. Manam will release on May 23rd, said Akkineni Nagarjuna. Nagarjuna is extremely happy with the tremendous response for the trailer of Manam which was released recently.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu