»   » త్రివిక్రమ్ స్ట్రాటజీ ఏంటి ?: పవన్ ప్రక్కన ఆ కుర్ర హీరోయిన్ ని కూడా సీన్ లోకి

త్రివిక్రమ్ స్ట్రాటజీ ఏంటి ?: పవన్ ప్రక్కన ఆ కుర్ర హీరోయిన్ ని కూడా సీన్ లోకి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమ లో హీరోయిన్ల కొరత తీవ్రంగా ఉంది. ఆ కొరత కొత్తగా ఎంట్రీ ఇస్తున్న భామలకు కలిసొస్తుంది. ఒక్క సినిమా క్లిక్ అయితే చాలు కొత్త భామలు వరుస సినిమాలతో బిజీ అయిపోతున్నారు. ఇప్పుడు అను ఇమ్మాన్యుయల్ ది అదే పరిస్దితి. నాని సరసన మజ్ను చిత్రంలో చేసిన ఆమె ఇప్పుడు ఏకంగా పవన్ ప్రక్కన ఛాన్స్ కొట్టేసింది.

పవన్ , త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందే చిత్రంలో కొత్త చిత్రం ఆ మధ్యన లాంఛనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా ఇప్పటికే ఎంపికైంది. ఈ విషయాన్ని కీర్తి సురేష్ స్వయంగా ఖరారు చేసింది. ఇప్పుడు అను ఇమ్మాన్యుయల్ సీన్ లోకి వచ్చింది. ఇద్దరూ యంగ్ హీరోయిన్స్ ని తీసుకోవటం వెనక త్రివిక్రమ్ స్ట్రాటజీ ఏమిటనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

'అత్తారింటికి దారేది' లాంటి భారీ విజయం తర్వాత పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇది. కొంత కాలంగా ఈ సినిమా విషయం వార్తల్లో హాట్ టాపిక్ అవుతోంది. ఎట్టకేలకు ఈ మూవీ ప్రారంభం అయింది.

Anu Emmanuel to play Pawan Kalyan's heroine

పవన్ కళ్యాణ్ తో చేస్తున్న ఈ సినిమా మా బేనర్లో ల్యాండ్ మార్క్ మూవీ అవుతుందని ఎస్ రాధాకృష్ణ తెలిపారు. జనవరి నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని తెలిపారు.

ఈ సినిమా టాప్ టెక్నిషియన్స్ పని చేయబోతున్నారు. సౌత్ లో ఈ మధ్య మ్యూజిక్ పరంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తుండగా, ఇండియాస్ టాప్ మోస్ట్ సినిమాటోగ్రాఫర్.... రావన్, అపరిచితుడు, యే జవాని మై దివాని, మై హూ నా లాంటి చిత్రాలకు పని చేసిన వి మణికందన్ పని చేస్తున్నారు.

అను విషయానికి వస్తే.. ఈ మళయాలి ముద్దుగుమ్మ ది కేవలం ఒక్క సినిమా మాత్రమే రిలీజ్ అయినా వరుస సినిమాలకు సైన్ చేసేస్తోంది. ప్రస్తుతం గోపిచంద్ హీరోగా తెరకెక్కుతున్న ఆక్సిజన్ సినిమాతో ఇప్పటికే చేస్తోంది అను. అయితే ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో రెండు సినిమాలకు ఓకె చెప్పేసింది ఈ బ్యూటి.

Anu Emmanuel to play Pawan Kalyan's heroine

ఇప్పటికే పవన్ హీరోగా తెరకెక్కబోయే సినిమాకు సైన్ చేసిన అను, మరో యంగ్ హీరో రాజ్ తరుణ్ తో కలిసి నటించేందుకు అంగీకరించింది. దొంగాట ఫేం వంశీకృష్ణ దర్శకత్వంలో అనీల్ సుంకర నిర్మిస్తున్న సినిమాలో రాజ్ తరుణ్ తో కలిసి ఆడిపాడేందుకు ఓకె చెప్పింది. మళయాల సినిమా 'యాక్షన్ హీరో బిజు'తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అను ఇమ్మాన్యుయల్, ఇప్పుడు టాలీవుడ్ లో సత్తా చాటేందుకు రెడీ అవుతోంది.

ఈ చిత్రానికి ఆర్ట్: ఎఎస్. ప్రకాష్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పిడివి ప్రసాద్, సమర్పణ: శ్రీమతి మమత, నిర్మాత: ఎస్ రాధాకృష్ణ(చినబాబు), కథ, దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్

English summary
Actress Anu Emmanuel who is set to make her T-Town debut with Nani’s Majnu will also act in Pawan Kalyan-Trivikram Srinivas’s project. Looks like it is going to be another two heroine subject.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu