»   » మహేష్ కి బ్యాక్ లక్ తెస్తూ ఇబ్బంది పెడ్తూ అనుష్క...

మహేష్ కి బ్యాక్ లక్ తెస్తూ ఇబ్బంది పెడ్తూ అనుష్క...

Posted By:
Subscribe to Filmibeat Telugu

మహేష్ తాజా చిత్రం ఖలేజా లో హీరోయిన్ గా అనుష్క చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఆమె పాత్రని త్రివిక్రమ్ చాలా గమ్మత్తుగా తీర్చిదిద్దినట్లు చెప్తున్నారు. అనుష్క పాత్ర ఈ చిత్రం అంతటా హీరో మహేష్ కి ఏదో రకంగా దురదృష్టాన్ని మోసుకొస్తూనే ఉంటుంది. అదే హిలేరియస్ సిట్యువేషన్స్ కు లీడ్ చేస్తుంది అంటున్నారు. ఇక ఈ చిత్రంలో మహేష్ తెగ మాట్లాడే టాక్సీ డ్రైవర్ గా కనపిస్తారు. మహేష్ ఇంతకు ముందెప్పుడూ చెయ్యనంత కామిడీతో ఆ పాత్ర ఉంటుందని చెప్తున్నారు. ఇక అనుష్క కూడా అరుంధతి ఇమేజ్ ని మించే పాత్ర ఈ చిత్రంలో అవుతుందని మురుస్తోంది. సునీల్, బ్రహ్మానందం, మహేష్ ల మధ్య వచ్చే కామిడీకి అనుష్క తోడవటం హిలేరియస్ గా ధియోటర్స్ దద్దరిల్లుతాయని భావిస్తున్నారు. ఇక అనుష్క హీరో మహేష్ గురించి చెబుతూ..అతను విపరీతమైన డెడికేషన్ ఉన్న వ్యక్తి. తన క్రాప్ట్ ని సమర్దవంతగా నిర్వహిస్తూంటాడు.ఆయన స్పాంటినిటీ, ఇప్రవైజేషన్ ఆశ్చర్యం కలిగిస్తూంటాయి. అలాగ మహేష్ బాబు నుండి చాలా నేర్చుకున్నా. అతనితో పనిచేయటం నా అదృష్టం..అంటూ ఓ రేంజిలో తన్మయంతో చెప్తూ మహేష్ బాబు ని ఎత్తేస్తోంది

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu