»   » చిరుకు అనుష్క ఈసారైనా ఛాన్సిస్తుందా!

చిరుకు అనుష్క ఈసారైనా ఛాన్సిస్తుందా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఖైదీ నంబర్ 150 ఘనవిజయంతో మంచి ఊపు మీద ఉన్న మెగాస్టార్ చిరంజీవి తన 151 చిత్రంలో అనుష్కతో జతకట్టేందుకు సిద్ధమవుతున్నారు. వాస్తవానికి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన ఖైదీ నంబర్ 150లో అనుష్క నటించాల్సి ఉంది. ఆ సమయంలో బాహుబలి 2, సింగం 3, ఓం నమో వేంకటేశాయ చిత్రాలతో బిజీగా ఉండడం వల్ల డేట్లు కేటాయించలేకపోయింది. దాంతో చిరు పక్కన నటించే ఛాన్స్ అనుష్క కోల్పోయింది.

Anushka Shetty to act with Chiranjeevi's in next venture

ప్రస్తుతం బాహుబలి, సింగం, ఓం నమో వేంకటేశాయ చిత్రాలన్నీ విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిరుతో తదుపరి సినిమాలో నటించేందుకు ఒకే చెప్పినట్టు సమాచారం. అయితే 151 చిత్రంపై ఇంకా స్పష్టత రానప్పటికీ హీరోయిన్ ఎంపికపై చిత్ర నిర్మాత రాంచరణ్ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తున్నది. చిరంజీవి నటించే తదుపరి చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించే అవకాశముంది.

English summary
Mega star chiranjeevi is getting ready for Next movie. producer Ram charan is eyeing on anushka shetty.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu